AP News: అబ్బా తమ్ముడు.! కారులోనే యాపారం మొదలెట్టేశావ్‌గా.. చెక్ చేయగా కళ్లు జిగేల్..

AP News: అబ్బా తమ్ముడు.! కారులోనే యాపారం మొదలెట్టేశావ్‌గా.. చెక్ చేయగా కళ్లు జిగేల్..

Ravi Kiran

|

Updated on: May 10, 2024 | 5:55 PM

మరికొద్ది గంటల్లో ఏపీలో ఎన్నికల పోలింగ్ జరగనుంది. అయితేనేం కొందరు నేతలు ఎన్నికల తాయిలాలను ప్రజలకు చేర్చేందుకు శతవిధాల ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఈ క్రమంలోనే రాష్ట్రమంతా ఎక్కడిక్కడ చెక్‌పోస్టులు వెలిశాయ్.

మరికొద్ది గంటల్లో ఏపీలో ఎన్నికల పోలింగ్ జరగనుంది. అయితేనేం కొందరు నేతలు ఎన్నికల తాయిలాలను ప్రజలకు చేర్చేందుకు శతవిధాల ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఈ క్రమంలోనే రాష్ట్రమంతా ఎక్కడిక్కడ చెక్‌పోస్టులు వెలిశాయ్. ఇంత జరుగుతున్నా.. తాయిలాల ప్రవాహం మాత్రం ఆగట్లేదు. ఏదొక చెక్‌పోస్ట్ దగ్గర అక్రమంగా తరలిస్తున్న నగదు, బంగారం, వెండి పట్టుబడుతూనే ఉంది. ఇటీవల అనంతపురం జిల్లాలోని అమారాపురంలో రూ. 38 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. అమారాపురం మండలం మద్దనకుంట చెక్‌పోస్ట్ వద్ద కారులో తరలిస్తున్న రూ. 38 లక్షలను పోలీసులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఆ డబ్బును తుంకూర్ నుంచి పావగడకు తరలిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. ఈ వ్యవహారంలో కర్ణాటక ప్రాంతానికి చెందిన మంజునాథ్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు పోలీసులు. పట్టుబడిన నగదుకు ఎలాంటి ఆధారాలు చూపించకపోవడంతో.. ఐటీ అధికారులకు సమాచారం అందించారు