కరివేరు పువ్వుల వినియోగంపై కేరళ సర్కార్ సంచలన నిర్ణయం.. ఆలయాల్లోని పూజలో వాడడంపై నిషేధం..

కేరళ రాష్ట్రంలోని 2 వేల ఆలయాల్లో ఈ పుష్పం వాడడాన్ని ప్రభుత్వం నిషేధించింది. గులాబీ రంగులో ఉండే ఈ పువ్వు అందానికి ప్రసిద్ధి. ఇది ఎక్కువగా దేవాలయాలలో పూజలకు ఉపయోగించబడుతుంది. ఈ కారణంగానే ఆలయాల్లో మొదట నిషేధం విధించారు. కరివేరు పువ్వుల విషయంలో అప్రమత్తంగా ఉండాలని చాలా మంది నిపుణులు ఇప్పటికే సలహా ఇచ్చారు. దీని పువ్వులు, కాండం, ఆకులు మానవులకు వివిధ మార్గాల్లో హాని కలిగిస్తాయి. కరివేరు పువ్వులు ఏ విధాలుగా హాని కలిగిస్తాయో వీటి ప్రభావం తర్వాత ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి? ఎలా అప్రమత్తంగా ఉండాలో తెలుసుకోండి?

కరివేరు పువ్వుల వినియోగంపై కేరళ సర్కార్ సంచలన నిర్ణయం.. ఆలయాల్లోని పూజలో వాడడంపై నిషేధం..
Oleander Flowers
Follow us
Surya Kala

|

Updated on: May 11, 2024 | 7:31 AM

కేరళలో జరిగిన విషాద ఘటనతో కరివేరు పువ్వు (ఒలియాండర్ పువ్వు) సర్వత్రా చర్చనీయాంశమైంది. ,కరివేరు పువ్వు తిని 24 ఏళ్ల నర్సు మృతి చెందింది. ఏప్రిల్ 29న జరిగిన ఈ ఘటన తర్వాత కేరళ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుంది. రాష్ట్రంలోని 2 వేల ఆలయాల్లో ఈ పుష్పం వాడడాన్ని ప్రభుత్వం నిషేధించింది. గులాబీ రంగులో ఉండే ఈ పువ్వు అందానికి ప్రసిద్ధి. ఇది ఎక్కువగా దేవాలయాలలో పూజలకు ఉపయోగించబడుతుంది. ఈ కారణంగానే ఆలయాల్లో మొదట నిషేధం విధించారు.

కరివేరు పువ్వుల విషయంలో అప్రమత్తంగా ఉండాలని చాలా మంది నిపుణులు ఇప్పటికే సలహా ఇచ్చారు. దీని పువ్వులు, కాండం, ఆకులు మానవులకు వివిధ మార్గాల్లో హాని కలిగిస్తాయి. కరివేరు పువ్వులు ఏ విధాలుగా హాని కలిగిస్తాయో వీటి ప్రభావం తర్వాత ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి? ఎలా అప్రమత్తంగా ఉండాలో తెలుసుకోండి?

కరివేరు పువ్వులు విషపూరితమైనవా..?

కరివేరు పువ్వులను వీటి ఆకులను దేవాలయాలను అలంకరించడానికి, పూజ చేసే సమయంలో దేవుడికి సమర్పించడానికి ఉపయోగిస్తారు. ఇది దక్షిణాది దేవాలయాలలో విరివిగా ఉపయోగించబడుతుంది. WebMD నివేదిక ప్రకారం దీనిలో ఉండే రసాయనాల వల్ల ప్రమాదకరం అని చెబుతోంది. ఈ మొక్కలో గ్లైకోసైడ్ అనే రసాయనం ఉంటుంది. ఇది విషపూరితమైనది. ఇది గుండె , కడుపుపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది. ఈ రసాయనం శరీరంలోకి చేరిన వెంటనే గుండె కొట్టుకోవడం నెమ్మదించడం మొదలవుతుంది. ఫలితంగా వ్యక్తి మరణానికి దారి తీస్తుంది.

ఇవి కూడా చదవండి

వెబ్‌ఎమ్‌డి నివేదిక ప్రకారం ఈ పువ్వును తింటేనే హానికరం కాదు.. దీని రసం కూడా చర్మంపై దద్దుర్లు కూడా కలిగిస్తుంది. దీని ఆకులను నమలడం లేదా దాని విత్తనాలను తినడం ప్రాణాంతకం. ఇది ఏ విధంగానూ సురక్షితం కాదు. దీని రసం ప్రభావం వల్ల చర్మ సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. అందుకే దీని పువ్వులు, ఆకులు లేదా కాండం ఉపయోగించడం వల్ల ప్రాణాపాయం పెరుగుతుంది.

కరివేరు పువ్వు గుండె, చర్మానికి మాత్రమే కాకుండా శరీరంలోని అనేక భాగాలకు హాని చేస్తుంది. దీని వల్ల కంటి చూపు కూడా పోతుంది. విరేచనాలు, ఆకలి మందగించడం, కడుపునొప్పి, డిప్రెషన్‌, మూర్ఛపోవడం, తలనొప్పి వంటి లక్షణాలు కనిపించవచ్చు.

కరివేరు పువ్వులు మందులలో ఉపయోగించబడుతుంది

అమెరికాలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ నివేదిక ప్రకారం ఒలియాండర్ అనేక వ్యాధులకు ఔషధంగా ఉపయోగపడుతుంది. ఇందులో ఆస్తమా, మూర్ఛ, పీరియడ్స్, మలేరియా, రింగ్‌వార్మ్ ఉన్నాయి. ఇందులో ఉండే రసాయనాల కారణంగా ఇది నేరుగా ఉపయోగించబడదు, ఎందుకంటే ఇది చాలా విషపూరితమైనది. కొన్ని రకాల ప్రక్రియ ద్వారా మందులలో కలుపుతారని నిపుణులు అంటున్నారు. ఇది చాలా వ్యాధులలో ఉపయోగించబడుతుంది అయితే దీనిని ఉపయోగించే ముందు తప్పని సరిగా వైద్య సలహా తీసుకోవాలి.

కరివేరు పువ్వులు మొక్క 15వ శతాబ్దం నుండి మూలికా ఔషధంగా ఉపయోగించబడుతోంది. అయితే ఇవి విషపూరితమైనందున చాలా జాగ్రత్తగా ఉపయోగిస్తారు. అందువల్ల, ఒలియాండర్ నుండి దూరంగా ఉండటం మంచిదని గుర్తుంచుకోండి. అయితే దక్షిణాసియాలోని కొన్ని దేశాల్లో దీనిని ఆత్మహత్యకు ఉపయోగిస్తారు. శ్రీలంకలోనూ ఇదే ట్రెండ్ కనిపించింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..