పదేళ్లలో 4 రెట్లు పెరిగిన ఎన్నికల ఖర్చు.. ఓటర్లకు విచ్చల విడిగా డబ్బు పంపకం.. మరి ఈసారి.?

2012లో పూరీ జగన్నాథ్ డైరక్షన్‌లో సూపర్ స్టార్ మహేశ్ బాబు నటించిన బిజినెస్ మ్యాన్ సినిమా మీలో ఎంత మంది చూశారు..? చూడకపోతే... ఇది ఎలక్షన్ టైం కనుక.. ఓ సారి ఎలక్షన్ కోసం.. ఎన్నికల్లో అయ్యే ఖర్చుల కోసం మహేశ్ బాబు చెప్పే డైలాగ్స్ ఓ సారి గుర్తు చేస్తా. ఢిల్లీ నుంచి హైకమాండ్ దూత వచ్చినప్పుడు ఎన్నికల ఖర్చు లెక్కల గురించి మహేశ్ సూపర్ డైలాగ్‌ చెబుతాడు.

పదేళ్లలో 4 రెట్లు పెరిగిన ఎన్నికల ఖర్చు.. ఓటర్లకు విచ్చల విడిగా డబ్బు పంపకం.. మరి ఈసారి.?
Follow us

| Edited By: TV9 Telugu

Updated on: May 16, 2024 | 4:16 PM

2012లో పూరీ జగన్నాథ్ డైరక్షన్‌లో సూపర్ స్టార్ మహేశ్ బాబు నటించిన బిజినెస్ మ్యాన్ సినిమా మీలో ఎంత మంది చూశారు..? చూడకపోతే… ఇది ఎలక్షన్ టైం కనుక.. ఓ సారి ఎలక్షన్ కోసం.. ఎన్నికల్లో అయ్యే ఖర్చుల కోసం మహేశ్ బాబు చెప్పే డైలాగ్స్ ఓ సారి గుర్తు చేస్తా. ఢిల్లీ నుంచి హైకమాండ్ దూత వచ్చినప్పుడు ఎన్నికల ఖర్చు లెక్కల గురించి మహేశ్ సూపర్ డైలాగ్‌ చెబుతాడు. ధర్మవరపు సుబ్రహ్మణ్యాన్ని ఉద్ధేశిస్తూ అన్నీ ఛండీగఢ్, ఛత్తీస్ గఢ్‌ లెక్కలు చెబుతావేంటి… ఇప్పుడు ఓటు 500కి రాదు.. ఒక్కోసెంటర్లో 5 వేలు కూడా పెట్టి కొనాల్సి ఉంటుంది అని… మొత్తంగా ఖర్చు 2012లోనే 35వేల కోట్లు అని చెబుతాడు మహేశ్ బాబు. ఒక్కసారి నిన్నగాక మొన్న అంటే ఓ 4 నెలల క్రితం జరిగిన తెలంగాణ ఎన్నికల్లో ఓటుకు 5 వేలు ఇచ్చిన ఊళ్లు ఉన్నాయా .. లేవా… ఇప్పటికిప్పుడు సాక్ష్యాలు చూపించమంటే వల్ల కాదు కానీ.. ఇచ్చిన పార్టీలకు తెలుసు… తీసుకున్న జనాలకు తెలుసు.

అంతెందుకు 2019 సార్వత్రిక ఎన్నికలకు అయిన ఖర్చు ఎంతో తెలుసా.. అక్షరాల సుమారు 60 వేల కోట్లు. అంటే 2012లో డైరక్టర్ పూరీ వేసిన లెక్కలు కరెక్టేనని అనిపిస్తోంది కదా…! సరే 2019లో జరిగిన ఎన్నికల ఖర్చు గురించి ఏ న్యూస్ పేపరో… ఏ సోషల్ మీడియానో.. లేదా టీవీ ఛానెళ్లో చెప్పిన లెక్కలు కావు. సాక్షాత్తు ఢిల్లీ కేంద్రంగా పని చేస్తున్న సెంటర్ ఫర్ మీడియా స్టడీస్ రూపాయి… రూపాయి… లెక్క కట్టి అంచనా చెప్పిన మొత్తం అది. అందులో 20 నుంచి 25 శాతం ఓటర్లకు పంచిన డబ్బే అంటే దాదాపు 12 నుంచి 15 వేల కోట్లు. ఇక ప్రచారానికి పబ్లిసిటీకి ఖర్చు పెట్టిన డబ్బు 30 నుంచి 35 శాతం ఉంటుందని అంచనా వేసింది. అంటే దాదాపు 20 నుంచి 25 వేల కోట్లు. లాజిస్టిక్స్ ఖర్చు 8 నుంచి 10 శాతం అంటే సుమారు 5నుంచి 6వేల కోట్లు. ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో జరిగిన సాధారణ ఖర్చుల శాతం 15 నుంచి 20 . అంటే దాదాపు 10 నుంచి 12 వేల కోట్లు. ఇతర ఖర్చులు సుమారు 3 నుంచి 6 వేల కోట్లు. సో.. మొత్తంగా 55 నుంచి 60 వేల కోట్లు ఖర్చయ్యిందని సెంటర్ ఫర్ మీడియా స్టడీస్ పరిశోధనలో వెల్లడయ్యింది. ఒక్కో లోక్ సభ నియోజవర్గానికి సరాసరి 100 కోట్ల రూపాయలు ఖర్చు కాగా… ఒక్కో ఓటరుకి సరాసరి 700 రూపాయలు పంచారని తేలింది.

Gfx Plate 002

ఇది ఐదేళ్ల క్రితం లెక్క. ఇప్పుడు ఇప్పుడు ఏం జరగబోతోంది..? నిజానికి 2014 ఎన్నికలకు సుమారు 30 వేల కోట్లు ఖర్చుకాగా 2019 నాటికి అది డబుల్ అయ్యింది. ఆ లెక్కన 2024 ఎన్నికలకు డబుల్ అయితే ఇప్పుడు జరగబోయే పెట్టబోయే ఖర్చు దాదాపు ఒక లక్ష 20 వేల కోట్లు. మరి కాస్త లోతుల్లోకెళ్లి చూస్తే 2004లో కేవలం 14 వేల కోట్లు మాత్రమే ఖర్చయ్యింది. అంటే సరిగ్గా 20 ఏళ్లలో ఎన్నికల ఖర్చులు దాదాపు 9 రెట్లు పెరిగింది. అన్నిడబ్బులు ఎక్కడ నుంచి వచ్చాయి..? వీటన్నింటికీ లెక్కలు ఉంటాయా..? ఈసీ లెక్క ప్రకారం చెప్పినంతే అభ్యర్థులు ఖర్చు చేస్తున్నారా..? ఈ ప్రశ్నలు మీరు అడగకూడదు.. సమాధానాలు మేం చెప్పకూడదు. ఎందుకంటే ఆ లెక్కలు.. చిక్కులు.. అన్నీ బహిరంగ రహస్యం 2019 ఎన్నికల్లో పంచడానికి, ఖర్చు పెట్టడానికి తీసుకెళ్తూ దొరికిపోయిన మొత్తమే సుమారు 3 వేల కోట్లు. గత ఏడాది జరిగిన ఒక్క తెలంగాణ ఎన్నికల్లోనే ఎవరూ క్లైం చేసుకొని మొత్తం సుమారు 699 కోట్లు. ఈ లెక్కన దేశంలో 28 రాష్ట్రాలు, 9 కేంద్ర పాలిత ప్రాంతాలు.. వాటితో పాటు ఆంధ్ర ప్రదేశ్, అరుణాచల ప్రదేశ్, సిక్కీం, ఒడిషా రాష్ట్రాల్లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలు. 4 రాష్ట్రాల్లో సిక్కీం, ఒడిషా, అరుణాచల్ ప్రదేశ్ ఒక ఎత్తు. ఆంధ్రప్రదేశ్ ఒక ఎత్తు. ఎన్నికల ఖర్చు విషయంలో తెలంగాణతో – ఏపీ పోటీ పడుతుందనడంలో ఎలాంటి సందేహం ఉండదన్నది రాజకీయ విశ్లేషకుల మాట.

లక్ష 20 వేల కోట్లు ఖర్చు పెట్టే అవకాశం ఉంది సరే.. అసలు రాజకీయ పార్టీలకు ఖర్చు పెట్టేందుకు అంత డబ్బు ఎక్కడ నుంచి వస్తుంది? అందులో లీగల్‌గా వచ్చేదెంత… అడ్డదారుల్లో వచ్చేదెంత..? లెక్కల్లేని సొమ్మును పట్టుకోవడంలో అటు ఈసీ ఇటు పోలీసులు ఎంత శ్రమించినా సరే.. ఎన్ని వేల కోట్లు స్వాధీనం చేసుకున్నా సరే… వెళ్లాల్సిన వారికి డబ్బులు వెళ్లిపోతుండటం, ఓటర్లకు పంచాల్సినంత పంచుతుండటం… మనం ఎన్ని ఎన్నికల్లో చూడలేదు. 2019 ఎన్నికల్లో పార్టీలకు ఎక్కడ నుంచి ఫండ్స్ వచ్చి ఉంటాయన్న వివరాలను పరిశీలిస్తే…రియల్ ఎస్టేట్, మైనింగ్, కార్పొరేట్, ఇండస్ట్రీస్, ట్రేడ్, కాంట్రాక్టర్లు, అందులో ముఖ్యంగా సివిల్ కాంట్రాక్టర్లు, ఇన్ఫ్రా, గవర్నమెంట్ ప్రాజెక్టులు, చిట్ ఫండ్, ఫైనాన్సియల్ సర్వీసులు, ట్రాన్స్ పోర్టర్స్, ట్రాన్స్ పోర్ట్ కాంట్రాక్టర్లు, అనార్గనైజ్డ్ సెక్టార్లు, ఎన్జీఓలు, కార్పొరేట్ విద్యా సంస్థలు, ఎన్ఆర్ఐలు, నటీనటులు, వీళ్లంతా ఎన్నికల ప్రచారానికి అయ్యే ఖర్చును భరించడంలో పార్టీలకు సాయం చేసి ఉండొచ్చన్నది ఓ అంచనా. 2019 ఎన్నికల్లో ఒక్క ఆంధ్ర ప్రదేశ్‌లోనే సుమారు 10వేల కోట్లు ఖర్చు పెట్టి ఉంటారని సెంటర్ ఫర్ మీడియా స్టడీస్ తన నివేదికలో వెల్లడించింది. అది కూడా అసెంబ్లీ-పార్లమెంట్ ఎన్నికల్ని ఒకేసారి నిర్వహించారు కనుక… అంత ఖర్చయ్యింది. అదే వేర్వేరుగా అయితే ఆ ఖర్చు మరింత పెరిగి ఉండేది కూడా.

సెంటర్ ఫర్ మీడియా స్టడీస్ లెక్కల ప్రకారం ఈ సారి దేశంలో ఓటు వేసే ప్రతి ఒక్కరికీ సరాసరి 1240 రూపాయలు పంచే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే ఈ లెక్కలు యావరేజ్ మాత్రమే. ఇందులో కొందరు పైసా తీసుకోకుండా ఓటేసే నిఖార్సైన భారతీయులు ఉండొచ్చు. మరి కొందరు తక్కువ మొత్తంలో తీసుకోవచ్చు.. ఇంకొందరికీ ఎక్కువ మొత్తం అందొచ్చు కూడా. ఇది జస్ట్ యావరేజ్ మాత్రమే. నిజానికి ప్రతి లోక్ సభ అభ్యర్థి 95 లక్షల వరకు, అలాగే అసెంబ్లీ అభ్యర్థి 40 లక్షల వరకు ఎన్నికల్లో ఖర్చు పెట్టేందుకు ఈసీ అనుమతులిస్తుంది. కానీ ఈ లెక్కలకు… ఆ లెక్కలకు నక్కకు .. నాక లోకానికి ఉన్నంత తేడా ఉంటుంది. 2019 ఎన్నికల్లోనే కొన్ని చోట్ల ఒక్కో లోక్ సభ నియోజకవర్గానికి సుమారు 100 కోట్లు చొప్పున అభ్యర్థులు ఖర్చు పెట్టారన్నది అనధికారిక అంచనా.

Gfx Plate 002

సాధారణంగా ఎన్నికల్లో అధికారంలో ఉన్న పార్టీ ఎక్కువ నిధుల్ని సేకరించే అవకాశాలు ఉంటాయి. అందుకే ప్రత్యర్థులతో పోల్చితే వాళ్లు మరింత ఎక్కువే ఖర్చు పెడతారన్న విషయం ఓపెన్ సీక్రెట్. ఇక్కడ ఆ పార్టీ – ఈ పార్టీ అని తేడా ఉండదు. ఎవరు అధికారంలో ఉంటే వాళ్లు. ప్రతి ఎన్నికల్లో తాము నిబంధనల్లో పేర్కొన్నట్టే అభ్యర్థులు ఖర్చు పెట్టి తీరాలన్న ఉద్ధేశంతో ఎన్నికల కమిషన్ పగడ్బందీ ఏర్పాట్లు చేస్తుంది. అన్ని రాష్ట్రాల్లోనూ, జిల్లా కేంద్రాల్లోనూ, నియోజకవర్గాల సరిహద్దుల్లోనూ గట్టి నిఘా పెడుతుంది. అలా పెట్టడం వల్లే లెక్కలకు దొరకని వేల కోట్ల రూపాయుల ప్రతి ఎన్నికల్లో పట్టుబడుతున్నాయి. అయితే ఈసీ ఎంత మొత్తాన్ని పట్టుకుంటోందో.. దాదాపు అంతకు 3-4 రెట్ల మొత్తాన్ని పార్టీలు లెక్కలు చూపించకుండానే ఖర్చు పెడుతుంటాయి. ఎప్పటి లాగే ఈ సారి కూడా ఎన్నికల్లో డబ్బు పంపకాలు జరగకుండా చూసేందుకు ఈసీ ఈ సారి కూడా గట్టి ఏర్పాట్లే చేస్తోంది. సుమారు ఈడీ, ఐటీ, రెవెన్యూ ఇంటిలిజెన్స్, సహా 20 సెంట్రల్ ఏజెన్సీలను రంగంలోకి దింపుతోంది. ఈ సారి దాని ఫలితం ఏ స్థాయిలో ఉంటుందో మున్ముందు చూడాలి.

కొనసాగుతోన్న బంగారం ధర పతనం.. తులం ఎంతకు చేరిందో తెలుసా.?
కొనసాగుతోన్న బంగారం ధర పతనం.. తులం ఎంతకు చేరిందో తెలుసా.?
ఓటీటీలోకి వచ్చేసిన జాన్వీ కపూర్ స్పోర్ట్స్ డ్రామా..
ఓటీటీలోకి వచ్చేసిన జాన్వీ కపూర్ స్పోర్ట్స్ డ్రామా..
Horoscope Today: వ్యక్తిగత సమస్యల నుంచి వారికి విముక్తి..
Horoscope Today: వ్యక్తిగత సమస్యల నుంచి వారికి విముక్తి..
పాకిస్తాన్‌కు షాక్.. ఆసియాకప్ ఫైనల్‌కు లంక.. భారత్‌తో అమీతుమీ
పాకిస్తాన్‌కు షాక్.. ఆసియాకప్ ఫైనల్‌కు లంక.. భారత్‌తో అమీతుమీ
'పాక్ కు రండి బ్రో.. పువ్వుల్లో పెట్టి చూసుకుంటాం': షోయబ్ మాలిక్
'పాక్ కు రండి బ్రో.. పువ్వుల్లో పెట్టి చూసుకుంటాం': షోయబ్ మాలిక్
సలార్ నటుడిపై లైంగిక ఆరోపణలు.. సంచలన విషయాలు బయటపెట్టిన చిన్మయి
సలార్ నటుడిపై లైంగిక ఆరోపణలు.. సంచలన విషయాలు బయటపెట్టిన చిన్మయి
ఢిల్లీ, మహారాష్ట్ర, గుజరాత్‌లో కుండపోత వానలు
ఢిల్లీ, మహారాష్ట్ర, గుజరాత్‌లో కుండపోత వానలు
రూ. 4000 పెన్షన్ పెంచిన ఘనత టీడీపీదే.. అసెంబ్లీలో సీఎం చంద్రబాబు
రూ. 4000 పెన్షన్ పెంచిన ఘనత టీడీపీదే.. అసెంబ్లీలో సీఎం చంద్రబాబు
ఇండస్ట్రీలో హాట్‌టాపిక్‌గా మారిన విశాల్‌ ఇష్యూ
ఇండస్ట్రీలో హాట్‌టాపిక్‌గా మారిన విశాల్‌ ఇష్యూ
కొత్త వ్యాపారంలోకి నటుడు కృష్ణుడు.. ప్రభాస్ పెళ్లి షాపింగ్ ఇక్కడే
కొత్త వ్యాపారంలోకి నటుడు కృష్ణుడు.. ప్రభాస్ పెళ్లి షాపింగ్ ఇక్కడే
గోల్డ్‌పై పెట్టుబడులు పెట్టేవారికి గుడ్‌న్యూస్‌.! ఇదే సరైన సమయం.
గోల్డ్‌పై పెట్టుబడులు పెట్టేవారికి గుడ్‌న్యూస్‌.! ఇదే సరైన సమయం.
భూమ్మీద నూకలున్నాయ్‌. దూసుకెళ్తున్న ట్రైన్‌లోనుంచి జారి పడిన పాప.
భూమ్మీద నూకలున్నాయ్‌. దూసుకెళ్తున్న ట్రైన్‌లోనుంచి జారి పడిన పాప.
నేను ఇప్పటికీ తెలుగులో మాట్లాడేందుకు తడబడుతున్నా.. నారా లోకేష్.
నేను ఇప్పటికీ తెలుగులో మాట్లాడేందుకు తడబడుతున్నా.. నారా లోకేష్.
భారీ వర్షాలతో ఉత్తరాది అతలాకుతలం.. మూడు రాష్ట్రాలకు భారీ వర్షాలు.
భారీ వర్షాలతో ఉత్తరాది అతలాకుతలం.. మూడు రాష్ట్రాలకు భారీ వర్షాలు.
చేపల వేటకు వెళ్లిన బోటుపై తిమింగలం దాడి.. వీడియో వైరల్.
చేపల వేటకు వెళ్లిన బోటుపై తిమింగలం దాడి.. వీడియో వైరల్.
మరక తెచ్చిన తంటా.. ప్రయాణికులను విమానం ఎక్కనివ్వని సిబ్బంది.
మరక తెచ్చిన తంటా.. ప్రయాణికులను విమానం ఎక్కనివ్వని సిబ్బంది.
అనంత్‌-రాధికల మేకిన్‌ ఇండియా వివాహం. ఆర్థికంగా లాభపడిన వ్యాపారులు
అనంత్‌-రాధికల మేకిన్‌ ఇండియా వివాహం. ఆర్థికంగా లాభపడిన వ్యాపారులు
ఒలింపిక్స్ కు పారిస్ రెడీ! మరి మన సంగతేంటి?
ఒలింపిక్స్ కు పారిస్ రెడీ! మరి మన సంగతేంటి?
ఈ బడ్జెట్ లో.. మహిళలకు 'బంగారం' లాంటి శుభవార్త.!
ఈ బడ్జెట్ లో.. మహిళలకు 'బంగారం' లాంటి శుభవార్త.!
బూడిద గుమ్మడికాయ.. ప్రయోజనాలు తెలిస్తే అసలు వదలరు.!
బూడిద గుమ్మడికాయ.. ప్రయోజనాలు తెలిస్తే అసలు వదలరు.!