రోజు సన్ ఫ్లవర్ సీడ్స్‌ను తీసుకుంటే ఎముకల ఆరోగ్యం మెరుగువుతుందని నిపుణులు చెబుతున్నారు. గింజల్లోని కాపర్ ఎముకల జాయింట్లు బాగా పనిచేసేలా పనిచేస్తాయి.
సన్ ఫ్లవర్ సీడ్స్ వల్ల హైబీపీ కంట్రోల్ చేయడంలో ఉపయోగపడుతుంది. ఇందులోని పొటాషియం రక్తపోటును తగ్గిస్తుంది. ఒత్తిడిని తగ్గించే సెరెటోనిన్‌ను ఉత్పత్తి చేస్తుంది.
ఊపిరితిత్తులను బాగు చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఊపిరి పీల్చేటప్పుడు, వదిలేటప్పుడూ ఎదురయ్యే సమస్యల్ని నయం చేయడంలో ఉపయోగపడతాయి.
ఇక సన్ ఫ్లవర్ సీడ్స్‌లో పుష్కలంగా జింక్ ఉంటుంది. దీంతో రోగనిరోధక శక్తి పెరగడంలో కీలక పాత్ర పోషిస్తుంది. రోగాలు తగ్గుముఖం పట్టడంలో ఉపయోగపడుతుంది.
జుట్టు ఆరోగ్యాన్ని కాపాడడంలో కూడా పొద్దు తిరుగుడు విత్తనాలు కీలక పాత్ర పోషిస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఇందులోని సెలెనియం, ప్రోటీన్స్, విటమిన్ ఈ, బీ వంటివి జుట్టు ఆరోగ్యాన్ని కాపాడుతాయి.
బరువు తగ్గాలనుకునే వారు కూడా సన్ ఫ్లవర్ సీడ్స్‌ను తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇందులోని ఫైబర్ కంటెంట్ త్వరగా కడుపు నిండేలా చేస్తుంది.
కంటి ఆరోగ్యాన్ని కాపాడడంలో కూడా పొద్దు తిరుగుడు పువ్వు కీలక పాత్ర పోషిస్తుంది. ఇందులో పుష్కలంగా లభించే విటమిన్ ఈ కంటి ఆరోగ్యాన్ని కాపాడుతాయి.
పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.