రష్మిక లైనప్ మాములుగా లేదుగా.. పుష్ప 2తో సహా 5 భారీ ప్రాజెక్టులు

TV9 Telugu

10 May 2024

కన్నడ ముద్దుగుమ్మ రష్మిక మందన్నను చూసి మిగతా హీరోయిన్లు అసూయపడడం గ్యారెంటీ. ఎందుకంటే ఆమె చేతిలో ప్రస్తుతం 5 భారీ ప్రాజెక్టులున్నాయి.

ఇటీవలే బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ తో సినిమా చేసే ఛాన్స్ కొట్టేసింది రష్మిక మందన్న . దీనికి మురుగదాస్ దర్శకత్వం వహించనున్నారు.

ఇక అల్లు అర్జున్, రష్మిక మందన్న జంటగా నటించిన పుష్ప 2 ఆగస్ట్ 15న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కానుంది.

ఇక కుబేర సినిమాలో కోలీవుడ్ స్టార్ నటుడు ధనుష్‌తో రష్మిక మందన్న స్క్రీన్ షేర్ చేసుకుంటోంది. శేఖర్ కమ్ముల ఈ సినిమాకు దర్శకుడు.

'ది గర్ల్‌ఫ్రెండ్‌’ సినిమాలో ఓ కీలక పాత్రలో నటిస్తుంది రష్మిక. ఈ చిత్రంలో కన్నడ నటుడు దీక్షిత్ శెట్టి కూడా నటిస్తున్నారు.

యానిమల్, సికిందర్ తర్వాత బాలీవుడ్‌లో రష్మిక నటిస్తున్న మరో చిత్రం ‘చవ్వా’. ఈ సినిమాలో విక్కీ కౌశల్‌కి జోడీగా రష్మిక మందన్న నటిస్తోంది.

మొత్తానికి అటు దక్షిణాది సినిమాలతోనూ, హిందీ సినిమాలతోనూ ఫుల్ బిజిబిజీగా ఉంటోంది రష్మిక మందన్నా.

అదే సమయంలో స్టార్ హీరోల పక్కన హీరోయిన్ గా నటిస్తూనే ది గర్ల్ ఫ్రెండ్ అనే లేడీ ఓరియంటెడ్ మూవీలోనూ నటిస్తోందీ ముద్దుగుమ్మ.