Rajinikanth: ఏంటీ.? నిజామా.! రజనీకాంత్ ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారా?
సూపర్ స్టార్ రజనీకాంత్ చాలా మందికి ఆదర్శం. ఆయన కండక్టర్ నుంచి స్టార్ హీరోగా ఎదిగిన తీరు ఎందరికో స్పూర్తి దాయకం. రజినీకి చిన్నప్పటినుంచి ధనవంతులు కావాలనే కోరిక ఉండేదట. అచంచల కృషితో ఆయన తన కల నెరవేర్చుకున్నారు. ప్రస్తుతం ఒక్కో సినిమాకు వందల కోట్లు పారితోషికం తీసుకుంటున్నారు రజినీకాంత్. ధనవంతుడై ఉండీ, సూపర్ స్టార్ హీరో అయిన రజినీకాంత్ ఒకానొక సమయంలో ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నారట. ఆశ్చర్యంగా ఉంది కదూ..
సూపర్ స్టార్ రజనీకాంత్ చాలా మందికి ఆదర్శం. ఆయన కండక్టర్ నుంచి స్టార్ హీరోగా ఎదిగిన తీరు ఎందరికో స్పూర్తి దాయకం. రజినీకి చిన్నప్పటినుంచి ధనవంతులు కావాలనే కోరిక ఉండేదట. అచంచల కృషితో ఆయన తన కల నెరవేర్చుకున్నారు. ప్రస్తుతం ఒక్కో సినిమాకు వందల కోట్లు పారితోషికం తీసుకుంటున్నారు రజినీకాంత్. ధనవంతుడై ఉండీ, సూపర్ స్టార్ హీరో అయిన రజినీకాంత్ ఒకానొక సమయంలో ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నారట. ఆశ్చర్యంగా ఉంది కదూ.. దానికి కారణమేంటో తెలుసుకుందాం.
రజినీ ఓ బస్ కండక్టర్ అని అందరికీ తెలుసు. అంతకు ముందు ఆయన ఆఫీస్ బాయ్‌గా, దినసరి కూలీగా పనిచేశారట. ఆ తర్వాత కండక్టర్ కావాలని నిర్ణయించుకుని కండక్టరయ్యారట. ఆ తర్వాత ధనవంతుడిని కావాలనుకున్నారట. చిన్నప్పటినుంచీ తనకు ధైర్యం ఎక్కకువని, దేనికీ భయపడేవాడిని కాదని చెప్పిన రజినీ విచిత్రంగా ఓ సందర్బంలో ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారట. ఆ రోజు తాను దేవుడిని పూజిస్తూ.. దేవుడి ఫోటోవైపు చూశారట. ఆ తర్వాత తన నిర్ణయం మారిపోయిందని రజినీ అన్నారు. ఆ రాత్రి తనకు ఒక కల వచ్చిందని, ఆ కలలో తెల్లటి గడ్డంతో ఉన్న ఓ వ్యక్తి సంతనోర్వా నదికి అవతలివైపు కూర్చున్నారట. అతను రజినీని తనవద్దకు పిలిచారట. తాను నదిలో ఈత కొట్టకుండానే, ఆయనవద్దకు పరుగెత్తానని రజినీ వివరించారు. మరుసటి రోజు ఆ దేవుడు ఎవరు అని అడిగితే అందరూ శ్రీ రాఘవేంద్ర స్వామి అని చెప్పారగ. తాను ఒక మఠానికి వెళ్లి ధనవంతుడిని అవ్వాలని వేడుకున్నారట. ప్రతి గురువారం ఉపవాసం చేసేవారట. తర్వాత కండక్టర్‌గా మారి ఫిల్మ్ ఇనిస్టిట్యూట్‌లో చేరగా..ఆ సమయంలో బాలచందర్ సార్ తనను గుర్తించడం, ఇప్పుడు తాను స్టార్ కావడం జరిగిందని రజనీ అన్నారు. ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.