Horoscope Today: ఆ రాశి వారికి స్నేహితుల నుంచి సాయం అందుతుంది.. 12 రాశుల వారికి శనివారం రాశిఫలాలు
దిన ఫలాలు (మే 11, 2024): మేష రాశి వారు ఈ రోజు ఆర్థికంగా ఎటువంటి ప్రయత్నం తలపెట్టినా కలిసి వస్తుంది. వృషభ రాశి వారికి ఒకటి రెండు వ్యక్తిగత సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. మిథున రాశి వారు చేపట్టిన వ్యవహారాలు విజయవంతంగా పూర్తవుతాయి. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి శనివారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..
దిన ఫలాలు (మే 11, 2024): మేష రాశి వారు ఈ రోజు ఆర్థికంగా ఎటువంటి ప్రయత్నం తలపెట్టినా కలిసి వస్తుంది. వృషభ రాశి వారికి ఒకటి రెండు వ్యక్తిగత సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. మిథున రాశి వారు చేపట్టిన వ్యవహారాలు విజయవంతంగా పూర్తవుతాయి. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి శనివారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)
వృత్తి, ఉద్యోగాలలో సానుకూల పరిస్థితులు నెలకొంటాయి. ఉద్యోగంలో బాధ్యతల మార్పునకు అవకాశముంది. ఆర్థికంగా ఎటువంటి ప్రయత్నం తలపెట్టినా కలిసి వస్తుంది. వ్యక్తిగత సమస్య లను పరిష్కరించుకోవడం మీద దృష్టి పెడతారు. వ్యాపారంలో సొంత ఆలోచనలు సత్ఫలితాలని స్తాయి. కుటుంబ పరిస్థితులు బాగా అనుకూలంగా ఉంటాయి. ఆస్తి వ్యవహారాల్లో కాస్తంత ఆలో చించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. ఇంటా బయటా అనుకూలతలు బాగా పెరుగుతాయి.
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)
రోజంతా చాలావరకు అనుకూలంగానే గడిచిపోతుంది. ఒకటి రెండు వ్యక్తిగత సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. కొద్ది వ్యయ ప్రయాసలతో ముఖ్యమైన పనుల్ని పూర్తి చేసుకుంటారు. వృత్తి, ఉద్యోగాల్లో సానుకూల వాతావరణం ఉంటుంది. వ్యాపారంలో లాభాలు నిలకడగా ముందుకు సాగుతాయి. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. వివాహ, ఉద్యోగ ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. సోదరులతో వివాదం సమసిపోతుంది. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది.
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)
పెళ్లి ప్రయత్నాల్లో జోరు పెరుగుతుంది. ఉద్యోగ ప్రయత్నాల్లో కూడా పట్టుదల పెరుగుతుంది. చేపట్టిన వ్యవహారాలు విజయవంతంగా పూర్తవుతాయి. ప్రయాణాలు లాభసాటిగా సాగిపోతాయి. మంచి పరిచయాలు ఏర్పడతాయి. బంధువుల నుంచి శుభ వార్తలు అందుతాయి. వృత్తి, వ్యాపారాలు అభివృద్ధి బాటపడతాయి. ఉద్యోగంలో పని భారం ఉన్నా ప్రతిఫలం ఉంటుంది. ఉద్యోగం మారడానికి అవకాశాలు మెరుగుపడతాయి. ఆహార, విహారాల్లో కొద్దిగా జాగ్రత్తగా ఉండడం మంచిది.
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)
అనేక మార్గాల్లో ఆదాయం పెరుగుతుంది కానీ, అందుకు తగ్గట్టుగా ఖర్చులు మీద పడే అవకాశం ఉంది. ముఖ్యమైన వ్యవహారాలు, పనులు సకాలంలో పూర్తవుతాయి. జీవిత భాగస్వామితో కలిసి ఆలయాలు సందర్శిస్తారు. వృత్తి, వ్యాపారాల్లో అంచనాలకు మించి రాబడి పెరగడానికి అవకాశం ఉంది. ఉద్యోగంలో మంచి అవకాశాలు అంది వస్తాయి. ఉద్యోగ ప్రయత్నాలు సఫలం అవుతాయి. కుటుంబ వ్యవహారాలు బాగా అనుకూలంగా ఉంటాయి. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)
కొద్ది ప్రయత్నంతో ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడుతుంది. రావలసిన డబ్బు చేతికి అందు తుంది. ఇతరుల పనులను తలకెత్తుకోకపోవడం మంచిది. ఇతరులకు ఆర్థిక సహాయం చేయడం జరుగుతుంది. స్నేహితుల నుంచి ఆశించిన సహాయ సహకారాలు లభిస్తాయి. ఉద్యోగ జీవితం బాగా అనుకూలంగా సాగిపోతుంది. వృత్తి జీవితంలో బిజీ అయిపోతారు. నిరుద్యోగులకు ఆశించిన ఆఫర్లు అందుతాయి. వ్యాపారాలు నిలకడగా పురోగతి చెందుతాయి. ఆరోగ్యం బాగా అనుకూలిస్తుంది.
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)
వృత్తి, వ్యాపారాల్లో పోటీలను అధిగమిస్తారు. లాభాలకు ఏమాత్రం లోటుండదు. ఉద్యోగంలో హోదా పెరిగే సూచనలున్నాయి. ఉద్యోగులు, నిరుద్యోగుల కొత్త ఉద్యోగ ప్రయత్నాలు సఫలం అవుతాయి. సోదర వర్గంతో విభేదాలు పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. ఉద్యోగం మారడానికి అవకాశం ఉంది. పెండింగ్ పనులన్నీ పూర్తవుతాయి. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా మారుతుంది. పెళ్లి ప్రయ త్నాలకు ఆశించిన స్పందన లభిస్తుంది. తల్లితండ్రుల నుంచి ఆశించిన శుభవార్తలు వింటారు.
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)
వృత్తి, వ్యాపారాల్లో అంచనాలకు మించిన లాభాలు కనిపిస్తాయి. వృత్తి, వ్యాపారాలను విస్తరించే ఆలోచన కూడా చేస్తారు. ఉద్యోగంలో మీ పని తీరుతో అధికారులను ఆకట్టుకుంటారు. ఉద్యోగు లకు, నిరుద్యోగులకు మంచి ఆఫర్లు అందుతాయి. ప్రభుత్వపరంగా లబ్ధి పొందే అవకాశముంది. జీవిత భాగస్వామి సంపాదన పెరుగుతుంది. పిల్లల నుంచి ఆశించిన శుభవార్తలు వింటారు. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు చాలావరకు ఫలప్రదం అవుతాయి. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది.
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)
ఉద్యోగ జీవితం సాఫీగా, హ్యాపీగా సాగిపోతుంది. వృత్తి, వ్యాపారాలు నిదానంగా ముందుకు సాగు తాయి. లాభదాయక పరిచయాలు పెరుగుతాయి. ఆర్థిక వ్యవహారాలు సత్ఫలితాలనిస్తాయి. ఏ పని తలపెట్టినా విజయవంతం అవుతుంది. ప్రయాణాల వల్ల లాభముంటుంది. కుటుంబ పరిస్థి తులు చాలావరకు సానుకూలంగా ఉంటాయి. ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలు పరిష్కారం కావచ్చు. బంధువులతో తొందరపడి మాట్లాడకపోవడం మంచిది. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)
ఉద్యోగంలో అనుకోకుండా కొన్ని మార్పులు జరుగుతాయి. బాధ్యతలు పెరిగే అవకాశముంది. ఆదాయానికి లోటుండదు. అనేక మార్గాల్లో ఆదాయం పెరుగుతుంది. ఖర్చులు తగ్గించుకోవడం మంచిది. ఇంటా బయటా కొద్దిగా ఒత్తిడి ఉండే అవకాశముంది. ప్రతి పనికీ ఒకటికి రెండుసార్లు తిర గాల్సి వస్తుంది. వృత్తి, ఉద్యోగాల్లో మీ శక్తి సామర్థ్యాలను నిరూపించుకుంటారు. వ్యాపారాలు లాభ సాటిగా ముందుకు సాగుతాయి. నిరుద్యోగులకు సమయం అనుకూలంగా ఉంది. ఆరోగ్యం పరవాలేదు.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)
అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. సమయం బాగా అనుకూలంగా ఉంది. వృత్తి, వ్యాపారాల్లో ముందుకు దూసుకుపోతారు. ముఖ్యమైన వ్యవహారాలను సునాయాసంగా పూర్తి చేస్తారు. ఆదాయపరంగా బాగుంటుంది. కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్రం సందర్శిస్తారు. మంచి నిర్ణయాలు తీసుకోవడానికి ఇది అనుకూల సమయం. ఉద్యోగ జీవితం సాఫీగా సాగిపోతుంది. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. ఆహార విహారాల్లో కొద్దిగా జాగ్రత్తలు పాటించడం మంచిది.
కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)
నిరుద్యోగులకు, ఉద్యోగులకు మంచి ఆఫర్లు అందే అవకాశముంది. ఉద్యోగంలో ఆశించిన ఆదరణ, ప్రోత్సాహం లభిస్తాయి. ప్రతిభా పాటవాలు వెలుగులోకి వస్తాయి. వివాహ ప్రయత్నాలకు ఆశించిన స్పందన లభిస్తుంది. మంచి పరిచయాలు ఏర్పడతాయి. అదనపు ఆదాయ ప్రయత్నాలు పూర్తి స్థాయిలో ఫలిస్తాయి. వృత్తి, వ్యాపారాల్లో సమస్యలున్నా అధిగమిస్తారు. బంధువుల నుంచి శుభ వార్తలు అందుతాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ముఖ్యమైన వ్యవహారాలు తేలికగా పూర్తవు తాయి.
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)
అనేక మార్గాల్లో ఆదాయం పెరుగుతుంది. ముఖ్యమైన అవసరాలు తీరిపోతాయి. ఇతరులకు మేలు జరిగే పనులు చేస్తారు. ఆకస్మిక ధన లాభానికి అవకాశముంది. ప్రముఖులతో మంచి పరిచయాలు ఏర్పడతాయి. దాదాపు ప్రతి పనీ పూర్తవుతుంది. వృత్తి, వ్యాపారాల్లో ఆశించిన పురో గతి ఉంటుంది. నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగంలో ప్రాధాన్యం మరింత పెరుగుబ తుంది. వ్యక్తిగత సమస్య ఒకటి అనుకోకుండా పరిష్కారం అవుతుంది. ఆరోగ్యం పరవాలేదు.