Bhagya Yoga: పాప గ్రహాలతో ఆ రాశుల వారికి భాగ్య యోగాలు.. అందులో మీ రాశి కూడా ఉందా?

సాధారణంగా రవి, కుజ, శని, రాహువు, కేతువు వంటి పాప గ్రహాలు కష్టనష్టాలను మాత్రమే ఇస్తాయి. వీటి బాధ భరించలేక చాలామంది పరిహారాలు చేయడం కూడా జరుగుతుంటుంది. అయితే, ప్రస్తుతం మీన రాశిలో ఉన్న కుజ, రాహువులు, వృషభ రాశిలో ప్రవేశించబోతున్న రవి, కన్యా రాశిలో ఉన్న కేతువు, కుంభరాశిలో ఉన్న శనీశ్వరుడి వల్ల కొన్ని రాశులు కష్టనష్టాల నుంచి బయటపడి..

Bhagya Yoga: పాప గ్రహాలతో ఆ రాశుల వారికి భాగ్య యోగాలు.. అందులో మీ రాశి కూడా ఉందా?
Bhagya Yoga
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Janardhan Veluru

Updated on: May 10, 2024 | 5:12 PM

సాధారణంగా రవి, కుజ, శని, రాహువు, కేతువు వంటి పాప గ్రహాలు కష్టనష్టాలను మాత్రమే ఇస్తాయి. వీటి బాధ భరించలేక చాలామంది పరిహారాలు చేయడం కూడా జరుగుతుంటుంది. అయితే, ప్రస్తుతం మీన రాశిలో ఉన్న కుజ, రాహువులు, వృషభ రాశిలో ప్రవేశించబోతున్న రవి, కన్యా రాశిలో ఉన్న కేతువు, కుంభరాశిలో ఉన్న శనీశ్వరుడి వల్ల కొన్ని రాశులు కష్టనష్టాల నుంచి బయటపడి, ఆర్థికంగా బలం పుంజుకోవడం జరుగుతుంది. ఇందులో మేషం, వృషభం, కర్కాటకం, సింహం, తుల, మకర రాశులున్నాయి. వివిధ కారణాల వల్ల చాలా కాలంగా పెండింగులో ఉండిపోయిన శుభ కార్యాలు, పదోన్నతులు, జీతభత్యాల పెరుగుదల, రావలసిన సొమ్ము వంటివి ఇక నుంచి రావడం మొదలవుతుంది.

  1. మేషం: ఈ రాశివారికి ఈ అయిదు గ్రహాలూ బాగా అనుకూలంగా ఉన్నందువల్ల ఉద్యోగ జీవితంలో అనేక సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. ముఖ్యంగా, చాలా కాలం నుంచి ఎదురు చూస్తున్న పదోన్నతి దక్కే అవకాశముంది. ఊహించని ధన యోగాలు పడతాయి. వృత్తి, వ్యాపా రాలు లాభాల పరంగా ఊపందుకుంటాయి. ఒకటి రెండు నెలల్లో పెళ్లి, గృహ ప్రవేశం వంటి శుభ కార్యాలు జరిగే అవకాశముంది. నిరుద్యోగులు మంచి ఉద్యోగంలో స్థిరపడే సూచనలున్నాయి.
  2. వృషభం: ఈ రాశికి కుజ, రాహు, శనీశ్వరుడు, 14 నుంచి రవి పూర్తిగా అనుకూలంగా మారుతున్నందువల్ల సర్వత్రా మాట చెల్లుబాటవుతుంది. మనసులోని కోరికలు నెరవేరుతాయి. ఉద్యోగంలో ప్రాధాన్యం పెరుగుతుంది. రాజకీయ ప్రముఖులతో పరిచయాలు వృద్ధి చెందుతాయి. వృత్తి, వ్యాపారాలు కొత్త పుంతలు తొక్కుతాయి. వ్యాపారాల్లో పెట్టుబడులు పెంచే అవకాశముంది. వృత్తి జీవితం బాగా బిజీ అయిపోతుంది. ఆకస్మిక ధన లాభానికి అవకాశముంది. బ్యాంక్ బ్యాలెన్స్ బాగా పెరుగుతుంది.
  3. కర్కాటకం: ఈ రాశికి కుజ, రాహువులు భాగ్య స్థానంలో, రవి లాభ స్థానంలో, కేతువు తృతీయ స్థానంలో ఉన్నందువల్ల జీవితం నల్లేరు మీది బండిలా సాగిపోతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలపరంగానే కాక, వ్యక్తిగతంగా కూడా కొన్ని కీలకమైన సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. కొన్ని ముఖ్య మైన వివాదాలు కూడా పరిష్కారమవుతాయి. అనేక మార్గాల్లో ఆదాయ వృద్ధి ఉంటుంది. ఉద్యో గంలో పదోన్నతికి, జీతభత్యాల పెరుగుదలకు అవకాశముంది. బ్యాంక్ బ్యాలెన్స్ బాగా పెరుగుతుంది.
  4. సింహం: ఈ రాశివారికి శని, కుజ, రవి, రాహువులు బాగా అనుకూలంగా ఉన్నందువల్ల అనుకున్న పనులు అనుకున్నట్టు జరిగిపోతాయి. ఆర్థిక ప్రయత్నాలన్నీ కలిసి వస్తాయి. ఒకటికి రెండు సార్లు ధన యోగాలు పడతాయి. ఆర్థికంగా ఇతరులకు సహాయం చేసే స్థాయికి చేరుకుంటారు. వృత్తి, ఉద్యోగాల్లో మీ మాటకు, చేతకు తిరుగుండదు. నిరుద్యోగులు ఆశించిన ఉద్యోగంలో స్థిరపడతారు. ఉద్యోగులు మరింత మంచి ఉద్యోగంలోకి మారే అవకాశం ఉంది. ఇంట్లో శుభ కార్యాలు జరుగుతాయి.
  5. తుల: ఈ రాశికి శని, కుజ, రాహువులు బాగా అనుకూలంగా మారినందువల్ల పట్టిందల్లా బంగారం అవుతుంది. లాభదాయక పరిచయాలు ఏర్పడతాయి. వ్యాపారాల్లో సానుకూల ఒప్పందాలు కుదురుతాయి. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. మహా రాజయోగం, మహా భాగ్య యోగం పడతాయి. అనేక మార్గాల్లో సంపద వృద్ధి చెందుతుంది. బ్యాంక్ బ్యాలెన్స్ కు లోటుండదు. వితరణ, సహాయ కార్యక్రమాల్లో పాల్గొని పేరు తెచ్చుకుంటారు. ప్రాభవం బాగా పెరుగుతుంది.
  6. మకరం: ఈ రాశివారికి రాశ్యధిపతి శనీశ్వరుడితో సహా పాప గ్రహాలన్నీ యోగదాయకంగా ఉంటున్నాయి. వీటివల్ల ఉద్యోగంలో మీ ప్రతిభా పాటవాలకు, శక్తి సామర్థ్యాలకు మంచి గుర్తింపు లభిస్తుంది. ఉద్యోగపరంగానే కాక, వృత్తి, వ్యాపారాలపరంగా కూడా ఊహించని ధన యోగాలు పడతాయి. లాభదాయక పరిచయాలు ఏర్పడతాయి. ప్రభుత్వమూలక ధన లాభం కూడా ఉంది. నిరుద్యోగు లకు ప్రభుత్వ ఉద్యోగం లభించే సూచనలున్నాయి. అనేక మార్గాల్లో సంపాదన పెరుగుతుంది.

'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?
జియో నుంచి 98 రోజుల వ్యాలిడిటీ ఉండే ప్లాన్‌ గురించి మీకు తెలుసా?
జియో నుంచి 98 రోజుల వ్యాలిడిటీ ఉండే ప్లాన్‌ గురించి మీకు తెలుసా?
స్వీట్‌ పొటాటో తింటే.. మీ గుండె ఆరోగ్యానికి ఢోకా ఉండదు.. మరెన్నో
స్వీట్‌ పొటాటో తింటే.. మీ గుండె ఆరోగ్యానికి ఢోకా ఉండదు.. మరెన్నో
ప్లానింగ్‌తో పిచ్చెక్కిస్తున్న డాకూ మహరాజ్
ప్లానింగ్‌తో పిచ్చెక్కిస్తున్న డాకూ మహరాజ్
ఎరక్కపోయి ఇరుక్కున్నాడా..! ఈ కేసు నుంచి బన్నీ బయటపడే దారుందా..?
ఎరక్కపోయి ఇరుక్కున్నాడా..! ఈ కేసు నుంచి బన్నీ బయటపడే దారుందా..?
మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్..
మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్..
డ్రై ఆప్రికాట్లు తింటే.. బోలెడు లాభాలు ! తెలిస్తే రోజూ తింటారు..
డ్రై ఆప్రికాట్లు తింటే.. బోలెడు లాభాలు ! తెలిస్తే రోజూ తింటారు..
ప్రభాస్ సలార్ సినిమాపై ప్రశాంత్ నీల్ షాకింగ్ కామెంట్స్
ప్రభాస్ సలార్ సినిమాపై ప్రశాంత్ నీల్ షాకింగ్ కామెంట్స్
అక్షర్ పటేల్ జీవితంలో కొత్త అధ్యాయం - హక్ష్ పటేల్‌కు స్వాగతం!
అక్షర్ పటేల్ జీవితంలో కొత్త అధ్యాయం - హక్ష్ పటేల్‌కు స్వాగతం!