సీఎం జగన్‌తో జపాన్ కాన్సులేట్ జనరల్ భేటి!

అమరావతి: చెన్నైలో ఉన్న జపాన్‌ కాన్సులేట్‌ జనరల్‌ కొజిరొ ఉచియామ ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌తో భేటీ అయ్యారు. రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటు సహా ద్వైపాక్షిక అంశాలపై చర్చించారు. జపాన్‌లో పర్యటించాలంటూ ముఖ్యమంత్రి జగన్‌ను ఉచియామ ఆహ్వానించారు. ఈ సందర్భంగా అవినీతి రహిత, పారదర్శక పాలన కోసం రాష్ట్రంలో తీసుకుంటున్న చర్యలను సీఎం వివరించారు. దీనివల్ల భూములు, నీళ్లు, కరెంటు రేట్లు తగ్గుతాయని, పారిశ్రామిక వర్గాలకు మేలు జరుగుతుందని జపాన్‌ కాన్సులేట్‌ జనరల్‌కు సీఎం వివరించారు. అత్యాధునిక […]

సీఎం జగన్‌తో జపాన్ కాన్సులేట్ జనరల్ భేటి!
Follow us

|

Updated on: Jul 30, 2019 | 1:34 AM

అమరావతి: చెన్నైలో ఉన్న జపాన్‌ కాన్సులేట్‌ జనరల్‌ కొజిరొ ఉచియామ ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌తో భేటీ అయ్యారు. రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటు సహా ద్వైపాక్షిక అంశాలపై చర్చించారు. జపాన్‌లో పర్యటించాలంటూ ముఖ్యమంత్రి జగన్‌ను ఉచియామ ఆహ్వానించారు. ఈ సందర్భంగా అవినీతి రహిత, పారదర్శక పాలన కోసం రాష్ట్రంలో తీసుకుంటున్న చర్యలను సీఎం వివరించారు. దీనివల్ల భూములు, నీళ్లు, కరెంటు రేట్లు తగ్గుతాయని, పారిశ్రామిక వర్గాలకు మేలు జరుగుతుందని జపాన్‌ కాన్సులేట్‌ జనరల్‌కు సీఎం వివరించారు.

అత్యాధునిక వసతులున్న పోర్టులు, మౌలిక సదుపాయాలు, నైపుణ్యమున్న మానవవనరులు అందుబాటులో ఉన్నందున జపాన్‌ కంపెనీలకు ఆంధ్రప్రదేశ్‌ అనుకూలంగా ఉంటున్న విషయాన్నీ సీఎం వారి ద‌ృష్టికి తీసుకెళ్లారు. కొత్తగా తీసుకొచ్చిన ఆంధ్రప్రదేశ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్రమోషన్‌ అండ్‌ మానిటరింగ్‌ ద్వారా పెట్టుబడుల ఆలోచన నుంచి ఉత్పత్తి దశ వరకూ కూడా పూర్తి స్థాయిలో సహాయకారిగా ఉంటామనివివరించారు. ఎలక్ట్రిక్‌ బస్సులను ప్రవేశపెట్టే ఆలోచన చేస్తున్నామని, ఆ దిశగా పెట్టుబడుల పెట్టే ఆలోచన చేయాలని ముఖ్యమంత్రి కోరారు.