Breaking News
  • ఢిల్లీ: భారత్ లో విజృంభిస్తున్న కరోనా వైరస్. ఒక లక్ష 45 వేల మార్క్ ని దాటినా కరోనా పాజిటివ్ కేస్ లు. దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు : 145380. దేశ వ్యాప్తంగా యాక్టీవ్ కేసులు: 80722. కరోనా నుంచి డిశ్చార్జ్ అయిన బాధితులు: 60491. దేశం మొత్తం కరోనా తో మృతుల సంఖ్య : 4167. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ.
  • దేశంలోని వివిధ ప్రాంతాలలో చిక్కుకుపోయిన వలస కార్మికుల దుస్థితిని సుమోటోగా స్వీకరించిన సుప్రీంకోర్టు. కేంద్రానికి,రాష్ట్రాలు,కేంద్ర పాలిత ప్రాంతాలకు నోటీసులు జారీ చేసిన సుప్రీంకోర్టు. వలస కూలీల కష్టాలను తీర్చడానికి తీసుకున్న చర్యలు ఏంటో చెప్పాలని కోరిన ధర్మాసనం. మే 28 కి విచారించనున్న సుప్రీంకోర్టు. కేంద్రం ,రాష్ట్ర ప్రభుత్వాలలో కొన్నీ లోపాలు ఉన్నాయని కోర్టు వెల్లడి. వలస కూలీలకు ప్రయాణం, ఆశ్రయం, ఆహారాన్ని అందించడానికి తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ.
  • ఆర్‌పిఎఫ్ సిబ్బంది కి కరోనా పాజిటివ్. లూధియానా లోని రైల్వే స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న 7 మంది ఆర్‌పిఎఫ్ సిబ్బంది కి కరోనా పాజిటివ్. సుమారు 100 మంది సిబ్బందిని హోమ్ క్వారం టైన్ కి పంపించిన అధికారులు. డైరెక్టర్ జనరల్ (డిజి), రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్.
  • లాక్ డౌన్ సమయంలో ఇబ్బందులు పడుతున్న సినీ కార్మికులకు చేయుత. మంత్రి తలసాని శ్రీనివాస్ ఆధ్వర్యంలో 14 వేల మంది సినీ కార్మికులకు, టెలివిజన్ కార్మికులకు సొంత ట్రస్ట్ ద్వారా నిత్యావసర వస్తువులు పంపిణీకి శ్రీకారం.
  • అమరావతి: అధికార వికేంద్రీకరణ బిల్లు పరిశీలనకు మండలి చైర్మన్ సెలెక్ట్ కమిటీ వేయాలని ఆదేశించిన అమలు కావడం లేదని హైకోర్టులో పిటిషన్ వేసిన టీడీపీ ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి. 8 మంది సభ్యులతో కమిటీ వేయాలని మండలి చైర్మన్ ఆదేశించినా మండలి కార్యదర్శి అమలు చేయడం లేదని పిటిషన్ లో తెలిపిన దీపక్ రెడ్డి. నేడు విచారణ జరపనున్న హైకోర్టు.
  • అమరావతి: రాష్ట్రంలో నగలు, బట్టలు, చెప్పులు షాపులు తెరిచేందుకు అనుమతి. స్ట్రీట్ ఫుడ్స్ కి సైతం అనుమతి మంజూరు . అనుసరించాల్సిన విధానాల పై సర్కులర్ జారీ . పెద్ద షో రూమ్ కు వెళ్లాలంటే ముందే ఆన్లైన్ లో అనుమతి తప్పనిసరి. అన్ని షాపులో ట్రైల్ రూము లకి అనుమతి నిరాకరణ . పాని పూరి బండ్లకు అనుమతి నిరాకరణ.

చంద్రుడికి మరింత చేరువలో చంద్ర‌యాన్-2

యావత్ భారతదేశం గర్వపడేలా ఇండియన్ సైంటిస్టులు నిర్వహించిన మిషన్ మూన్ ప్రయోగం నుంచి లేటెస్ట్ అబ్డేట్ వచ్చింది.  ఈ నెల 22న అంతరిక్షంలోకి  ఇస్రో ప్రయోగించిన  చంద్రయాన్-2 వాహకనౌక భూ కక్ష్యను మూడ‌వ‌సారి పెంచారు సైంటిస్టులు.  శుక్ర‌వారం తెల్లవారు జామున విజయవంతంగా రెండో ప్రక్రియను పూర్తి చేసిన తర్వాత  ఇవాళ మ‌ధ్యాహ్నం 3.12 నిమిషాల‌కు మూడ‌వ ప్ర‌క్రియ‌ను విజ‌య‌వంతంగా చేప‌ట్టారు. సుమారు 989 నిమిషాల పాటు ఈ ప్ర‌క్రియ కొన‌సాగింది. ఆ త‌ర్వాత చంద్ర‌యాన్‌-2 వాహ‌క‌నౌక 276 x 71792 కిలోమీట‌ర్ల ఎత్తుకు చేరుకుంది. దీంతో చంద్రుడికి చంద్ర‌యాన్ మ‌రింత చేరువైంది. చంద్ర‌యాన్ వ్యోమ‌నౌక అన్ని ప్యారామీట‌ర్ల‌తో స‌హ‌జంగా వెళ్తున్న‌ట్లు ఇస్రో వ‌ర్గాలు వెల్ల‌డించాయి. ఆగ‌స్టు 2వ తేదీన వ్యోమ‌నౌక‌కు చెందిన నాలుగ‌వ భూక‌క్ష్య పెంపు ప్రక్రియ‌ను నిర్వ‌హించ‌నున్నారు. ఆ రోజున మ‌ధ్యాహ్నం 2 నుంచి 3 గంట‌ల మ‌ధ్య ఈ ప్ర‌క్రియ ఉంటుంద‌ని ఇస్రో చెప్పింది. ఆగస్టు 14 వరకు మిగిలిన‌ కక్ష్యలను పెంచే ప్రక్రియను చేపడతామని ఇస్రో వెల్లడించింది.

Related Tags