AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

BLACK Movie Trailer : ‘నా ఎనిమి నా కంటికి కనిపించాడు.. కానీ వాడితోనే పోరాడాలి’.. ఆకట్టుకుంటున్న బ్లాక్ ట్రైలర్

యంగ్ హీరో ఆది సాయి కుమార్ సాలిడ్ సక్సెస్ కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్నాడు బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నప్పటికీ హింట్ మాత్రం అందుకోలేకపోతున్నాడు .

BLACK Movie Trailer : 'నా ఎనిమి నా కంటికి కనిపించాడు.. కానీ వాడితోనే పోరాడాలి'.. ఆకట్టుకుంటున్న బ్లాక్ ట్రైలర్
Black
Rajeev Rayala
|

Updated on: May 22, 2022 | 8:50 AM

Share

యంగ్ హీరో ఆది సాయి కుమార్(Aadi Sai Kumar) సాలిడ్ సక్సెస్ కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్నాడు బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నప్పటికీ హింట్ మాత్రం అందుకోలేకపోతున్నాడు. హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. ఈ క్రమంలో ఇప్పుడు మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అయ్యాడు. మహంకాళి మూవీస్ పతాకంపై ఆది సాయి కుమార్ హీరో గా బిగ్ బాస్ ఫేమ్ కౌషల్ మండా ముఖ్యమైన పాత్రలో జి బి కృష్ణ దర్శకత్వంలో మహంకాళి దివాకర్ నిర్మిస్తున్న చిత్రం “బ్లాక్”(BLACK). ఈ చిత్రం థియేట్రికల్ ట్రైలర్ ను ఆది తండ్రి నటుడు సాయి కుమార్  విడుదల చేశారు. ఈ చిత్రాన్ని మే నెల 28న విడుదల చేస్తున్నారు.

ఈ సందర్భంగా సాయి కుమార్ గారు మాట్లాడుతూ “ఇప్పుడే మీడియా మిత్రులతో పాటు థియేట్రికల్ ట్రైలర్ ని చూసాను, ట్రైలర్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. యూనిట్ సభ్యులందరికి నా శుభాకాంక్షలు. పూరి జగన్నాధ్ గారి దగ్గర పని చేసిన జి బి కృష్ణ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం మే 28న విడుదల అవుతుంది. మే 28 చాలా గొప్ప రోజు, ఎన్ టి ఆర్ గారి పుట్టిన రోజు. అంత గొప్ప రోజు నా కొడుకు ఆది బ్లాక్ చిత్రం విడుదల కావడం చాలా ఆనందంగా ఉంది. ఆది కి ఏ చిత్రం మంచి విజయం సాధిస్తుంది. ట్రైలర్ మంచి కిక్ ఇచ్చింది. సినిమా కూడా విజయవంతం అవ్వాలి” అని కోరుకున్నారు. హీరో ఆది సాయి కుమార్ మాట్లాడుతూ “నాకు కథ విన్న వెంటనే బాగా నచ్చింది. డైరెక్టర్ చాలా బాగా డిజైన్ చేశారు, డైరెక్టర్ కి చాలా క్లారిటీ ఉంది, ట్రైలర్ చాలా బాగా వచ్చింది, అందరూ మెసేజ్ చేస్తున్నారు ట్రైలర్ చాలా బాగుంది అని, సినిమా కూడా చాలా బాగా వచ్చింది, ప్రేక్షకులు చాలా థ్రిల్ ఫీల్ అవుతారు. కోవిద్ టీం లో మేము చాలా కష్టపడి షూటింగ్ చేశాం. మే 28న విడుదల అవుతుంది, అందరూ బాగా నచ్చుతుంది” అని తెలిపారు.

బిగ్ బాస్ ఫేమ్ కౌషల్ మండా మాట్లాడుతూ “బిగ్ బాస్ తర్వాత మంచి చిత్రం కోసం వేచి చూశాను. ఆ సమయంలో డైరెక్టర్ కృష్ణ నాకు ఈ కథ చెప్పారు. నాకు బాగా నచ్చింది.నా రియల్ క్యారెక్టర్ కి చాలా దగ్గరగా ఉంటుంది. ఆది గారితో పని చేయడం మంచి అనుభవం. మా ఇద్దరి క్యారెక్టర్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఆది గారి కెరీర్ లో చాలా డిఫరెంట్ సినిమా గా ఉంటుంది. మే 28న విడుదల అవుతుంది, అందరూ చూడండి” అని తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఇక్కడ చదవండి : 

Mahesh Babu: ‘ఆ సినిమా మరో సారి చేయాలని ఉంది’ మనసులోమాట బయటపెట్టిన మహేష్

“ఆ క్షణాలను ఎప్పుడూ గుర్తుంచుకుంటా తాకర్” తారక్‌ కు చెర్రీ ఎమోషనల్ విషెస్

Anil Ravipudi: ఎన్టీఆర్ మూవీ చేయడంపై అనిల్ రావిపూడి క్లారిటీ