AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Balakrishna: ఎన్టీఆర్ శతజయంతి వేడుకలకు నందమూరి ఫ్యామిలీ.. అభిమానులకు బాలయ్య స్పెషల్ లేఖ..

తారకరామారావు జయంతి వేడుకలను కన్నుల పండగగా నిర్వహించనున్నారు.. ఎన్టీఆర్ శతజయంతి ఉత్సావాలను ఆయన

Balakrishna: ఎన్టీఆర్ శతజయంతి వేడుకలకు నందమూరి ఫ్యామిలీ.. అభిమానులకు బాలయ్య స్పెషల్ లేఖ..
Balaiah
Rajitha Chanti
|

Updated on: May 21, 2022 | 2:09 PM

Share

తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటిన నటుడు నందమూరి తారక రామారావు.. తెలుగు సినిమా ఖ్యాతిని నలుదిశాల వ్యాపింపచేశారు.. తెలుగు వారి అభివృద్ధి కోసం తెలుగుదేశం పార్టీని స్థాపించి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. చలనచిత్ర పరిశ్రమలో ఆయన స్థానం ప్రత్యేకమైనది. తారకరామారావు జయంతి వేడుకలను కన్నుల పండగగా నిర్వహించనున్నారు.. ఎన్టీఆర్ శతజయంతి ఉత్సావాలను ఆయన జన్మస్థలం నిమ్మకూరులో అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. అందుకు తగిన ఏర్పాట్లు సిద్ధమవుతున్నాయి. ఈ వేడుకలను తారకరామారావు తనయుడు నటుడు బాలకృష్ణ మే 28న ప్రారంభించనున్నారు. ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలను 2022 మే 28 నుంచి 2023 మే 28 వరకు ఏడాది పాటు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా బాలకృష్ణ “శతపురుషుని శత జయంతి ఉత్సవాలు” పేరిట అభిమానులకు ఓ లేఖ రాశారు..

“అభిమానులకు.. తెలుగునేలకు.. విశ్వవ్యాప్తంగా వెలుగులీనుతున్న తెలుగుజాతికి.. నందమూరి బాలకృష్ణ నమస్సుమాంజలి…. మా నాన్నగారు సినీరంగంలో అడుగుపెట్టారు. భారతీయసినిమా తెలుగుసినిమాని తలఎత్తి చూసింది.. తెలుగుదేశంపార్టీని స్థాపించారు.. తెలుగుసంస్కృతి తలఎత్తి నిలబడింది.. ఆ నందమూరి తారక రామునికి ఈ నెల 28వ తేదీతో నూరవ ఏడు మొదలవుతుంది.. ఆ రోజు నుంచి, 2023 మే 28 వరకు, 365 రోజులపాటు శతపురుషుని శత జయంతి వేడుకలు నేల నలుచేరగులా జరుగనున్నాయని తెలియజేయడానికి గర్వపడుతున్నాను.. మునుపెన్నడూ కనీవినీ ఎరుగనివిధంగా ఎన్నో దేశాలలో జరుగుతున్న ఈ వేడుకలకు మా నందమూరి కుటుంబం హాజరవుతుంది.. ఆనందంలో పాలుపంచుకుంటుంది… మా కుటుంబం నుంచి నెలకొక్కరు నెలకో కార్యక్రమంలో భాగస్వాములవుతారు.. అందులో భాగంగా నేను 28వ తేదీ ఉదయం మా స్వస్థలం నిమ్మకూరు వెళ్ళి, అక్కడి వేడుకలలో పాల్గొంటాను.. వందేళ్ల క్రితం మా నాన్నగారిని జాతికందించింది నిమ్మకూరు కనుక అది నా బాధ్యత.. అక్కడి నుంచి కళలకాణాచిగా ఖ్యాతిగాంచిన తెనాలి చేరుకుంటాను. అక్కడ జరిగే శతాబ్ది వేడుకలను నా చేతులమీద ప్రారంభిస్తున్నాను.. 365రోజులు.. వారానికి 5 సినిమాలు, వారానికి 2 సదస్సులు.. నెలకు రెండు పురస్కార ప్రదానోత్సవాలు.. ఈమహత్కార్యాన్ని పెమ్మసాని(రామకృష్ణ) థియేటర్ లో ప్రారంభించి, ఒంగోలు వెళ్ళి మహానాడు లో పాల్గొంటానని తెలుగుజాతికి తెలియజేస్తున్నాను.. అహర్నిశలు మీ అభిమానం కోసం మీ నందమూరి బాలకృష్ణ.

ఇవి కూడా చదవండి
Balakrishna

Balakrishna