Bigg Boss Non Stop Winner: చరిత్ర సృష్టించనున్న బిందుమాధవి.. బిగ్‏బాస్ నాన్ స్టాప్ విజేతగా ఆడపులి !..

బిగ్‏బాస్ నాన్ స్టాప్ విన్నర్ గా బిందుమాధవి నిలిచిందని... టైటిల్ పై ఎన్నో ఆశలతో ఉన్న అఖిల్‏ మరోసారి రన్నరప్‏తో

Bigg Boss Non Stop Winner: చరిత్ర సృష్టించనున్న బిందుమాధవి.. బిగ్‏బాస్ నాన్ స్టాప్ విజేతగా ఆడపులి !..
Bigg Boss Winner
Follow us
Rajitha Chanti

|

Updated on: May 21, 2022 | 9:36 AM

బిగ్‏బాస్ చరిత్రలోనే తొలిసారి మహిళ విజేత కాబోతుంది. ఇప్పటివరకు ఐదు సీజన్లు పూర్తిచేసుకున్న ఈ షోలో.. ఐదుసార్లు అబ్బాయిలే విన్నర్స్ అయ్యారు.. శివబాలాజీ, కౌశల్, రాహుల్, అభిజిత్, సన్నీ.. ఇలా ఐదు సీజన్లలో అమ్మాయిలు గట్టి పోటీనిచ్చినా.. చివరకు అబ్బాయిలే విజయం సాధించారు. గత సీజన్లో బిగ్‏బాస్ విజేతగా నిలిచేందుకు శ్రీముఖి ట్రై చేసినప్పటికీ అనుహ్యంగా మరోసారి అబ్బాయి గెలిచాడు. (Bigg Boss Non Stop) దీంతో బిగ్‏బాస్ టైటిల్ ఓ అమ్మాయి తీసుకోవడమనేది కలగానే మారింది. కానీ ఇప్పుడు టెలికాస్ట్ అవుతున్న బిగ్‏బాస్ ఓటీటీలో మాత్రం మహిళ విజేత కాబోతున్నట్లుగా తెలుస్తోంది. బిగ్‏బాస్ చరిత్రలోనే మొట్ట మొదటిసారి ఓ మహిళ టైటిల్ అందుకోబోతున్నట్లుగా తెలుస్తోంది. మరి కొద్ది గంటల్లో బిగ్‏బాస్ విన్నర్ ఎవరనేది తెలియనుంది. ఈ క్రమంలో సోషల్ మీడియా వేదికగా బిందుమాధవికి మద్ధతు పెరిగిపోయింది.. బిగ్‏బాస్ విన్నర్ బిందు అంటూ హ్యాష్ ట్యాగ్స్ తెగ ట్రెండ్ అవుతున్నాయి.

ఇదిలా ఉంటే.. మరికొన్ని గంటల్లో బిగ్‏బాస్ విన్నర్ ఉత్కంఠకు తెర పడబోతుంది. ఈ క్రమంలోనే విన్నర్, రన్నరప్ ఆ ఇద్దరే అంటూ టాక్ నడుస్తోంది. బిగ్‏బాస్ నాన్ స్టాప్ విన్నర్ గా బిందుమాధవి నిలిచిందని… టైటిల్ పై ఎన్నో ఆశలతో ఉన్న అఖిల్‏ మరోసారి రన్నరప్‏తో సరిపెట్టుకోవాల్సి వచ్చిందని ఫిల్మ్ సర్కిల్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. షో మొదటిరోజు నుంచి అబ్బాయిలకు సమానంగా పోటీనిస్తూ.. ప్రతి విషయాన్ని కచ్చితంగా తెలియజేస్తూ ఆడపులిగా పేరు తెచ్చుకుంది బింధుమాధవి. ఆడపులి అంటూ పేరు తెచ్చుకున్న బిందు.. చివరకు బిగ్‏బాస్ ఓటీటీ విన్నర్ గా నిలిచి సత్తా చాటింది. ఇక బిందుమాధవి టైటిల్ గెలవగా.. అఖిల్ రన్నరప్ అయినట్లుగా తెలుస్తోంది. అలాగే.. మూడో స్థానంలో యాంకర్ శివ నిలవగా.. నాలుగో స్థానంలో బాబా భాస్కర్, ఐదో స్థానంలో అరియానా, ఆరవ, ఏడవ స్థానాలలో మిత్రా శర్మ, అనీల్ రాథోడ్ నిలిచినట్లుగా సమాచారం. అయితే యాంకర్ శివ,. బాబా భాస్కర్, అరియానా, మిత్రా, అనీల్ స్థానాలలో స్వల్పంగా మార్పులు కనిపించినప్పటికీ.. విన్నర్, రన్నర్ ఇద్దరూ బిందు, అఖిల్ అన్నట్లుగా లేటేస్ట్ టాక్. ప్రస్తుతం సోషల్ మీడియాలో బిగ్‏బాస్ ఓటీటీ విన్నర్ ఆడపులి బిందుమాధవి అంటూ హ్యాష్ ట్యాగ్స్ తెగ ట్రెండ్ అవుతున్నాయి. మరికొద్ది గంటల్లో బిగ్‏బాస్ నాన్ స్టాప్ విజేత ఎవరనే విషయంపై క్లారిటీ రానుంది.