AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pooja Hegde: వేడుకకు వెళ్తూ బ్యాగ్స్ పోగొట్టుకున్నాను.. చేదు అనుభవాన్ని గుర్తుచేసుకున్న పూజా..

అత్యంత ప్రతిష్టాత్మకమైన కేన్స్ ఫిలిం ఫెస్టివల్‏లో పూజాకు చేదు అనుభవం ఎదురైందట.. వేడుకలకు వెళ్తూ తన లగేజీ మొత్తాన్ని పోగొట్టుకున్నాంటూ చెప్పుకొచ్చింది పూజా

Pooja Hegde: వేడుకకు వెళ్తూ బ్యాగ్స్ పోగొట్టుకున్నాను.. చేదు అనుభవాన్ని గుర్తుచేసుకున్న పూజా..
Pooja Hegde
Rajitha Chanti
|

Updated on: May 21, 2022 | 10:41 AM

Share

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ వేడుకలు ఘనంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ వేడుకలలో మన ఇండియన్ సెలబ్రెటీస్ చాలా మంది పాల్గొన్నారు (Pooja Hegde).. దీపికా పదుకొనే.. ఆర్ మాధవన్.. తమన్నా.. పూజా హెగ్డే.. బాలీవుడ్.. టాలీవుడ్ సెలబ్రెటీస్ అంతా పాల్గోన్నారు. ఈ ఏడాది మొదటిసారిగా మన టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే కేన్స్ రెడ్ కార్పెట్ పై అరంగేట్రం చేసి ప్రేక్షకుల మనసులను దొచుకుంది. అయితే అత్యంత ప్రతిష్టాత్మకమైన కేన్స్ ఫిలిం ఫెస్టివల్‏లో పూజాకు చేదు అనుభవం ఎదురైందట.. వేడుకలకు వెళ్తూ తన లగేజీ మొత్తాన్ని పోగొట్టుకున్నాంటూ చెప్పుకొచ్చింది పూజా… ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గోన్న పూజా.. కేన్స్ వేడుకలకు వెళ్తూ.. ఫెస్టివల్ కోసం తీసుకున్న దుస్తులు.. విలువైన ఆభరణాలు కలిగి ఉన్న బ్యాగ్స్ పోయాయని.. దీంతో తన టీమ్ మొత్తం ఆకస్మాత్తుగా ఏర్పాట్లు చేసిందని.. రెడ్ కార్పెట్ వరకు వచ్చేవరకు తన టీం ఏం తినలేదని తెలిపింది.

పూజా మాట్లాడుతూ.. “మొదటిసారి ఇంటర్నెషనల్ కేన్స్ ఫిలిం ఫెస్టివల్ వేడుకలకు ఆహ్వానం వచ్చినందుకు సంతోషించాను.. ఈ వేడుకల కోసం నా టీం సరికొత్త డిజైన్ దుస్తులు.. అందమైన ఆభరణాలను నాకోసం సిద్ధం చేశారు..నా దుస్తులు.. ఆభరణాల కోసం టీం చాలా కష్టపడ్డారు. అన్ని సిద్ధం చేసుకుని సంతోషంగా కేన్స్ వేడుకలకు బయదేరాము.. కానీ ఫ్రాన్స్ వచ్చాక నా దుస్తులు. నగలు ఉన్న బ్యాగ్ కనిపించలేదు.. దాని కోసం చాలా వెతికాము.. కానీ ఆ బ్యాగ్ ఇండియన్ ఎయిర్ పోర్టులోనే పోయిందని అప్పుడు తెలిసిందే. దీంతో నాతోపాటు.. నా టీం చాలా ఆందోళన పడ్డాము.. నా కంటే ఎక్కువగా నా టీం మొత్తం టెన్షన్ పడింది.. దీంతో ఆ రోజు మొత్తం మేము భోజనం చేయలేదు.. ఏం చేయాలని ఆలోచిస్తున్న సమయంలో ఇండియా తీసుకున్న బంగారు నగలు నా మరో బ్యాగ్ లో కనిపించాయి.. ఆ తర్వాత నాకోసం దుస్తులు, నగలు కొనుక్కురావాలని చెప్పాను.. వెంటనే వారు కొని తీసుకువచ్చారు.. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నాం.. రెడ్ కార్పెట్ వాక్ నడిచిన తర్వాత ప్రశాంతంగా భోజనం చేశాము” అంటూ చెప్పుకొచ్చింది పూజా..

ఇవి కూడా చదవండి
View this post on Instagram

A post shared by Pooja Hegde (@hegdepooja)

Follow Us
మహిళల కాళ్ళు పట్టుకున్నాడు.. ఇక తప్పుచేయనని ప్రాథేయపడ్డాడు..
మహిళల కాళ్ళు పట్టుకున్నాడు.. ఇక తప్పుచేయనని ప్రాథేయపడ్డాడు..
బార్బీ ‘డ్రీమ్ టీమ్’లో స్మృతి మంధానా.. తొలి క్రికెటర్‌గా
బార్బీ ‘డ్రీమ్ టీమ్’లో స్మృతి మంధానా.. తొలి క్రికెటర్‌గా
హీరో శ్రీకాంత్ కజిన్ టాలీవుడ్‌లో తోప్ నటి..
హీరో శ్రీకాంత్ కజిన్ టాలీవుడ్‌లో తోప్ నటి..
ఈ మొక్కను పెంచుతున్నారా?.. మీరు వీధిలో పడటం ఖాయం..
ఈ మొక్కను పెంచుతున్నారా?.. మీరు వీధిలో పడటం ఖాయం..
ఫూల్ మఖానా వర్సెస్ వేయించిన శనగలు.. ఈ రెండింటిలో ఎక్కువ ఆరోగ్యం?
ఫూల్ మఖానా వర్సెస్ వేయించిన శనగలు.. ఈ రెండింటిలో ఎక్కువ ఆరోగ్యం?
రామ మందిర నిర్మాణంతో మారిన అయోధ్య ఆర్థిక ముఖచిత్రం
రామ మందిర నిర్మాణంతో మారిన అయోధ్య ఆర్థిక ముఖచిత్రం
భట్టి తనయుడి వివాహం.. ప్రత్యేక ఆకర్షణగా బంధువుల పాదయాత్ర
భట్టి తనయుడి వివాహం.. ప్రత్యేక ఆకర్షణగా బంధువుల పాదయాత్ర
పెట్టుబడి అవసరం లేదు.. రోజుకు రెండు గంటలు ఈ పని చేస్తే చాలు.
పెట్టుబడి అవసరం లేదు.. రోజుకు రెండు గంటలు ఈ పని చేస్తే చాలు.
మరో స్టార్ హీరో సినిమాలో ఛాన్స్ కొట్టేసిన పుత్తడి బొమ్మ రాశి..
మరో స్టార్ హీరో సినిమాలో ఛాన్స్ కొట్టేసిన పుత్తడి బొమ్మ రాశి..
నడుము నాజూగ్గా సన్నగా అవ్వాలంటే రోజూ తేనెను ఇలా తినండి..!
నడుము నాజూగ్గా సన్నగా అవ్వాలంటే రోజూ తేనెను ఇలా తినండి..!