AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Samantha: వరుస ఆఫర్లతో దూసుకుపోతున్న సమంత.. మరో ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ?

తాజాగా సామ్ మరో ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఓ యంగ్ డైరెక్టర్ చెప్పిన కథకు సామ్ ఇంప్రెస్ అయిపోయిందట..

Samantha: వరుస ఆఫర్లతో దూసుకుపోతున్న సమంత.. మరో ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ?
Samantha
Rajitha Chanti
|

Updated on: May 21, 2022 | 9:51 AM

Share

టాలీవుడ్ గార్జియస్ బ్యూటీ సమంత ఇప్పుడు చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. వరుస ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తూ.. మరోసారి ఇండస్ట్రీలో జోరు మీదు దూసుకుపోతుంది ఈ అమ్మడు.. విడాకుల ప్రకటన అనంతరం సామ్.. పూర్తిగా తన కెరీర్ పై దృష్టి పెట్టినట్లుగా తెలుస్తోంది. ఇటీవల పుష్ప సినిమాలో ఊ అంటావా మావ అనే స్పెషల్ సాంగ్‏తో అదరగొట్టింది. ఇక శాకుంతలం సినిమాను పూర్తిచేసిన సామ్.. ప్రస్తుతం యశోద సినిమాలో నటిస్తోంది. మరోవైపు.. విజయ్ దేవరకొండ సరసన ఖుషి చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. తెలుగులోనే కాకుండా..తమిళ్, హిందీలోనూ వరుస ఆఫర్లు అందుకుంటూ క్షణం కూడా తీరిక లేకుండా గడిపేస్తుంది. తాజాగా సామ్ మరో ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఓ యంగ్ డైరెక్టర్ చెప్పిన కథకు సామ్ ఇంప్రెస్ అయిపోయిందట.. వెంటనే ఆ సినిమాకు ఓకే చెప్పినట్లుగా టాక్ నడుస్తోంది. ఈ సినిమా డైరెక్టర్, ప్రొడ్యూసర్స్ గురించిన పూర్తి వివరాలను త్వరలోనే ప్రకటించనున్నారట మేకర్స్.

సామ్ మరో సినిమాకు ఓకే చెప్పినట్లుగా టాక్ వినిపిస్తుండడంతో..డైరెక్టర్ ఎవరు.. హీరో ఎవరు అంటూ నెట్టింట్లో సెర్చింగ్ స్టార్ట్ చేశారు అభిమానులు. శాకుంతలం, యశోధ విడుదల అనంతరం సామ్ తన తదుపరి ప్రాజెక్ట్స్ ప్రారంభించనందని సమాచారం. అలాగే హాలీవుడ్‏లో అరెంజ్మెంట్స్ ఆఫ్ లవ్ అనే సినిమాలోనూ సామ్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే కాతు వాకుల రెండు కాదల్ సినిమాతో తమిళంలోనూ సూపర్ హిట్ అందుకున్న సమంత.. వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని భావిస్తుందట. కంటెంట్.. పాత్ర నచ్చితే చాలు వెంటనే ఓకే చెప్పేస్తుందట. కేవలం లేడీ ఓరియంటెడ్ మాత్రమే కాకుండా.. ఫ్యామిలీ ఎంటర్టైనర్స్, రొమాంటికి, యాక్షన్ చిత్రాలను చేసేందుకు కూడా సామ్ సుముఖత వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది.

భార్యను నడిరోడ్డుమీద కాల్చి చంపిన భర్త.. కారణం ఇదే వీడియో
భార్యను నడిరోడ్డుమీద కాల్చి చంపిన భర్త.. కారణం ఇదే వీడియో
గోవిందుడి బంగారం గో.. వింద వీడియో
గోవిందుడి బంగారం గో.. వింద వీడియో
రోహిత్-కోహ్లీ రెండు రౌండ్ వేట మొదలు.. టీవీలో లైవ్ వస్తుందా?
రోహిత్-కోహ్లీ రెండు రౌండ్ వేట మొదలు.. టీవీలో లైవ్ వస్తుందా?
వణుకుతున్న తెలంగాణ..ముసురుతున్న రోగాలు వీడియో
వణుకుతున్న తెలంగాణ..ముసురుతున్న రోగాలు వీడియో
తెలంగాణ యూరియా యాప్‌ సక్సెస్.. త్వరలో రాష్ట్రమంతా అమలు వీడియో
తెలంగాణ యూరియా యాప్‌ సక్సెస్.. త్వరలో రాష్ట్రమంతా అమలు వీడియో
హెచ్1బీ వీసాలపై ట్రంప్ సర్కార్ సంచలన నిర్ణయం..ఇకపై వీడియో
హెచ్1బీ వీసాలపై ట్రంప్ సర్కార్ సంచలన నిర్ణయం..ఇకపై వీడియో
ఫ్రెషర్స్‌కు ఇన్ఫోసిస్ బంపర్ ఆఫర్.. భారీ ప్యాకేజీతో జాబ్స్‌!
ఫ్రెషర్స్‌కు ఇన్ఫోసిస్ బంపర్ ఆఫర్.. భారీ ప్యాకేజీతో జాబ్స్‌!
ఒక్కరోజే రూ.9 వేలు.. జెడ్ స్పీడ్‌లో దూసుకెళ్తున్న బంగారం ధరలు
ఒక్కరోజే రూ.9 వేలు.. జెడ్ స్పీడ్‌లో దూసుకెళ్తున్న బంగారం ధరలు
ఆర్టీసీలో కొలువుల జాతర..! ఈ నెల 30 నుంచి అప్లికేషన్ల స్వీకరణ..
ఆర్టీసీలో కొలువుల జాతర..! ఈ నెల 30 నుంచి అప్లికేషన్ల స్వీకరణ..
మైసూరు ప్యాలెస్ సమీపంలో భారీ పేలుడు.. ఒకరు స్పాట్‌ డెడ్‌..పలువురు
మైసూరు ప్యాలెస్ సమీపంలో భారీ పేలుడు.. ఒకరు స్పాట్‌ డెడ్‌..పలువురు