AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Malavika Mohanan: నెటిజన్‌ అడిగిన పశ్నకు మాళవిక ఫైర్‌.. బుర్ర పాడైపోయినట్లుంది అంటూ..

Malavika Mohanan: సోషల్‌ మీడియా (Social Media) విస్తృతి పెరిగినప్పటి నుంచి సామాన్యులకు, సెలబ్రిటీలకు మధ్య దూరం చెరిగిపోతోంది. ఒకప్పుడు తమ అభిమాన నటీ, నటులను చూస్తే చాలనుకునే అభిమానులు ఇప్పుడు...

Malavika Mohanan: నెటిజన్‌ అడిగిన పశ్నకు మాళవిక ఫైర్‌.. బుర్ర పాడైపోయినట్లుంది అంటూ..
Narender Vaitla
|

Updated on: May 21, 2022 | 4:55 PM

Share

Malavika Mohanan: సోషల్‌ మీడియా (Social Media) విస్తృతి పెరిగినప్పటి నుంచి సామాన్యులకు, సెలబ్రిటీలకు మధ్య దూరం చెరిగిపోతోంది. ఒకప్పుడు తమ అభిమాన నటీ, నటులను చూస్తే చాలనుకునే అభిమానులు ఇప్పుడు ఆన్‌లైన్‌ వేదికగా ఏదైనా అడిగేస్తున్నారు. తారలు కూడా ఇన్‌స్టాగ్రామ్‌, ట్విట్టర్‌ వేదికగా ఫ్యాన్స్‌తో చిట్‌ చాట్‌ చేస్తున్నారు. అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇస్తున్నారు. అయితే ఈ అవకాశాన్ని కొందరు దుర్వినియోగం చేస్తున్నారు. ఛాన్స్‌ ఇచ్చారు కదా అని హద్దులు దాటి పోతున్నారు. ఇష్టారాజ్యంగా ప్రశ్నలు సంధిస్తూ సినీ తారలను అసహనానికి గురి చేస్తున్నారు. తాజాగా మలయాళీ బ్యూటీ మాళవికా మోహన్‌కు కూడా ఇలాంటి అనుభవమే ఎదురైంది.

మాళవికా ఇటీవల ట్విట్టర్‌ వేదికగా ‘క్విక్‌ క్వశ్చన్‌ అండ్‌ ఆన్సర్‌’ పేరుతో ఓ సెషన్‌ను నిర్వహించింది. ఇందులో భాగంగా అభిమానులు మాళవికను పలు రకాల ప్రశ్నలు సంధించారు. ఇందులో భాగంగానే ఓ నెటిజన్‌ ధనుష్‌-మాళవిక కలిసి నటించిన ‘మారన్‌’ సినిమాకు సంబంధించి ఓ ప్రశ్నను సంధించాడు. దీంతో మాళవిక కాస్త అసహనానికి గురైంది. ఓటీటీ వేదికగా విడుదలైన మారన్‌ చిత్రంలో ధనుష్‌, మాళవికల మధ్య చిత్రీకరించిన ఓ రొమాంటిక్‌ సన్నివేశానికి సంబంధించిన స్క్రీన్‌ షాట్‌ను పోస్ట్‌ చేసిన సదరు నెటిజన్‌.. ‘ఈ సీన్‌ షూట్‌ చేయడానికి ఎన్ని టేక్స్‌ తీసుకున్నారు.?’ అని ప్రశ్నించాడు. దీంతో ఆగ్రహానికి గురైన మాళవి.. ‘ఇలాంటి అనవసరమైన విషయాలు గురించి ఆలోచించి మీ బుర్ర మొత్తం పాడైపోయినట్లు ఉంది’ అని దిమ్మదిరిగే సమాధానం ఇచ్చింది.

Malavika Twiiter

ఇవి కూడా చదవండి

ఇక క్వశ్చన్‌ అండ్‌ ఆన్సర్‌ సెషన్‌లో భాగంగా మాళవిక తనకు ప్రభాస్‌ అంటే ఇష్టమని తెలిపింది. ‘బాహుబలి’, ‘బాహుబలి-2’ చిత్రాలను దాదాపు 15 సార్లు చూశానని, అవకాశం వస్తే ఆయన సినిమాలో తప్పకుండా నటిస్తానని చెప్పుకొచ్చింది. ఇక ప్రస్తుతం ఏ హీరోగతో నటించాలని ఉందన్న ప్రశ్నకు బదులిస్తూ.. ‘విజయ్‌ దేవరకొండతో కలిసి రొమాంటిక్‌-కామెడీ చిత్రంలో నటించాలని ఉంద’ని చెప్పుకొచ్చింది.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..