Hyderabad: రైల్వే, మెట్రో జాబ్స్ పేరుతో టోకరా.. నిరుద్యోగుల నుంచి ఎంత వసూలు చేశారో తెలుసా?

రైల్వేలు,  మెట్రో ఉద్యోగాలు (Railway Jobs) ఇప్పిస్తామని మోసాలకు పాల్పడుతున్న ముఠాను  రాచకొండ పోలీసులు(Rachakonda Police) అరెస్ట్ చేశారు

Hyderabad: రైల్వే, మెట్రో జాబ్స్ పేరుతో టోకరా.. నిరుద్యోగుల నుంచి ఎంత వసూలు చేశారో తెలుసా?
Follow us

|

Updated on: Jan 27, 2022 | 9:14 PM

రైల్వేలు,  మెట్రో ఉద్యోగాలు (Railway Jobs) ఇప్పిస్తామని మోసాలకు పాల్పడుతున్న ముఠాను  రాచకొండ పోలీసులు(Rachakonda Police) అరెస్ట్ చేశారు.  ఈ సందర్భంగా  నిరుద్యోగుల ఆశలను ఆసరాగా చేసుకుని వీరు రూ.కోటి న్నర వసూలు చేశారని రాచకొండ సీపీ మహేష్ భగవత్ (CP Mahesh Bhagwat) తెలిపారు.  ఈ సందర్భంగా కేసు వివరాలను మీడియాకు వెల్లడించారు. ‘నిరుద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగం పొందాలని ఎంతో ఆశగా ఉంటుంది. ఇదే ఆసరాగా చేసుకొని చాలా మంది మోసాలకు పాల్పడుతున్నారు. నిరుద్యోగుల నుంచి రూ.కోటిన్నరకు పైగా వసూలు చేసిన ముఠాను పట్టుకున్నాం. ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశాం. మరో ముగ్గురు పరారీ లో ఉన్నారు. త్వరలోనే వారిని కూడా పట్టుకుంటాం. నిందితుల నుంచి ఒక మహీంద్రా జైలో, రెండు టెంపో ట్రావెలర్ వెహికల్స్, ఫేక్ ఆధార్ కార్డ్స్, ఫేక్  అపాయింట్ మెంట్ లెటర్లు, మెట్రో స్లాట్ లెటర్లు, ఫేక్ ఓటర్ ఐడీ కార్డ్స్,  4 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నాం. ‘

రైల్ నిలయం అడ్డాగా..

‘ ఖమ్మంకు చెందిన కాకరపర్తి సురేంద్ర అనే వ్యక్తి ఈ కేసులో ప్రధాన నిందితుడు. అతని భార్య బానోతు నాగలక్ష్మి, దాచిపల్లి సురేష్ అనే మరో వ్యక్తిని అరెస్ట్ చేసాం. సురేంద్ర చేసే మోసాలకు భార్య నాగలక్ష్మి, ఫ్రెండ్ సురేష్ సహకరించేవారు. గతంలో ఫేక్ గోల్డ్ బిస్కెట్స్  అమ్ముతున్న కేసులో సురేంద్ర ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. 2013 లో ఖమ్మం నుంచి హైదరాబాద్ వచ్చి ప్రైవేట్ కార్ డ్రైవర్ గా చేరాడు. ఉప్పల్ లో పుట్టా సురేష్ రెడ్డి గా పేరు మార్చుకొని జీవనం సాగిస్తున్నాడు. నకిలీ సర్టిఫికెట్లతో చాలా బ్యాంకుల్లో ఖాతాలు ఓపెన్ చేశాడు. రూ. 10 లక్షలు ఇస్తే, రైల్వేలో, మెట్రోలో జాబ్ ఇప్పిస్తామని నిరుద్యోగులను నమ్మించాడు. సికింద్రాబాద్ రైల్ నిలయం దగ్గర అడ్డా పెట్టి, డబ్బులు వసూలు చేశాడు. నకిలీ అపాయింట్ మెంట్ లెటర్లు ఇచ్చి నిరుద్యోగులను నమ్మిస్తున్నాడు.  అలా వచ్చిన డబ్బుతో వాళ్ల అమ్మ పేరు మీద ఉప్పల్ లో ఒక ప్లాట్, ట్రావెల్స్ ఏజెన్సీ, సెక్యూరిటీ ఏజెన్సీ, జడ్చర్లలో  క్యాంటీన్లు తెరిచాడు. నిందితులపై పీడీ యాక్ట్ నమోదు చేస్తాం. వీరి చేతిలో మోసపోయిన బాధితుల వివరాలను సేకరిస్తున్నాం. త్వరలోనే పరారీలో ఉన్న ఇతర నిందితులను కూడా పట్టుకుంటాం ‘ అని సీపీ పేర్కొన్నారు.

Also Read: Covid Vaccine: అర్హత ఉండి ప్రికాషన్ డోసు తీసుకోనివారికి జీతాలు కట్.. ఆదేశాలు జారీ చేసిన ఆ జిల్లా కలెక్టర్..

Chinna Jeeyar Swamy: గవర్నర్ తమిళి సైతో సమావేశమైన చినజీయర్ స్వామి..

Anil Ambani Son Wedding: త్వరలో అంబానీ ఇంట మరో గ్రాండ్ వెడ్డింగ్.. నెట్టింట వైరలవుతోన్నఅనిల్ అంబానీ కుమారుడి ప్రి వెడ్డింగ్ ఫొటోస్..