AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇవేం ఎండలు బాబోయ్‌.. వచ్చే రెండు రోజులు రాష్ట్రంపై నిప్పుల వాన

రాష్ట్రంలో పగటి ఉష్ణోగ్రతలు రోజురోజుకీ మరింత పెరుగుతున్నాయి. మే నెల రాకముందే భాణుడు నిప్పుల వాన కురిపిస్తున్నాడు. అధిక ఉష్ణోగ్రతలతో జనాలు అల్లాడిపోతున్నారు. ఈ క్రమంలో వాతావరణ కేంద్రం మరో బాంబ్ పేల్చింది. వచ్చే రెండు రోజులు సాధారణం కంటే 4 నుంచి 5 డిగ్రీలు మరింతగా బాణుడు ప్రతాపం చూపనున్నాడు..

ఇవేం ఎండలు బాబోయ్‌.. వచ్చే రెండు రోజులు రాష్ట్రంపై నిప్పుల వాన
Telangana Temperatures
Srilakshmi C
|

Updated on: Apr 25, 2026 | 11:52 AM

Share

హైదరాబాద్‌, ఏప్రిల్ 25: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఎండలు ఠారెత్తిస్తున్నాయి. పగటి పూట సాధారణ ఉష్ణోగ్రతల కంటే 4 నుంచి 5 డిగ్రీలు అధికంగా నమోదు అవుతున్నాయి. అధిక ఉష్ణోగ్రతలకు జనాలు విలవిలలాడుతున్నారు. దీంతో జనాలు ఇళ్ల నుంచి బయటకు రావడానికి భయపడుతున్నారు. ఉదయం 7 గంటల నుంచి ఎంత ప్రచంఢంగా ఉజృంభిస్తుంది. నేడు, రేపు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో 44 డిగ్రీల కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం హెచ్చరించింది.

ఈ క్రమంలో 33 జిల్లాలకు వాతావరణ కేంద్రం ఆరెంజ్‌ అలర్జ్‌ జారీ చేసింది. శుక్రవారం అత్యధికంగా నిర్మల్‌ జిల్లాలో 44.4 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ములుగులో 44.3 డిగ్రీలు, జగిత్యాలలో 44.1 డిగ్రీల మేర గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదైనట్టు వెల్లడించింది. నిన్న పగటి పూట దాదాపు 8 జిల్లాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా ఎక్కువచోట్ల 40.8 డిగ్రీలపైన నమోదయ్యాయి. అధిక ఉష్ణోగ్రతల నేపథ్యంలో పిల్లలు, వృద్ధులు, గర్భిణులు మరింత జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు. మరోవైపు ఈ ఏడాది వర్షాకాలం కాస్త ముందుగానే ప్రారంభం కానున్నట్టు వాతావరణ శాఖ వెల్లడించింది.

విదర్భ నుంచి తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు మీదుగా ద్రోణి కొనసాగుతున్నట్లు తెలిపింది. శనివారం నుంచి ఈ నెల 30 వరకు ఉత్తర, దక్షిణ తెలంగాణ జిల్లాల్లో అక్కడక్కడ ఈదురు గాలులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు వాతావరణ కేంద్ర తెలిపింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us