AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana : కవిత కొత్త పార్టీ.. టీఆర్ఎస్.. ఫుల్‌ఫామ్ ఏంటో తెలుసా?

తెలంగాణ రాజకీయాల్లో మరో కొత్త పార్టీ అడుగు పెట్టింది. మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుమార్తె కవిత తాను సొంతంగా కొత్త పార్టీని స్థాపించినట్టు ప్రకటించారు. ఈ మేరకు ఆమె తన కొత్త పార్టీ పేరును అధికారికంగా ప్రకటించారు. పార్టీ పేరును తెలంగాణ రాష్ట్ర సేన ( టీఆర్ఎస్‌) గా అని కవిత చెప్పుకొచ్చారు.

Telangana : కవిత కొత్త పార్టీ.. టీఆర్ఎస్.. ఫుల్‌ఫామ్ ఏంటో తెలుసా?
Kavitha Announces New Party Name (1)
Anand T
|

Updated on: Apr 25, 2026 | 11:37 AM

Share

తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. రాష్ట్ర రాజకీయాల్లో మరో కొత్త పార్టీ అడుగుపెట్టింది. బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె కవిత కొత్త పార్టీని ప్రకటించింది. శనివారం ఉదయం మేడ్చల్‌ జిల్లాలోని మునీరాబాద్‌‌లో ఏర్పాటు చేసిన పార్టీ ఆవిర్భావ సభలో ఆమె తన కొత్త పార్టీ పేరును అధికారికంగా ప్రకటటించి. అంతకు ముందే ఆమె సభా వేదికపై అమరవీరుల స్థూపం, ప్రొఫెసర్ జయశంకర్‌ విగ్రహానికి, బతుకమ్మతో ఉన్న తెలంగాణ తల్లి విగ్రహానికి నివాళులర్పించింది.

అనంతరం అలాగే పార్టీ జెండాను కూడా ఆవిష్కరించారు. తన పార్టీ పేరు టీఆర్ఎస్‌గా ప్రకటించారు. టీఆర్ఎస్ అంటే తెలంగాణ రాష్ట్ర సేన అని కవిత చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇది తన జీవితంలో మర్చిపోలేని రోజని ఆమె చెప్పుకొచ్చారు. తెలంగాణ కోసం ఉద్యమంలో ఎంతో మంది ప్రాణాలర్పించారు.. ఉద్యమంలో బతుకమ్మ ఎత్తుకుని ఊరూరా తిరిగా.. బతుకమ్మ వచ్చిన తర్వాత ఉద్యమానికి ఊపొచ్చిందని కవిత తెలిపారు.

తెలంగాణ వచ్చి 12 ఏళ్లైనా మన కలలు నెరవేరలేదని.. కేసీఆర్ నేతృత్వంలోని తెలంగాణ ఉద్యమరథం దారితప్పిందని చెప్పుకొచ్చారు. తెలంగాణ వస్తే బానిస సంకెళ్లు పోతాయనుకున్నాం కానీ వ్యక్తిగత స్వేచ్ఛ పోయిందంది కవిత.. ఎవరి ఫోన్ ఎవరు వింటున్నారో కూడా తెలియని భయం చాలా మందిలో ఉందన్నారు.

తెలంగాణను వ్యతిరేకంచిన వారికి ఎమ్మెల్యే సీట్లు ఇచ్చారు.. కానీ పార్టీ కోసం అండగా నిలిచిన వారిని గాలికి వదిలేశారు. అధికారం వచ్చాక కేసీఆర్‌కు మమకారం పోయింది. అందుకే చెబుతున్నా ఆయన మన కేసీఆర్ కాదు.. మారీన కేసీఆర్ .. ప్రాణాలు అడ్డం పెట్టుకొని రాష్ట్రాన్ని కాపాడాల్సిన సైన్యం కావాలని కవిత చెప్పుకొచ్చారు. కాళేశ్వరంలో అవినీతి జరిగిందన్న దానికి తనను పార్టీలో నుంచి తీసేశారని.. అవినీతి చేసిన పందికొక్కులను పక్కన చేర్చుకున్నారని కవిత ఆరోపించారు.

ఆవిర్బావ సభలో కవిత ఏం మాట్లాడిందో చూడండి..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us