Telangana: కేవైసీ అప్‌డేట్ అంటూ కాల్, లేదా మెసేజ్ వచ్చిందా.. అయితే జాగ్రత్త టార్గెట్ మీరే
పశ్చిమాసియా యుద్ధం కారణంగా దేశ వ్యాప్తంగా గ్యాస్ కొరత ఏర్పడిన విషయం అందరికి తెలిసిందే.. గ్యాస్ లేక చాలా రాష్ట్రాల్లో హోటల్‌లు, రెస్టారెంట్స్‌లు మూతపడ్డాయి. కొన్ని రెస్టారెంట్‌లు మాత్ర అదిక ధరలు వెచ్చించి కూడా గ్యాస్ కొంటున్నారు. సరిగ్గా ఇదే అవకాశాన్ని కొందరు కేటుగాళ్లు క్యాచ్ చేసుకొని మోసాలకు పాల్పడుతున్నారు.

గ్యాస్ కొరత పరిస్థితులను ఆసరాగా చేసుకుని LPG సిలిండర్ బుకింగ్ పేరుతో మోసాలు పెరుగుతున్న ఘటనలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. సిలిండర్ కోసం ఎదురుచూస్తున్న వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని సైబర్ నేరగాళ్లు కాల్స్, మెసేజ్‌లతో మభ్యపెడుతున్నారు. KYC అప్డేట్ చేయాలి లేకపోతే గ్యాస్ సరఫరా నిలిచిపోతుంది, త్వరగా బుకింగ్ చేయాలంటే OTP చెప్పండి అంటూ భయపెడుతున్నారు.
కొందరు తెలియని లింకులు పంపించి వెంటనే చెల్లింపు చేయమంటున్నారు. ఈ ఒత్తిడికి లోనై వివరాలు ఇచ్చిన వారు డబ్బులు కోల్పోతున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వం హెచ్చరిక జారీ చేసింది. OTP, PIN, బ్యాంక్ వివరాలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరికీ చెప్పవద్దు. KYC పేరుతో వచ్చే కాల్స్‌ను అస్సలు నమ్మ వద్దని స్పష్టం చేసింది.
తెలియని లింకులు, APK ఫైల్స్‌ను క్లిక్ చేయడం ప్రమాదకరమని.. గ్యాస్ బుకింగ్ కోసం కేవలం అధికారిక యాప్‌లు, వెబ్‌సైట్లు మాత్రమే వినియోగించాలని సూచించింది. ఏదైనా అనుమానాస్పద కాల్ లేదా మెసేజ్ వస్తే వెంటనే 1967 లేదా 100 నంబర్లకు ఫిర్యాదు చేయాలని అధికారులు తెలిపారు. ఈ కొరత పరిస్థితులను కేటుగాళ్లు ఆసరగా చేసుకొని డబ్బులు కాలేజే ప్లాన్‌లో ఉన్నారని.. ఇలాంటప్పుడే జనాలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
