ఇక ఈ అమ్మడు తెలుగులో కనిపించడం కష్టమేనా..? 

Rajeev 

28  march 2026

మంచు మనోజ్ నటించిన ఝుమంది నాదం సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులను పలకరించింది ముద్దుగుమ్మ తాప్సీ.

ఈ సినిమాలో తాప్సీ తన అందంతో అభినయంతో కట్టిపడేసింది. ఈ సినిమా మ్యూజికల్ గా మంచి విజయాన్ని అందుకుంది.

దాంతో తాప్సీకి మంచి క్రేజ్ వచ్చేలా చేసింది. ఆతర్వాత బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసి అలరించింది తాప్సీ.

స్టార్ హీరోల సినిమాల్లోనూ ఛాన్స్ లు అందుకుంది. ప్రభాస్ తో మిస్టర్ పర్ఫెక్ట్ లాంటి హిట్ కూడా అందుకుంది..

కానీ ఆతర్వాత తెలుగులో ఈ చిన్నదానికి అవకాశాలు తగ్గుతూ వచ్చాయి. దాంతో బాలీవుడ్ లోకి అడుగుపెట్టింది.

ఇక హిందీలో ఈ చిన్నది తక్కువ సమయంలోనే పాపులర్ అయ్యింది. అక్కడ కమర్షియల్ సినిమాలతో పాటు లేడీ ఓరియేంటడ్ సినిమాలు చేసి మెప్పించింది.

అంతే కాదు షారుక్ ఖాన్, అమితాబ్ బచ్చన్ లాంటి స్టార్ హీరోలతో కలిసి నటించిది ఈ ముద్దుగుమ్మ. దాంతో తెలుగులో ఇక ఈ బ్యూటీ కనిపించడం కష్టమే అంటున్నారు కొందరు అభిమానులు.