AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2026: ఐపీఎల్ ఆరంభం వేళ.. యువతకు సజ్జనార్ సీరియస్ వార్నింగ్!

ఐపీఎల్ క్రికెట్ సంబరాలు మొదలవుతున్న వేళ, యువత, క్రీడాభిమానులకు ఐపీఎస్ అధికారి వీసీ సజ్జనార్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. బెట్టింగ్ నిర్వహించే వారు ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని, ఎక్కడైనా అనుమానాస్పద కార్యకలాపాలు కనిపిస్తే వెంటనే డయల్ 100 లేదా పోలీసుల వాట్సాప్ నంబర్‌కు సమాచారం ఇవ్వాలని సజ్జనార్ విజ్ఞప్తి చేశారు. సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడి కష్టార్జితాన్ని పోగొట్టుకోవద్దని ఆయన హెచ్చరించారు.

IPL 2026: ఐపీఎల్ ఆరంభం వేళ.. యువతకు సజ్జనార్ సీరియస్ వార్నింగ్!
Sajjanar Ips Warning
Ranjith Muppidi
| Edited By: |

Updated on: Mar 28, 2026 | 4:50 PM

Share

క్రికెట్ అంటే భారతీయులకు ఒక పిచ్చి. ముఖ్యంగా ఐపీఎల్ సీజన్ వచ్చిందంటే చాలు, ఉత్సాహం అంబరాన్ని తాకుతుంది. అయితే, ఇదే ఉత్సాహాన్ని ఆసరాగా చేసుకుని కొన్ని ముఠాలు బెట్టింగ్ మాఫియాను నడుపుతున్నాయి. ఈ నేపథ్యంలో ఐపీఎస్ అధికారి వీసీ సజ్జనార్ ప్రజలను, ముఖ్యంగా యువతను ఉద్దేశించి కీలక సందేశాన్ని విడుదల చేశారు. ప్రస్తుతం బెట్టింగ్ అనేది కేవలం మైదానాల బయట మాత్రమే కాదు, స్మార్ట్‌ఫోన్‌ల ద్వారా ప్రతి చేతిలోకి చేరిపోయింది. టెలిగ్రామ్ గ్రూపులు, ఇన్‌స్టాగ్రామ్ యాడ్స్ ద్వారా తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించవచ్చనే ఆశ చూపిస్తూ మోసగాళ్లు వల విసురుతున్నారు. మొదట్లో చిన్న మొత్తాలతో ఆశ చూపించి, ఆ తర్వాత భారీగా పెట్టుబడి పెట్టించి ముంచేయడం ఈ యాప్‌ల అసలు నైజం అని సజ్జనార్ వివరించారు.

కొంతమంది సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు డబ్బు కోసం ఇలాంటి ప్రమాదకరమైన బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేయడంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. అనాధికారిక యాప్‌లను ప్రోత్సహించడం చట్టరీత్యా నేరమని, అటువంటి వారిపై కూడా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గదులు అద్దెకు తీసుకుని రహస్యంగా బెట్టింగ్ నిర్వహించే ముఠాలపై పోలీసులు డేగ కన్ను వేశారని సజ్జనార్ తెలిపారు.

ఇవి కూడా చదవండి

వీడియో ఇక్కడ చూడండి..

ఎక్కడైనా బెట్టింగ్ జరుగుతున్నట్లు తెలిస్తే వెంటనే 100కు కాల్ చేయండి. లేదా 9490616555 అనే వాట్సాప్ నంబర్‌కు ఫోటోలు లేదా వివరాలు పంపండి. బెట్టింగ్ అనేది కేవలం డబ్బు పోగొట్టుకోవడం మాత్రమే కాదు, అది మానసిక ఒత్తిడికి, కుటుంబ కలహాలకు, ఆత్మహత్యలకు దారితీస్తుంది. బెట్టింగ్ యాప్‌లకు నో చెప్పండి.. మీ భవిష్యత్తును కాపాడుకోండి అని సజ్జనార్ పిలుపునిచ్చారు. చట్ట వ్యతిరేక పనులకు పాల్పడితే క్రిమినల్ కేసులు ఎదుర్కోవాల్సి ఉంటుందని, ఇది మీ కెరీర్‌పై ప్రభావం చూపుతుందని ఆయన గుర్తుచేశారు.

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us