AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సంపద బాగా పెరగాలంటే.. ఆదివారం మిరియాలతో ఈ ఒక్క పని చేయండి!

Black Pepper Astrology: మిరియాలు ఉపయోగించి ఆర్థిక సమస్యలను తొలగించుకోవడానికి, సంపాదన పెంచుకోవడానికి, నెగటివ్ ఎనర్జీ, శత్రు బాధలను నివారించడానికి జ్యోతిష్య పరిహారాలు ఈ వీడియోలో వివరించబడ్డాయి. తొమ్మిది మిరియాలతో చేసే ప్రత్యేక ప్రయోగం ద్వారా ధనాదాయాన్ని పెంపొందింప చేసుకోవచ్చు. ఈ శక్తివంతమైన పరిహారాలతో శ్రేయస్సును పొందండి.

సంపద బాగా పెరగాలంటే.. ఆదివారం మిరియాలతో ఈ ఒక్క పని చేయండి!
Black Pepper Astrology
Rajashekher G
|

Updated on: Mar 28, 2026 | 6:52 PM

Share

Black Pepper: పరిహార శాస్త్రంలో మిరియాలకు విశేష ప్రాధాన్యత ఉంది. ఇంటికి నెగటివ్ ఎనర్జీ ఉందని లేదా మీపై ఎవరైనా ప్రయోగాలు చేస్తున్నారని అనుమానం ఉన్నప్పుడు మిరియాల పరిహారాలు చాలా ప్రభావవంతంగా పనిచేస్తాయి. దుష్టశక్తులను తొలగించి, ఎలాంటి ప్రయోగాలు పనిచేయకుండా మిరియాలు రక్షణ కవచంగా నిలుస్తాయి. శత్రు బాధలు తొలగిపోవాలంటే ఒక సులభమైన పరిహారం ఉంది. ఎవరైనా పని మీద బయటికి వెళ్లేటప్పుడు తొమ్మిది మిరియపు గింజలు నోట్లో వేసుకుని నములుతూ వెళ్ళాలి. ఇలా చేయడం ద్వారా ఎలాంటి శత్రు బాధలున్నా వాటి నుంచి సులభంగా బయటపడవచ్చు.

నెగటివ్ ఎనర్జీ చెక్..

నెగటివ్ ఎనర్జీని ఇంటి నుండి, మీ నుండి దూరం చేసుకోవడానికి మంగళవారం ఒక ప్రత్యేక పరిహారం సూచించబడింది. ఒక మిరియానికి సూది గుచ్చి, దానిని ఒక క్యాండిల్ దగ్గర కాల్చాలి. ఆ మిరియం నుంచి వచ్చే పొగను వాసన చూడాలి. వాసన చూసిన తర్వాత ఆ మిరియాన్ని బయట డస్ట్ బిన్‌లో పారేయాలి. ఈ పొగను వాసన చూడటం వల్ల మీ మీద ఎలాంటి ప్రయోగాలు పనిచేయవు, అలాగే ఇంటి మీద ఎలాంటి నెగటివ్ ఎనర్జీ ప్రభావం చూపదు.

ఆర్థిక బాధలు తొలగిపోయి..

ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోయి, సంపాదన బాగా పెరగాలంటే ఆదివారం సాయంత్రం లేదా అమావాస్య రోజు సాయంత్రం ఒక అద్భుతమైన పరిహారం పాటించాలి. ఈ పరిహారం ఆదివారం సాయంత్రం లేదా అమావాస్య సాయంత్రం 6:30 గంటల నుంచి 9:30 గంటల మధ్య మాత్రమే చేయాలి. ఈ సమయం దాటిన తర్వాత లేదా ముందు చేసినట్లయితే ఫలితం ఉండదు.

పరిహారం చేసే విధానం:

  1. ముందుగా చక్కగా స్నానం చేయాలి.
  2. తొమ్మిది మిరియాలను చేతిలోకి తీసుకోవాలి.
  3. ఇంటి బయటకు వచ్చి నిలబడాలి.
  4. చేతిలో ఉన్న తొమ్మిది మిరియాలను క్లాక్ వైస్ దిశలో తొమ్మిది సార్లు తిప్పాలి.
  5. ఆ తర్వాత యాంటీ క్లాక్ వైస్ దిశలో తొమ్మిది సార్లు తిప్పాలి.
  6. అనంతరం, ఒక్కొక్క దిక్కు వైపు ఒక్కొక్క మిరియాన్ని విసిరేస్తూ “ఓం, ఓం, ఓం” అనే మంత్రాన్ని పఠించాలి. తూర్పు, పడమర, ఉత్తరము, దక్షిణము, ఈశాన్యము, ఆగ్నేయము, వాయువ్యము, నైరుతి.. ఈ ఎనిమిది దిక్కులలో ఒక్కో మిరియాన్ని వేయాలి.
  7. ఎనిమిది దిక్కులలో మిరియాలు వేసిన తర్వాత, తొమ్మిదవ మిరియాన్ని ఆకాశం వైపు విసిరేస్తూ “ఓం, ఓం, ఓం” అని పఠించాలి.
  8. తొమ్మిది మిరియాలు విసిరిన తర్వాత, కాళ్ళు చేతులు కడుక్కుని ఇంట్లోకి ప్రవేశించాలి.

ఈ పరిహారం చేయడం వల్ల ప్రకృతిలో ఉన్న సానుకూల శక్తి మీలోకి ప్రవేశిస్తుంది. మీలో ఉన్న నెగటివ్ ఎనర్జీతో పాటు ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ కూడా తొలగిపోతుంది. దీని ఫలితంగా సంపాదన బాగా పెరుగుతుంది. అనేక మార్గాల్లో ధనాదాయాన్ని పెంపొందింప చేసుకోవచ్చు. ఈ శక్తివంతమైన మిరియాల పరిహారాలను పాటించి ఆర్థిక శ్రేయస్సును, ప్రశాంతతను పొందవచ్చని పరిహార శాస్త్రం సూచిస్తుంది.

(Disclaimer: ఈ వార్తలోని సమాచారం జ్యోతిష్య శాస్త్రం, మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు అందించడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించదు.)

Follow Us
సంపద బాగా పెరగాలంటే.. ఆదివారం మిరియాలతో ఈ ఒక్క పని చేయండి!
సంపద బాగా పెరగాలంటే.. ఆదివారం మిరియాలతో ఈ ఒక్క పని చేయండి!
పెట్రోల్ బంక్ కింద ఎంత పెట్రోల్ ఉంటుంది..? భూగర్భ ట్యాంకుల రహస్యం
పెట్రోల్ బంక్ కింద ఎంత పెట్రోల్ ఉంటుంది..? భూగర్భ ట్యాంకుల రహస్యం
ఆహా అద్భుతం.. రాగి పండితో ఇలా కరకరలాడే వడలు చేసుకుంటే
ఆహా అద్భుతం.. రాగి పండితో ఇలా కరకరలాడే వడలు చేసుకుంటే
సశస్త్ర సీమా బల్‌లో 827 కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
సశస్త్ర సీమా బల్‌లో 827 కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
IPL 2026: బీసీసీఐ షాక్‌తో దారికొచ్చిన బంగ్లాదేశ్..
IPL 2026: బీసీసీఐ షాక్‌తో దారికొచ్చిన బంగ్లాదేశ్..
టిక్కెట్ ఇవ్వను.. ఏం చేసుకుంటావో చేసుకో! రైల్వే స్టేషన్‌లో వివాదం
టిక్కెట్ ఇవ్వను.. ఏం చేసుకుంటావో చేసుకో! రైల్వే స్టేషన్‌లో వివాదం
ఆ సినిమా కోసం థియేటర్ల వద్ద 144 సెక్షన్..
ఆ సినిమా కోసం థియేటర్ల వద్ద 144 సెక్షన్..
కామద ఏకాదశి: తులసి పూజ ఇలా చేస్తే మీ ఇంట్లో సిరిసంపద, సుఖసంతోషాలు
కామద ఏకాదశి: తులసి పూజ ఇలా చేస్తే మీ ఇంట్లో సిరిసంపద, సుఖసంతోషాలు
హీరోకు ఇచ్చింది రూ. 11 వేలే.. కానీ సినిమా ఇండస్ట్రీ హిట్..
హీరోకు ఇచ్చింది రూ. 11 వేలే.. కానీ సినిమా ఇండస్ట్రీ హిట్..
అమరావతికి చట్టబద్ధత.. అసెంబ్లీలో చారిత్రాత్మక తీర్మానం..
అమరావతికి చట్టబద్ధత.. అసెంబ్లీలో చారిత్రాత్మక తీర్మానం..