నార్సింగిలోని అల్కాపూర్ టౌన్షిప్లో గ్యాస్ సిలిండర్ చోరీకి గురైంది. గ్యాస్ కొరతను ఆసరాగా చేసుకుని బైక్పై వచ్చిన ఓ దుండగుడు, సరఫరా ఆటో నుండి నిశ్శబ్దంగా సిలిండర్ను ఎత్తుకెళ్లాడు. ముఖానికి మాస్క్ ధరించి అత్యంత వేగంగా జరిగిన ఈ చోరీ సీసీటీవీ కెమెరాలో రికార్డయింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.