AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వాహనదారులకు సర్కార్ గుడ్‌న్యూస్.. ఇకపై ఇంటి నుంచే డ్రైవింగ్ లైసెన్స్, వెహికల్ రిజిస్ట్రేషన్..!

తెలంగాణ వాహనదారులకు భారీ ఊరట కలిగించే నిర్ణయం తీసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఇకపై డ్రైవింగ్ లైసెన్స్ (DL), రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ (RC) కోసం ఆర్టీవో కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా చేసేలా కొత్త విధానాన్ని అమలు చేయనున్నారు. కార్డుల ప్రింటింగ్, పంపిణీ ప్రక్రియలో మార్పులు చేస్తూ సెంట్రలైజ్డ్ సిస్టమ్ తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది.

వాహనదారులకు సర్కార్ గుడ్‌న్యూస్.. ఇకపై ఇంటి నుంచే డ్రైవింగ్ లైసెన్స్, వెహికల్ రిజిస్ట్రేషన్..!
Driving License Rc
Ashok Bheemanapalli
| Edited By: |

Updated on: Mar 28, 2026 | 11:10 AM

Share

తెలంగాణ వాహనదారులకు భారీ ఊరట కలిగించే నిర్ణయం తీసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఇకపై డ్రైవింగ్ లైసెన్స్ (DL), రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ (RC) కోసం ఆర్టీవో కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా చేసేలా కొత్త విధానాన్ని అమలు చేయనున్నారు. కార్డుల ప్రింటింగ్, పంపిణీ ప్రక్రియలో మార్పులు చేస్తూ సెంట్రలైజ్డ్ సిస్టమ్ తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది.

ఇప్పటివరకు తెలంగాణ వ్యాప్తంగా 61 ఆర్టీవో కార్యాలయాల పరిధిలోనే లైసెన్స్‌లు, ఆర్సీలు ప్రింట్ చేసి వాహనదారులకు అందిస్తున్నారు. అయితే ఈ విధానంలో ఆలస్యం, మధ్యవర్తుల జోక్యం వంటి సమస్యలు తరచూ ఎదురవుతున్నాయి. దీంతో ఈ ప్రక్రియను సులభతరం చేసేందుకు ఒకే కేంద్రం నుంచి కార్డులను ప్రింట్ చేసి నేరుగా వాహనదారుల ఇళ్లకు పంపించేలా ప్రభుత్వం ప్రణాళిక రూపొందిస్తోంది. ఈ ప్రతిపాదనకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.

ప్రస్తుతం తెలంగాణలో ప్రతి సంవత్సరం సుమారు 4.70 లక్షల కొత్త డ్రైవింగ్ లైసెన్స్‌లు జారీ చేస్తున్నారు. దాదాపు 9.90 లక్షల వాహనాలు రిజిస్ట్రేషన్ అవుతున్నాయి. మొత్తం మీద ఏడాదికి 14 నుండి 15 లక్షల కార్డులను పంపిణీ చేయాల్సి వస్తోంది. కానీ ప్రస్తుతం ఈ ప్రక్రియ పూర్తవడానికి వారాలు, కొన్ని సందర్భాల్లో నెలలు కూడా పడుతోంది.

గతంలో ఏసీబీ తనిఖీల్లో వందలాది లైసెన్స్‌లు, ఆర్సీలు ఏజెంట్ల వద్ద దొరకడం వివాదానికి దారి తీసింది. మరోవైపు కార్డులు చేతికి అందకపోవడంతో ట్రాఫిక్ పోలీసులు చేసే తనిఖీల్లో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యలకు చెక్ పెట్టేందుకు మధ్యవర్తుల ప్రమేయం లేకుండా నేరుగా పోస్టల్ ద్వారా వాహనదారుల ఇంటికే కార్డులు చేరే విధంగా చర్యలు తీసుకుంటున్నారు.

సెంట్రలైజ్డ్ ప్రింటింగ్ వ్యవస్థ అమల్లోకి వస్తే రాష్ట్రవ్యాప్తంగా ఒకే కేంద్రం నుంచి వేగంగా కార్డులు జారీ అవుతాయి. రవాణా శాఖకు పన్నులు, ఫీజుల రూపంలో ప్రతి సంవత్సరం రూ. 6,700 కోట్ల నుంచి రూ. 6,900 కోట్ల వరకు ఆదాయం వస్తోంది. ఇందులో సుమారు రూ.135 కోట్లకు పైగా యూజర్ ఛార్జీలు ఉన్నాయి. ఈ నిధులను శాఖకు కేటాయించేందుకు ప్రభుత్వం అంగీకరించినట్లు తెలుస్తోంది.

ఈ కొత్త విధానం అమల్లోకి వస్తే వాహనదారులకు సమయం, శ్రమ రెండూ ఆదా కావడంతో పాటు అవినీతి, ఆలస్యం వంటి సమస్యలకు పెద్ద ఎత్తున చెక్ పడే అవకాశం ఉంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us