AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RCB vs SRH Playing XI: టాస్ గెలిచిన ఆర్సీబీ.. ప్లేయింగ్ 11తోనే పిచ్చెక్కించారుగా..

IPL 2026 Royal Challengers Bengaluru vs Sunrisers Hyderabad Playing XI: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 19వ సీజన్ అట్టహాసంగా ప్రారంభమైంది. తొలి పోరులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆర్సీబీ ముందుగా బౌలింగ్ ఎంచుకుంది.

RCB vs SRH Playing XI: టాస్ గెలిచిన ఆర్సీబీ.. ప్లేయింగ్ 11తోనే పిచ్చెక్కించారుగా..
Rcb Vs Srh Playing Xi Ipl 2026
Venkata Chari
|

Updated on: Mar 28, 2026 | 7:18 PM

Share

ఐపీఎల్ 2026 ఆరంభ మ్యాచ్‌లో టాస్ కీలక పాత్ర పోషించింది. ఈక్రమంలో టాస్ గెలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ టాస్ గెలిచి మొదట ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. చిన్నస్వామి మైదానం సాధారణంగా చేజింగ్‌కు అనుకూలంగా ఉండటం, రాత్రి సమయంలో మంచు కురిసే అవకాశం ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కెప్టెన్ వెల్లడించారు. మరోవైపు సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు మొదట బ్యాటింగ్ చేసి భారీ లక్ష్యాన్ని నిర్దేశించాలని పట్టుదలతో ఉంది. కాగా, గాయం కారణంగా ఆస్ట్రేలియా పేసర్ జోష్ హేజిల్‌వుడ్ ఆర్‌సీబీ తొలి మ్యాచ్‌లో ఆడటం లేదు. అతని స్థానంలో న్యూజిలాండ్‌కు చెందిన జాకబ్ డఫీకి చోటు దక్కింది.

బెంగళూరు జట్టులో భారీ మార్పులు..

సొంత గడ్డపై ఆడుతున్న బెంగళూరు జట్టు అంచనాలకు తగ్గట్టుగా బరిలోకి దిగింది. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఓపెనర్‌గా వస్తుండగా, మధ్య ఓవర్లలో పరుగుల వేగాన్ని పెంచేందుకు విధ్వంసకర ఆటగాళ్లను తుది జట్టులోకి తీసుకున్నారు. ముఖ్యంగా బౌలింగ్ విభాగంలో వైవిధ్యం కోసం స్పిన్నర్లు, వేగవంతమైన బౌలర్ల కలయికను ఎంచుకున్నారు.

హైదరాబాద్ పోరాటం.. పటిష్టమైన బ్యాటింగ్ లైనప్

సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు కూడా ఎక్కడా తగ్గడం లేదు. విదేశీ ఆటగాళ్లు, యువ భారతీయ ప్రతిభతో జట్టు సమతూకంగా కనిపిస్తోంది. పవర్ ప్లేలో మెరుపులు మెరిపించే బ్యాటర్లు జట్టుకు అదనపు బలం. బౌలింగ్ విభాగంలో అనుభవజ్ఞుడైన కెప్టెన్ మార్గదర్శకత్వంలో పకడ్బందీ ప్రణాళికలతో బరిలోకి దిగుతున్నారు. చిన్నస్వామి వంటి చిన్న మైదానంలో భారీ స్కోరు సాధిస్తేనే విజయావకాశాలు మెరుగుపడతాయని హైదరాబాద్ భావిస్తోంది.

ఇరు జట్ల  ప్లేయింగ్ XI:

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ప్లేయింగ్ XI): విరాట్ కోహ్లీ, ఫిల్ సాల్ట్, రజత్ పాటిదార్(కెప్టెన్), జితేష్ శర్మ(కీపర్), టిమ్ డేవిడ్, రొమారియో షెపర్డ్, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, అభినందన్ సింగ్, జాకబ్ డఫీ, సుయాష్ శర్మ.

సన్‌రైజర్స్ హైదరాబాద్ (ప్లేయింగ్ XI): అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్ (కీపర్/కెప్టెన్), హెన్రిచ్ క్లాసెన్, అనికేత్ వర్మ, నితీష్ కుమార్ రెడ్డి, సలీల్ అరోరా, హర్ష్ దూబే, హర్షల్ పటేల్, జయదేవ్ ఉనద్కత్, ఎషాన్ మలింగ.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us