Team India: ఇది కదా దిమ్మతిరిగే స్కెచ్.. సర్ ప్రైజ్ ఎంట్రీ ఇవ్వనున్న ఖతర్నాక్ ప్లేయర్.. ప్రత్యర్థులకు గుండె దడే
T20I World Cup 2026: రాబోయే న్యూజిలాండ్ సిరీస్ ఈ కొత్త కాంబినేషన్లకు ఒక పరీక్షగా నిలవనుంది. ఒకవేళ తిలక్ వర్మ సమయానికి కోలుకోకపోతే, శ్రేయస్ అయ్యర్ సర్ప్రైజ్ ఎంట్రీ టీమ్ ఇండియా ప్రపంచ కప్ మిషన్‌లో ఒక మాస్టర్ స్ట్రోక్‌గా మారవచ్చు.

Team India: టీ20 వరల్డ్ కప్ 2026 సమరానికి కౌంట్‌డౌన్ మొదలైంది. మరో నెల రోజుల్లో ప్రారంభం కానున్న ఈ మెగా టోర్నీ కోసం క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే, అనూహ్య పరిణామాల మధ్య టీమ్ ఇండియా స్క్వాడ్‌లోకి ఒక స్టార్ ఆటగాడి సర్ప్రైజ్ ఎంట్రీ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒకవైపు కీలక ఆటగాడి గాయం, మరోవైపు వెటరన్ ప్లేయర్ నిలకడైన ప్రదర్శనతో కోచ్ గౌతమ్ గంభీర్, చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ ఆలోచనలో పడ్డారు.
తిలక్ వర్మ ఫిట్‌నెస్.. టీమ్ ఇండియాకు పెద్ద తలనొప్పి ప్రస్తుతం టీమ్ ఇండియా మేనేజ్‌మెంట్‌ను తిలక్ వర్మ గాయం తీవ్రంగా కలవరపెడుతోంది. అందుతున్న సమాచారం ప్రకారం, న్యూజిలాండ్‌తో జరగనున్న టీ20 సిరీస్‌కు తిలక్ వర్మ పూర్తిగా దూరమయ్యాడు. ఇది భారత టీ20 ప్రణాళికలకు గట్టి ఎదురుదెబ్బ అనే చెప్పాలి. మెడికల్ టీమ్ అతని రికవరీని పర్యవేక్షిస్తున్నప్పటికీ, 2026 టీ20 ప్రపంచ కప్ సమయానికి అతను వంద శాతం ఫిట్‌నెస్ సాధిస్తాడన్న గ్యారెంటీ లేదు.
ఎడమచేతి వాటం బ్యాటింగ్, ఒత్తిడిలో ప్రశాంతంగా ఆడటం, మిడిల్ ఓవర్లలో స్పిన్నర్లను సమర్థవంతంగా ఎదుర్కోవడంలో తిలక్ వర్మ సిద్ధహస్తుడు. అందుకే టీ20 జట్టులో అతను కీలక సభ్యుడిగా మారాడు. అతని గైర్హాజరీ ఇప్పుడు సెలెక్టర్లను తమ నిర్ణయాలను పునరాలోచించేలా చేస్తోంది.
శ్రేయస్ అయ్యర్.. బలమైన ప్రత్యామ్నాయం తిలక్ వర్మ అందుబాటులో లేకపోతే, ఆ స్థానాన్ని భర్తీ చేసే రేసులో శ్రేయస్ అయ్యర్ అందరికంటే ముందు వరుసలో ఉన్నాడు. అంతర్జాతీయ స్థాయిలో అయ్యర్‌కు ఉన్న అనుభవం, పేస్, స్పిన్ బౌలింగ్‌ను సమర్థవంతంగా ఎదుర్కోగల సామర్థ్యం అతన్ని నమ్మదగ్గ ఎంపికగా మారుస్తున్నాయి. సాధారణంగా వన్డే ప్లేయర్‌గా ముద్ర పడినప్పటికీ, అయ్యర్ తన టీ20 స్ట్రైక్ రేట్‌ను మెరుగుపరుచుకోవడానికి తీవ్రంగా శ్రమిస్తున్నాడు.
అయ్యర్‌లోని నాయకత్వ లక్షణాలు, నిలకడైన ప్రదర్శన జట్టుకు సమతుల్యతను ఇస్తాయని సెలెక్టర్లు భావిస్తున్నారు. దూకుడుగా ఆడుతూనే అవసరమైనప్పుడు యాంకర్ రోల్ పోషించగల అతని నైపుణ్యం, కోచ్ గౌతమ్ గంభీర్ అనుసరించే ‘అగ్రెసివ్ క్రికెట్’ శైలికి సరిగ్గా సరిపోతుంది.
గంభీర్-అగార్కర్ సాహసోపేత నిర్ణయం.. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ ఎప్పుడూ మానసిక దృఢత్వం కలిగిన ఆటగాళ్లకే ప్రాధాన్యత ఇస్తారు. తిలక్ వర్మ లభ్యతపై స్పష్టత లేని పక్షంలో, శ్రేయస్ అయ్యర్‌ను జట్టులోకి తీసుకోవడమే సరైన రిస్క్ అని వారు భావిస్తున్నారు. అయ్యర్ రాకతో భారత బ్యాటింగ్ లైనప్‌కు మరింత స్థిరత్వం లభించే అవకాశం ఉంది.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..



