AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Union Budget 2026: ఫిబ్రవరి 1న నిర్మలమ్మ బడ్జెట్.. జనవరి 28 నుంచే పార్లమెంట్ సమావేశాలు.. వారికి గుడ్ న్యూస్ ఉంటుందా..?

దేశ ఆర్థిక భవిష్యత్తును ఆవిష్కరించే కేంద్ర బడ్జెట్ 2026కు ముహూర్తం ఖరారైంది. 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక బడ్జెట్‌ను ఫిబ్రవరి 1నపార్లమెంటులో ప్రవేశపెట్టనున్నారు. సాధారణంగా సెలవు రోజైనప్పటికీ, బడ్జెట్ సంప్రదాయం ప్రకారం ఆదివారం కూడా సభ కొనసాగనుంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వరుసగా ఎనిమిదోసారి బడ్జెట్‌ను ప్రవేశపెట్టి సరికొత్త రికార్డు సృష్టించనున్నారు.

Union Budget 2026: ఫిబ్రవరి 1న నిర్మలమ్మ బడ్జెట్.. జనవరి 28 నుంచే పార్లమెంట్ సమావేశాలు.. వారికి గుడ్ న్యూస్ ఉంటుందా..?
Union Budget 2026
Krishna S
|

Updated on: Jan 09, 2026 | 8:26 PM

Share

దేశ ఆర్థిక భవిష్యత్తును ఆవిష్కరించే కేంద్ర బడ్జెట్ 2026కు ముహూర్తం ఖరారైంది. 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక బడ్జెట్‌ను ఫిబ్రవరి 1నపార్లమెంటులో ప్రవేశపెట్టనున్నారు. సాధారణంగా సెలవు రోజైనప్పటికీ, బడ్జెట్ సంప్రదాయం ప్రకారం ఆదివారం కూడా సభ కొనసాగనుంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వరుసగా ఎనిమిదోసారి బడ్జెట్‌ను ప్రవేశపెట్టి సరికొత్త రికార్డు సృష్టించనున్నారు.

షెడ్యూల్ ఇలా

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదంతో పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల షెడ్యూల్ విడుదలైంది. జనవరి 28l పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతాయి. తొలిరోజు ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగిస్తారు. జనవరి 29న దేశ ఆర్థిక స్థితిగతులను వివరించే ఆర్థిక సర్వేను ప్రధాన ఆర్థిక సలహాదారు వి. అనంత నాగేశ్వరన్ సమర్పిస్తారు. ఫిబ్రవరి 1న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్ ప్రవేశపెడతారు.

రెండు విడతలుగా సమావేశాలు

ఈసారి బడ్జెట్ సమావేశాలు సుదీర్ఘంగా సాగనున్నాయి. వీటిని రెండు దశలుగా విభజించారు. మొదటి దశ జనవరి 28న ప్రారంభమై ఫిబ్రవరి 13తో ముగుస్తుంది. రెండవ దశ స్వల్ప విరామం తర్వాత మార్చి 9న ప్రారంభమై ఏప్రిల్ 2 వరకు కొనసాగుతుంది.

ఈ బడ్జెట్‌పై ఉన్న అంచనాలు

ప్రధాని మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం ఈ బడ్జెట్‌లో వికసిత్ భారత్ లక్ష్యంగా కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఆదాయపు పన్ను స్లాబ్‌లలో మార్పులు ఉంటాయని వేతన జీవులు ఆశగా ఎదురుచూస్తున్నారు. రైల్వే, రహదారులు, రక్షణ రంగాలకు భారీగా నిధులు కేటాయించే అవకాశం ఉంది. రైతుల ఆదాయం పెంపుదల, గ్రామీణ ఉపాధి పథకాలపై ప్రత్యేక దృష్టి సారించవచ్చని సమాచారం. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మందగమనం ఉన్నప్పటికీ, భారత ఆర్థిక వ్యవస్థను పరుగులు పెట్టించేలా ఈ బడ్జెట్ రూపకల్పన జరుగుతోంది. ఈ క్రమంలోనే ప్రధాని మోదీ ఇప్పటికే ఆర్థిక నిపుణులతో వరుస భేటీలు నిర్వహిస్తూ తుది మెరుగులు దిద్దుతున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఈ యూపీఐ యాప్ ద్వారా సెకన్లలోనే పీఎఫ్ డబ్బులు విత్ డ్రా
ఈ యూపీఐ యాప్ ద్వారా సెకన్లలోనే పీఎఫ్ డబ్బులు విత్ డ్రా
ఓటీటీలోకి క్రైమ్ థ్రిల్లర్ మూవీ..
ఓటీటీలోకి క్రైమ్ థ్రిల్లర్ మూవీ..
మీ వంటింట్లో ఉండే ఈ చిన్న గింజల వెనుక.. ఇంత పెద్ద ఆరోగ్య రహస్యాలు
మీ వంటింట్లో ఉండే ఈ చిన్న గింజల వెనుక.. ఇంత పెద్ద ఆరోగ్య రహస్యాలు
పండక్కి ఊరెళ్లవారికి బిగ్‌ అలర్ట్.. ఈ మార్గాల్లో వెళ్తే..
పండక్కి ఊరెళ్లవారికి బిగ్‌ అలర్ట్.. ఈ మార్గాల్లో వెళ్తే..
కందిపప్పు వీరికి విషంతో సమానం.. తిన్నారంటే ఈ సమస్యలు పక్కా..
కందిపప్పు వీరికి విషంతో సమానం.. తిన్నారంటే ఈ సమస్యలు పక్కా..
24క్యారెట్‌ స్వచ్ఛమైన బంగారం కేవలం 181 రూపాయలకే! ఎక్కడో తెలిస్తే
24క్యారెట్‌ స్వచ్ఛమైన బంగారం కేవలం 181 రూపాయలకే! ఎక్కడో తెలిస్తే
తెలంగాణ నిరుద్యోగులకు రిలీఫ్.. జాబ్ క్యాలెండర్ విడుదలపై అప్డేట్
తెలంగాణ నిరుద్యోగులకు రిలీఫ్.. జాబ్ క్యాలెండర్ విడుదలపై అప్డేట్
ఉదయం పూట గోరువెచ్చని నీరు తాగుతున్నారా.. అయితే ఈ విషయాలు..
ఉదయం పూట గోరువెచ్చని నీరు తాగుతున్నారా.. అయితే ఈ విషయాలు..
ఏపీకి తప్పిన తుఫాన్ గండం.. కానీ ఇంతలో మరో ట్విస్ట్
ఏపీకి తప్పిన తుఫాన్ గండం.. కానీ ఇంతలో మరో ట్విస్ట్
7 కోట్లతో తీస్తే 90 కోట్లు.. ఆస్కార్ రేసులో బ్లాక్ బస్టర్ మూవీ
7 కోట్లతో తీస్తే 90 కోట్లు.. ఆస్కార్ రేసులో బ్లాక్ బస్టర్ మూవీ