AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

టీమిండియా బెస్ట్ కెప్టెన్ ధోని కాదా.. ఇదేంటిది జైషా అంతమాట అనేశాడేంది.. ఎవరిని ఎంచుకున్నాడంటే?

Jay Shah Hails Rohit Sharma as India's Greatest Captain: కెప్టెన్సీ పదవి ఉన్నా లేకపోయినా, భారత క్రికెట్‌లో రోహిత్ శర్మ ముద్ర ఎప్పటికీ చెరిగిపోనిది. జై షా వంటి అత్యున్నత స్థాయి వ్యక్తులు అతన్ని భారత్ బెస్ట్ కెప్టెన్‌గా గుర్తించడం, రోహిత్ సాధించిన విజయాలకు ఒక గొప్ప గుర్తింపుగా భావించవచ్చు.

టీమిండియా బెస్ట్ కెప్టెన్ ధోని కాదా.. ఇదేంటిది జైషా అంతమాట అనేశాడేంది.. ఎవరిని ఎంచుకున్నాడంటే?
Jay Shah Team India Captain
Venkata Chari
|

Updated on: Jan 09, 2026 | 12:36 PM

Share

Jay Shah Hails Rohit Sharma as India’s Greatest Captain: భారత క్రికెట్‌లో రోహిత్ శర్మ ఒక శకాన్ని సృష్టించాడు. ప్రస్తుతం అతను అధికారికంగా కెప్టెన్ కాకపోయినా, అతని నాయకత్వ లక్షణాలు, జట్టుపై ఉన్న ప్రభావం మరువలేనిది. ఇటీవల జరిగిన ఒక కార్యక్రమంలో బీసీసీఐ చైర్మన్ జై షా, రోహిత్ శర్మను “భారత్ కెప్టెన్” అని సంబోధిస్తూ, అతనిని అత్యుత్తమ నాయకుడిగా కొనియాడారు. క్రీజులో అతని వ్యూహాలు, డ్రెస్సింగ్ రూమ్‌లో అతని మనస్తత్వం జట్టు విజయాల్లో ఎంతటి కీలక పాత్ర పోషించాయో జై షా గుర్తుచేశారు.

రోహిత్ శర్మ 2025 అక్టోబర్‌లో వన్డే కౌన్సిలింగ్ బాధ్యతల నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే. 2027 వన్డే వరల్డ్ కప్ సన్నద్ధతలో భాగంగా శుభమన్ గిల్‌కు ఆ బాధ్యతలు అప్పగించారు. ప్రస్తుతం 38 ఏళ్ల రోహిత్ వన్డేల్లో కేవలం ఒక స్పెషలిస్ట్ బ్యాటర్‌గా మాత్రమే కొనసాగుతున్నాడు. ఇప్పటికే టెస్టులు, టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించినప్పటికీ, టీమ్ ఇండియాలో అతని గౌరవం ఇంచుమంతైనా తగ్గలేదని జై షా వ్యాఖ్యలు నిరూపిస్తున్నాయి.

ఇది కూడా చదవండి: టీ20ల్లో విధ్వంసం అంటే ఇదే.. 38 సిక్సర్లు, 53 ఫోర్లు.. 549 పరుగులతో అన్ బ్రేకబుల్ రికార్డ్..

ఇవి కూడా చదవండి

రికార్డుల వీరుడు – రోహిత్ కెప్టెన్సీ: రోహిత్ శర్మ నేతృత్వంలో టీమ్ ఇండియా అద్భుతమైన రికార్డులను నమోదు చేసింది.

వన్డేల్లో: 56 వన్డేలకు సారథ్యం వహించగా భారత్ 42 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. అతని హయాంలోనే భారత్ ఆసియా కప్, 2025 ఛాంపియన్స్ ట్రోఫీని ముద్దాడింది.

టీ20ల్లో: భారత్ తరపున అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా రోహిత్ నిలిచాడు. 62 మ్యాచ్‌ల్లో 49 విజయాలు అందించాడు (79% విన్ పర్సంటేజ్).

వరల్డ్ కప్ విజేత: 2024 టీ20 వరల్డ్ కప్ గెలవడం రోహిత్ కెరీర్‌లో అతిపెద్ద మైలురాయి. 2023 వన్డే వరల్డ్ కప్ ఓటమి తర్వాత, జట్టును మళ్లీ విజయతీరాలకు చేరుస్తానని రోహిత్ చేసిన వాగ్దానాన్ని జై షా ఈ సందర్భంగా గుర్తుచేశారు.

Video: 38 ఇన్నింగ్స్‌ల్లో 13 సెంచరీలు, 13 ఫిఫ్టీలు.. ఈ విధ్వంసం కనిపిస్తలేదా గంభీర్.. అరంగేట్రం ఛాన్స్ ఇంకెప్పుడు?

జై షా దృష్టిలో అసలైన లీడర్: ‘యునైటెడ్ ఇన్ ట్రయంఫ్’ (United in Triumph) అనే కార్యక్రమంలో పాల్గొన్న జై షా మాట్లాడుతూ.. “కేవలం చేతికి కెప్టెన్ బ్యాండ్ ఉన్నంత మాత్రాన లీడర్ కాలేరు, జట్టును ముందుకు నడిపించి టైటిల్స్ గెలిపించేవాడే అసలైన నాయకుడు” అని రోహిత్ శర్మను ఉద్దేశించి అన్నారు. భారత్‌కు రెండు ప్రధాన ఐసీసీ ట్రోఫీలు అందించిన ఘనత రోహిత్‌కే దక్కుతుందని ఆయన పేర్కొన్నారు.

ముంబైలో మెరుపులు – ఫ్యాన్స్‌లో ఉత్సాహం: మరోవైపు, జనవరి 11 నుంచి న్యూజిలాండ్‌తో ప్రారంభం కానున్న వన్డే సిరీస్ కోసం రోహిత్ శర్మ ముంబైలో నెట్ ప్రాక్టీస్ మొదలుపెట్టాడు. తాజాగా వైరల్ అయిన వీడియోలో రోహిత్ చాలా ఫిట్‌గా, గతంలో కంటే సన్నగా కనిపిస్తూ భారీ సిక్సర్లతో విరుచుకుపడుతున్నాడు. అతని బ్యాటింగ్ తీరు చూస్తుంటే న్యూజిలాండ్‌పై పరుగుల వరద పారడం ఖాయమని ఫ్యాన్స్ సంబరపడుతున్నారు.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..