‘దిల్ బేచారా’ మూవీ ట్రైలర్ రికార్డులు.. సుశాంత్ ఒక్కడికే ఇది సాధ్యం..!

'దిల్ బేచారా' మూవీ ట్రైలర్ రికార్డులు.. సుశాంత్ ఒక్కడికే ఇది సాధ్యం..!

బాలీవుడ్ దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ నటించిన చివరి చిత్రం 'దిల్ బెచారా'. ఇటీవల విడుదలైన ఈ సినిమా ట్రైలర్ సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తోంది.

Ravi Kiran

|

Jul 07, 2020 | 2:15 PM

Dil Bechara:  బాలీవుడ్ దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ నటించిన చివరి చిత్రం ‘దిల్ బేచారా’. ఈ సినిమా జూలై 24న ఓటీటీ ప్లాట్‌ఫాం డిస్నీ హాట్‌స్టార్‌లో విడుదల కాబోతోంది. 2014లో వచ్చిన హాలీవుడ్ మూవీ ‘ది ఫాల్ట్ ఇన్ అవర్ స్టార్స్’ ఆధారంగా ఈ చిత్రాన్ని కాస్టింగ్ డైరెక్టర్ ముకేశ్ ఛబ్రా తెరకెక్కించాడు. ఇటీవల విడుదలైన ఈ సినిమా ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. అంతేకాకుండా సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తోంది.

గడిచిన 24 గంటల్లో ఈ సినిమా ట్రైలర్ 20 మిలియన్ వ్యూస్ రాబట్టడమే కాకుండా.. 4.2 మిలియన్ లైక్స్ కూడా  తెచ్చుకుంది. ఇక లైక్స్ విషయానికి వస్తే సుశాంత్ రెండు రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ ట్రైల‌ర్‌కు కేవలం 14 నిమిషాల్లో 100k లైక్స్.. అలాగే 98 నిమిషాల్లోనే 1 మిలియన్ లైక్స్ దక్కించుకుంది. బాలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పటివరకు ఈ రికార్డును ఎవరు దక్కించుకోకపోవడం గమనార్హం. తన అభిమాన నటుడు స్మృతులు, జ్ఞాపకాలను గుర్తు తెచ్చుకుంటూ.. దిల్ బేచారా ట్రైల‌ర్‌ను ఫ్యాన్స్ ట్రెండ్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ ట్రైలర్ అవెంజర్స్ సిరీస్‌లో వచ్చిన ఇన్ఫినిటీ వార్‌, ఎండ్ గేమ్ మూవీస్ ట్రైలర్లను దాటేసింది. కాగా, మున్ముందు మరిన్ని రికార్డులను బీట్ చేయాలని ఫ్యాన్స్ సన్నద్ధం అయ్యారు. ఈ మూవీలో సుశాంత్ జోడిగా సంజన సంఘి నటించగా.. ఏఆర్ రెహ్మాన్ సంగీతం అందించాడు.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu