AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సుశాంత్‌ మూవీని విజయవంతం చేద్దాం.. ఫ్యాన్స్‌కి యంగ్ హీరో పిలుపు

బాలీవుడ్‌ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ నటించిన చివరి చిత్రం దిల్ బేచారే. ఈ మూవీ ట్రైలర్ సోమవారం విడుదల కాగా.. అందరినీ ఆకట్టుకుంది.

సుశాంత్‌ మూవీని విజయవంతం చేద్దాం.. ఫ్యాన్స్‌కి యంగ్ హీరో పిలుపు
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jul 07, 2020 | 2:47 PM

Share

బాలీవుడ్‌ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ నటించిన చివరి చిత్రం దిల్ బేచారే. ఈ మూవీ ట్రైలర్ సోమవారం విడుదల కాగా.. అందరినీ ఆకట్టుకుంది. ఇక ఈ మూవీ ట్రైలర్‌పై బాలీవుడ్‌ ప్రముఖులు కూడా స్పందిస్తున్నారు. ట్రైలర్ చాలా బావుందని, సినిమాను చూసేందుకు ఎదురుచూస్తున్నామని ప్రియాంక చోప్రా, సిద్ధార్థ్ మల్హోత్రా, కృతి సనన్, ఫర్హాన్ అక్తర్‌, భూమి పడ్నేకర్‌, నవాజుద్దీన్‌ సిద్ధిఖ్వీ, అనిల్‌ కపూర్‌ తదితరులు ట్వీట్లు చేశారు. ఈ నేపథ్యంలో దిల్‌ బేచారేను విజయవంతం చేయాలంటూ యంగ్ హీరో విద్యుత్‌ జమ్వాల్ తన అభిమానులకు‌ పిలుపునిచ్చారు.

ఈ మేరకు ఓ వీడియోను విడుదల చేసిన జమ్వాల్‌.. ”ఇది నా ఫ్యాన్స్ అందరి కోసం. మీ అందరిని చూసి నేను ఎప్పుడూ గర్వపడుతుంటా. మిమ్మల్ని నేను చాలా ఇష్టపడుతుంటా. ఇవాళ సుశాంత్ దిల్ బేచారే ట్రైలర్ విడుదలైంది. అత్యధిక మంది చూసిన చిత్రంగా దిల్ బేచారేను విజయవంతం చేయండి” అని అన్నారు. కాగా సుశాంత్‌, సంజనా సంఘి జంటగా నటించిన ఈ చిత్రంలో సైఫ్ అలీ ఖాన్‌ కీలక పాత్రలో కనిపించనున్నారు. ముఖేష్ చాబ్రా దర్శకత్వం వహించారు. ద ఫాల్ట్‌ ఇన్ అవర్‌ స్టార్ నవల ఆధారంగా తెరకెక్కిన ఈ మూవీని ఫాక్స్ స్టార్ స్టూడియోస్‌ నిర్మించింది. ఈ నెల 24న హాట్‌ స్టార్‌లో ప్రీమియర్‌ కాబోతున్న ఈ చిత్రాన్ని అందరూ ఫ్రీగా చూడొచ్చని హాట్‌స్టార్‌+డిస్నీ ప్రకటించిన విషయం తెలిసిందే.

Follow Us
సమ్మర్‌లో దోసకాయను తినే ముందు.. ఈ విషయాలు తప్పక తెలుసుకోండి!
సమ్మర్‌లో దోసకాయను తినే ముందు.. ఈ విషయాలు తప్పక తెలుసుకోండి!
ఉత్కంఠ పోరులో ఓడిన ముంబై.. 3వ స్థానానికి చేరిన బెంగళూరు
ఉత్కంఠ పోరులో ఓడిన ముంబై.. 3వ స్థానానికి చేరిన బెంగళూరు
నగరంలో భారీ మోసం.. కస్టమర్ అకౌంట్ నుంచి రూ.6.5 కోట్లు మాయం
నగరంలో భారీ మోసం.. కస్టమర్ అకౌంట్ నుంచి రూ.6.5 కోట్లు మాయం
3 రాష్ట్రాల్లో మోస్ట్‌ వాంటేడ్.. ఇతని క్రిమినల్ రికార్డ్ తెలిస్తే
3 రాష్ట్రాల్లో మోస్ట్‌ వాంటేడ్.. ఇతని క్రిమినల్ రికార్డ్ తెలిస్తే
షాకింగ్ న్యూస్.. సడన్‌గా మైదానం వీడిన రోహిత్.. అసలేమైంది?
షాకింగ్ న్యూస్.. సడన్‌గా మైదానం వీడిన రోహిత్.. అసలేమైంది?
ఐపీఎల్ చరిత్రలో సరికొత్త రికార్డు సృష్టించిన రన్ మెషిన్!
ఐపీఎల్ చరిత్రలో సరికొత్త రికార్డు సృష్టించిన రన్ మెషిన్!
డీలిమిటేషన్‌తో దక్షిణాదికి అన్యాయం జరగబోతుందా..?
డీలిమిటేషన్‌తో దక్షిణాదికి అన్యాయం జరగబోతుందా..?
వాంఖడేలో ఆర్సీబీ బ్యాటర్ల ఊచకోత.. ముంబై ముందు భారీ టార్గెట్..
వాంఖడేలో ఆర్సీబీ బ్యాటర్ల ఊచకోత.. ముంబై ముందు భారీ టార్గెట్..
కాలేయం, ప్రేగులు ఆరోగ్యంగా ఉండాలంటే ఏం తినాలి..?
కాలేయం, ప్రేగులు ఆరోగ్యంగా ఉండాలంటే ఏం తినాలి..?
బిగ్‌ అలర్ట్.. ఆ జిల్లాల్లో రెండ్రోజుల పాటు తీవ్రవడగాలులు
బిగ్‌ అలర్ట్.. ఆ జిల్లాల్లో రెండ్రోజుల పాటు తీవ్రవడగాలులు