ఇకపై అలాంటి యాడ్స్ ఇస్తే కష్టమే.. తప్పుడు ప్రచార ప్రకటనలపై ప్రభుత్వం స్ట్రాంగ్ వార్నింగ్..!

ప్రకటనలలో ఇచ్చిన సమాచారం ఉత్పత్తిలో లేకుంటే, ఆ ప్రకటనలు తప్పుదారి పట్టించే ప్రకటనలుగా పరిగణిస్తారు. ఇది కాకుండా, ఒక సెలబ్రిటీ ఒక ప్రకటనలో చెప్పినవి నిజం కాకపోయినా.. ఆ ప్రకటనలను కూడా ఇదే కేటగిరీలోకి చేరుస్తారు.

ఇకపై అలాంటి యాడ్స్ ఇస్తే కష్టమే.. తప్పుడు ప్రచార ప్రకటనలపై ప్రభుత్వం స్ట్రాంగ్ వార్నింగ్..!
Surrogate And Misleading Advertisements
Follow us
Venkata Chari

|

Updated on: Jun 11, 2022 | 12:49 PM

సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ (CCPA) ప్రకటనల కోసం కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. మార్గదర్శకాల మేరకు, తప్పుదారి పట్టించే ప్రకటనలపై ఇక నుంచి చర్యలు తీసుకోనున్నారు. CCPA సరోగేట్ ప్రకటనలను కూడా నిషేధించింది. పారదర్శకత తీసుకురావడమే ఈ నిర్ణయం ఉద్దేశమని ప్రభుత్వం పేర్కొంది. వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ కొత్త మార్గదర్శకాలు తక్షణం అమల్లోకి వస్తాయని పేర్కొంది.

మోసపూరిత ప్రకటనలు అంటే?

ప్రకటనలలో ఇచ్చిన సమాచారం ఉత్పత్తిలో లేకుంటే, ఆ ప్రకటనలు తప్పుదారి పట్టించే ప్రకటనలుగా పరిగణిస్తారు. ఇది కాకుండా, ఒక సెలబ్రిటీ ఒక ప్రకటనలో చెప్పినవి నిజం కాకపోయినా.. ఆ ప్రకటనలను కూడా ఇదే కేటగిరీలోకి చేరుస్తారు. ఇప్పటి వరకు 117 మందికి CCPA నోటీసులు పంపింది. ఇందులో 57 మందిని తప్పుదారి పట్టించే ప్రకటనలు, 47 మంది తప్పుడు వ్యాపార విధానాలు, 9 మంది వినియోగదారుల హక్కులను అడ్డుకున్నందుకు నోటీసులు పంపారు.

ఇవి కూడా చదవండి

సర్రోగేట్ అడ్వర్టైజింగ్ అంటే ఏమిటి?

టీవీలో ఏదైనా ఆల్కహాల్, పొగాకు లేదా సారూప్య ఉత్పత్తికి సంబంధించిన ప్రకటనలను చూస్తూనే ఉంటాం. ఇందులో ఉత్పత్తిని నేరుగా వివరించకుండా, మరొక ఉత్పత్తి లేదా పూర్తిగా భిన్నమైన ఉత్పత్తిగా చూపిస్తుంటారు. ఉదాహరణకు, ఆల్కహాల్‌ను తరచుగా సోడాల రూపంలో చూపిస్తుంటారు. ఇలాంటివి కూడా ఇకపై చూపించొద్దు.

సర్రోగేట్ అడ్వర్టైజింగ్ ఎందుకు జరుగుతుంది?

కొన్ని ఉత్పత్తుల ప్రత్యక్ష ప్రకటనలు నిషేధంలో ఉన్నాయి. వీటిలో ఆల్కహాల్, సిగరెట్లు, పాన్ మసాలా వంటి ఉత్పత్తులు ఉంటాయి. ఇటువంటి పరిస్థితిలో ఈ ఉత్పత్తుల ప్రకటనల కోసం సర్రోగేట్ ప్రకటనలను ఉపయోగిస్తుంటారు.

రూ. 50 లక్షల జరిమానా..

ఏదైనా తప్పుదోవ పట్టించే ప్రకటనలు ప్రదర్శిస్తే.. తయారీదారులు, ప్రకటనదారులు, ఎండార్సర్‌లపై రూ. 10 లక్షల వరకు జరిమానా విధించవచ్చు. తదుపరి ఉల్లంఘనలకు కూడా రూ. 50 లక్షల వరకు జరిమానా విధించవచ్చు. తప్పుదారి పట్టించే ప్రకటనలను ఆమోదించేవారిపై ఒక సంవత్సరం నిషేధం విధించవచ్చు. తదుపరి ఉల్లంఘనల కోసం దీనిని 3 సంవత్సరాల వరకు పొడిగించవచ్చు. ఈ నియమాలు వినియోగదారులను తప్పుదారి పట్టించే ప్రకటనలపై ఫిర్యాదు చేయడానికి పూర్తి అధికారం కల్పిస్తాయి.