AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bombay High Court: చదువుకున్న మహిళలు కచ్చితంగా ఉద్యోగం చేయాలని లేదు.. బాంబే హైకోర్ట్‌ ఆసక్తికర తీర్పు..

Bombay High Court: మహిళ చదువుకుందన్న కారణంగా కచ్చితంగా ఉద్యోగం చేయాలన్న నిబంధన లేదని శుక్రవారం ముంబయి హైకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. కేవలం ఒక మహిళ ఉద్యోగానికి...

Bombay High Court: చదువుకున్న మహిళలు కచ్చితంగా ఉద్యోగం చేయాలని లేదు.. బాంబే హైకోర్ట్‌ ఆసక్తికర తీర్పు..
Bombay Highcourt
Narender Vaitla
|

Updated on: Jun 11, 2022 | 12:45 PM

Share

Bombay High Court: మహిళ చదువుకుందన్న కారణంగా కచ్చితంగా ఉద్యోగం చేయాలన్న నిబంధన లేదని శుక్రవారం ముంబయి హైకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. కేవలం ఒక మహిళ ఉద్యోగానికి కావాల్సిన విద్యార్హతలు కలిగి ఉందన్న కారణంగా ఆమె కచ్చితంగా ఉద్యోగం చేయాలని, ఇంట్లో ఉండకూడదని అర్థం కాదని జస్టిస్‌ భారతి డాంగ్రే అన్నారు. ఉద్యోగం చేయడం అనేది మహిళ ఎంపిక మాత్రమే. గ్రాడ్యుయేట్‌ అయినంత మాత్రాన ఆమె ఇంటి వద్ద కూర్చోవడానికి వీలులేదనే వాదన సరైంది కాదని ఆమె అన్నారు. స్థిరమైన ఆదాయాన్ని పొందుతోన్న ఓ భార్య తన భర్త నుంచి భరణం కోరిందన్న కేసు విచారణలో భాగంగా జస్టిస్‌ ఈ వ్యాఖ్యలు చేశారు.

వివరాల్లోకి వెళితే.. 2010లో ఓ జంట వివాహం చేసుకుంది. అయితే 2013 నుంచి వీరిద్దరూ విడివిడిగా జీవిస్తున్నారు. కూతురు తల్లితో ఉంటోంది. ఈ క్రమంలోనే తనకు భర్త నుంచి మెయింటెనెన్స్‌ కావాలని సదరు మహిళ కోర్టును ఆశ్రయించింది. కుటుంబ న్యాయస్థానంలో తనతో పాటు తన కూతురు జీవనానికి సరిపడ డబ్బు భర్త నుంచి అందించాలని దాఖలు పిటిషన్‌ దాఖలు చేసింది. దీంతో కోర్టు భార్యకు నెలకు రూ. 5000, చిన్నారి పోషణ కోసం రూ. 7,000 చెల్లించాని తీర్పునిచ్చింది. అయితే దీనిపై సదరు భర్త .. తన భార్య ఉద్యోగం చేస్తోందని, తనకు ఆదాయ మార్గం లేదని తప్పుడు సమాచారంతో పిటిషన్‌ దాఖలు చేసిందని సవాలుగా మరో పిటిషన్‌ దాఖలు చేశాడు.

ఈ నేపథ్యంలో శుక్రవారం విచారణకు వచ్చిన ఈ కేసు విషయంలో జస్టిస్‌ భారతి డాంగ్రే పైన పేర్కొ్న వ్యాఖ్యలు చేశారు. పని చేయాలా వద్దా అన్నది మహిళ హక్కని, ఆమె గ్రాడ్యుయేట్‌ అయినంత మాత్రన పనిచేయకూడదనే నిబంధన ఏముంది అంటూ ప్రశ్నించారు. ఇక తనను తాను ఉదాహరణగా ప్రస్తావిస్తూ.. ‘ఈరోజు నేను జడ్జిని, రేపు నేను ఇంట్లో కూర్చుంటాననుకోండి. ‘నీకు న్యాయమూర్తి అయ్యే అర్హత ఉంది, ఇంట్లో కూర్చోకూడదని చెబుతారా’ అని జస్టిస్‌ భారతి ప్రశ్నించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..