Congress: పోటీకి దూరం.. ఓటమి నుంచి తప్పించుకునేందుకు కాంగ్రెస్ నయా ఫార్ములా.. అయోమయంలో పార్టీ శ్రేణులు..

రాత్రికి రాత్రే ఏమీ మారదని, తాజా గాయాలు లాగా.. మరో గాయం కూడా మిగిలిపోతుందన్న విషయం పార్టీకి తెలుసు. ఆ విధంగా చూసుకుంటే.. కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయం తెలివైనదిగా చెప్పవచ్చు.- అజయ్ ఝా

Congress: పోటీకి దూరం.. ఓటమి నుంచి తప్పించుకునేందుకు కాంగ్రెస్ నయా ఫార్ములా.. అయోమయంలో పార్టీ శ్రేణులు..
Sonia, Rahul And Priyanka
Follow us

|

Updated on: Jun 11, 2022 | 12:26 PM

Congress formula: దశాబ్దాలపాటు దేశాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీ.. గత కొన్ని సంవత్సరాల నుంచి గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. ఓ వైపు వరుస ఓటములు, మరోవైపు అంతర్గత విబేధాలతో సతమవుతున్న అఖిల భారత కాంగ్రెస్.. తాజాగా తీసుకున్న ఓ నిర్ణయం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత కాంగ్రెస్ తీసుకున్న ఈ నిర్ణయం ఆ పార్టీ వర్గాలను అయోమయంలో పడేసింది. యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి గెలిచిన ఎస్పీ నేతలు అఖిలేష్ యాదవ్, అజం ఖాన్.. తమ లోక్‌సభ స్థానాలకు రాజీనామా చేశారు. దీంతో అజంగఢ్, రాంపూర్ పార్లమెంట్ స్థానాలకు ఉప ఎన్నికలు అనివార్యమయ్యాయి. ఈ రెండు లోక్‌సభ స్థానాలకు జూన్ 23న ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ ఉప ఎన్నికల్లో పోటీ చేయకూడదని పార్టీ అధిష్టానం నిర్ణయించింది. ఈ షాకింగ్ నిర్ణయంతో ఉత్తరప్రదేశ్‌లోని కాంగ్రెస్ పార్టీ గందరగోళ పరిస్థితిలో కూరుకుపోయినట్లు తెలుస్తోందని ప్రముఖ వ్యాసకర్త అజయ్ ఝా అభిప్రాయపడ్డారు. ఈ మేరకు ఆయన న్యూస్9కి ప్రత్యేక వ్యాసం రాశారు.

ఉత్తరప్రదేశ్ అసెంబ్లీలో గెలిచిన తమ స్థానాలను నిలుపుకోవాలని.. 2019 సార్వత్రిక ఎన్నికల్లో గెలిచిన స్థానాలకు రాజీనామా చేయాలని సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్, ఆ పార్టీ సీనియర్ నాయకుడు ఆజం ఖాన్ తీసుకున్న నిర్ణయాలతో రెండు స్థానాలు ఖాళీ అయ్యాయి. అయితే ఉప ఎన్నికల్లో తిరిగి తమ లోక్ సభ స్థానాలను నిలబెట్టుకోవాలని ఎస్పీ ఉవ్విళ్లూరుతోంది. అసెంబ్లీ ఎన్నికల విజయాన్ని పునరావృతం చేస్తూ ఉప ఎన్నికల్లో రెండు స్థానాలను తమ ఖాతాలో వేసుకోవాలని కమలనాథులు వ్యూహ రచన చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ ఎన్నికలకు దూరంగా ఉండాలని తీసుకున్న నిర్ణయం వెనుక కారణాలపై భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఉప ఎన్నికల్లో తమకు మద్దతు ఇవ్వాలని ఎస్పీ పెద్దలు బహిరంగంగా కోరివుంటే.. కాంగ్రెస్ అలాంటి నిర్ణయం తీసుకొని ఉంటే దాని వెనుక మరో లెక్క ఉందని అర్ధం చేసుకోవచ్చు. అయితే అలాంటిదేమీ లేకుండానే కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయం అందరినీ ఆలోచనలో పడేసింది. మరో పరాభవం ఎదురవుతుందన్న భయంతో కాంగ్రెస్‌ పార్టీ పోటీ నుంచి తప్పుకుందన్న ప్రచారం యూపీలోని ఆపార్టీ శ్రేణులకు ఇబ్బందికరంగా మారింది.

రెండు స్థానాల్లోనే విజయం.. 

ఇవి కూడా చదవండి

మూడు నెలల క్రితం జరిగిన జరిగిన యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాభవాన్ని ఎదుర్కొంది. 403 మంది సభ్యుల అసెంబ్లీలో కేవలం రెండు సీట్లు మాత్రమే గెలుచుకున్న కాంగ్రెస్ పార్టీ తీవ్ర అనిశ్చితిలో కూరుకుపోయిందని పేర్కొనడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు.

అయితే.. రాత్రికి రాత్రే ఏమీ మారదని, తాజా గాయాలు లాగా.. మరో గాయం కూడా మిగిలిపోతుందన్న విషయం పార్టీకి తెలుసు. ఆ విధంగా చూసుకుంటే.. కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయం తెలివైనదిగా చెప్పవచ్చు.- అజయ్ ఝా

అయితే అదే సమయంలో.. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఉత్తరప్రదేశ్‌లో లోక్‌సభ స్థానాలు (81) గరిష్ట సంఖ్యలో ఉన్నాయి. రాజకీయంగా అత్యంత కీలకమైన రాష్ట్రంలో పార్టీ ఎలా పునరుజ్జీవనం పొందుతుందనదే ప్రశ్నార్థకం. వచ్చే 2024 లోక్‌సభ ఎన్నికలకు.. ఇప్పుడు రెండేళ్ల కంటే తక్కువ సమయం ఉంది.

ఉత్తరప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ పతనానికి మూలకారణం గతంలో సమాజ్‌వాదీ పార్టీతో పొత్తు పెట్టుకోవడం. ప్రత్యర్థి భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావడాన్ని నిలువరించే ప్రయత్నంలో భాగంగా ఒకప్పుడు తీసుకున్న ఈ నిర్ణయమే కారణమని చెప్పవచ్చు. అయితే.. మళ్లీ యూటర్న్ తీసుకోవడం కూడా కలిసిరాలేదు..

ఈ విధానం తాత్కాలికంగా విజయవంతమై ఉండవచ్చు. కానీ ఫలితంగా ఈ ఏడాది మార్చిలో ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ వరుసగా రెండవసారి అధికారాన్ని చేజిక్కించుకుంది. అయితే.. మూడు దశాబ్దాల క్రితం పాలించిన రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధో స్థాయికి పతనమవ్వడం.. కోలుకోలేని విధంగా మారింది.

పోటీ నుంచి తప్పుకోవడం..

ఏది ఏమైనప్పటికీ.. కేవలం ఓటమిని తప్పించుకోవడం కోసం ఎన్నికల నుంచి తప్పుకోవడం ఆ పార్టీ ఇప్పుడు చేస్తున్న రెండవ తప్పు. సమాజ్‌వాదీ పార్టీకి ఫిడేలు వాయించాలనే దాని ప్రాథమిక నిర్ణయం తర్వాత.. స్థానికంగా బలాన్ని కోల్పోతూ వచ్చిందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. భవిష్యత్తులో పార్టీకి మరో సమస్య ఎదురుకావచ్చు. పార్టీ కార్యకర్తలు, సానుభూతిపరులు కూడా దూరమై.. ఇతర పార్టీలకు దగ్గర అవ్వొచ్చు.

రాంపూర్ ప్యాలెస్‌లో ఇప్పటికే.. రాజకీయాలు వేడెక్కాయి. ఈ క్రమంలో ఐదు పర్యాయాలపాటు కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలుపొందిన నవాబ్ కాజిమ్ అలీఖాన్.. తాను కాంగ్రెస్ అభ్యర్థిగా ఉపఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆసక్తిగా ఉన్నానని తెలిపారు. ఈ సమయంలో కాంగ్రెస్ పోటీ నుంచి తప్పుకోవడంతో.. బీజేపీ అభ్యర్థి ఘన్‌శ్యాం లోధికి మద్దతు ఇవ్వాల్సి వచ్చిందని బహిరంగంగానే చెప్పారు. రాంపూర్ , అజంగఢ్ కాంగ్రెస్ పార్టీకి అంతగా ప్రాబల్యం కూడా లేదు. ఇవి సమాజ్ వాదీ పార్టీకి కంచుకోటగా ఉన్నాయి. వీటిని ఇప్పుడు బీజేపీ బద్దలు కొట్టేందుకు ప్రయత్నిస్తోంది.

కొన్నేళ్లుగా కాంగ్రెస్ పార్టీ.. మళ్లీ పుంజుకునేందుకు ప్రయత్నిస్తోంది. ప్రస్తుతతం దాని మొత్తం దృష్టి కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం, రాహుల్ గాంధీని.. నెహ్రూ-గాంధీ కుటుంబం నుంచి నాల్గవ ప్రధానిగా చేసేందుకు దృష్టి పెట్టింది. ఫలితంగా రాష్ట్ర రాజకీయాలపై అంతగా దృష్టి సారించడం లేదు. దీంతో దాని పునాది మరింత బలహీనంగా మారింది. అంతేకాదు, గాంధీ కుటుంబానికి కంచుకోటగా ఉన్న ప్రాంతాల్లో కూడా పార్టీ పతనమవ్వడం.. ఉత్తరప్రదేశ్‌లో ప్రస్తుత పరిస్థితికి మరో కారణం.

ప్రియాంక గాంధీ రంగంలోకి దిగినా..

2019 సార్వత్రిక ఎన్నికలలో గాంధీ కుటుంబానికి కంచుకోట అయిన అమేథీ నుంచి ఆయన ఓడిపోయిన తర్వాత రాహుల్ గాంధీ ఉత్తరప్రదేశ్‌ను వాస్తవంగా విడిచిపెట్టారు. ఆయన తల్లి సోనియా గాంధీ ఉత్తరప్రదేశ్ నుంచి ఎన్నికైన ఏకైక కాంగ్రెస్ ఎంపీ గా ఉన్నారు. ఆమె కూడా తన నియోజకవర్గం రాయ్‌బరేలీని సందర్శించడంలేదు. రాహుల్ గాంధీ చెల్లెలు ప్రియాంక గాంధీకి ఉత్తరప్రదేశ్ బాధ్యతలు అప్పగించారు. అయితే.. ఉత్తరప్రదేశ్ ఓటర్లను ఆకట్టుకునే.. మ్యాజిక్ అని భావించిన వారందరినీ కూడా ఈ నిర్ణయం నిరాశపరిచింది.

ఈ ఏడాది మార్చిలో జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ఓటమి తర్వాత.. తన రాష్ట్ర శాఖ అధ్యక్షులను రాజీనామా చేయమని పార్టీ తీసుకున్న నిర్ణయం కూడా చాలా విచిత్రమైనది. గాంధీ కుటుంబాన్ని రక్షించే ప్రయత్నంలో.. భాగంగా ఓటమికి నైతిక బాధ్యతగా స్వీకరించి వైదొలగాలని దాని రాష్ట్ర యూనిట్ అధ్యక్షులకు సూచించింది. వారిలో ఒకరు కాంగ్రెస్ ఉత్తరప్రదేశ్ అధ్యక్షుడు అజయ్ కుమార్ లల్లూ. ఈ పదవి గత మూడు నెలలుగా ఖాళీగా ఉంది. ఇప్పటివరు ఆ పదవిని భర్తీ చేయలేదు.

మూడు దశాబ్దాలుగా కొనసాగుతున్న వైఫల్యాల పరంపర పార్టీలో మరింత నిరుత్సాహాన్ని కలిగిస్తుంది. కాంగ్రెస్ పార్టీ, గాంధీలు దీనికి మినహాయింపు కాదు. అయితే.. ఇలాంటి పరిస్థితుల్లో ఎన్నికల నుంచి దూరం కావడం వంటి నిర్ణయం కాంగ్రెస్ పార్టీని మరింత బలహీనపరుస్తుంది. ఇది 2024 సార్వత్రిక ఎన్నికల్లో కూడా ప్రభావం చూపించే అవకాశం ఉందని.. వ్యాసకర్త అజయ్ ఝా పేర్కొన్నారు.

Source Link

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..