US Capitol Violence: ఆ పాపం ట్రంప్‌దే.. క్యాపిటల్ హిల్స్ హింసపై విస్తుపోయే వాస్తవాలు..
క్యాపిటల్ హిల్‌పై దాడి మాజీ అధ్యక్షుడు ట్రంప్ పన్నాగమేనని చెబుతోంది కాంగ్రెస్ ప్రతినిధుల కమిటీ. అల్లర్లను ఆపడానికి ఆయన ఎలాంటి ప్రయత్నం చేయలేదని ఆరోపించింది..
US Capitol Violence: అమెరికాలో ఎన్నికల తర్వాత గతేడాది 2021 జనవరి 6న క్యాపిటల్ హిల్‌పైకి జరిగిన దాడుల్లో నాటి అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ (Donald Trump) ప్రమేయం ఉందని అమెరికా ప్రజాప్రతినిధుల ప్యానెల్ తన విచారణలో తెలిపింది. అధ్యక్ష ఎన్నికల ఫలితాల తర్వాత ఓటమిని అంగీకరించని డొనాల్డ్ ట్రంప్ స్వయంగా తన మద్దతుదారులను ప్రోత్సహించారని ఈ కమిటీ చూపించిన వీడియోలు చెబుతున్నాయి. అల్లర్లను ఆపేందుకు ట్రంప్ ఎలాంటి ప్రయత్నం చేయలేదని కమిటీ ముందు సాక్షులు ఇచ్చిన స్టేట్మెంట్లు చెబుతున్నాయి.
క్యాపిటల్ హిల్ దాడికి ఆజ్యం పోసింది ట్రంపే అని విచారణ కమిటీకి ఉపాధ్యక్షురాలిగా ఉన్న రిపబ్లికన్ పార్టీ నాయకురాలు లిజ్ చెనాయ్ అన్నారు. ట్రంప్ అమెరికా ప్రజాస్వామ్యాన్ని ప్రమాదంలోకి నెట్టారని ఆరోపించారు డెమొక్రటిక్ పార్టీ సభ్యుడు బెన్నీ థాంప్సన్.. ఆ రోజున క్యాపిటల్ హిల్ దగ్గర వేల సంఖ్యలో జనాన్ని సమీకరించింది ట్రంపే అన్న అభిప్రాయాన్ని ప్యానల్ తన విచారణలో వ్యక్తం చేసింది.
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో జోబైడెన్ ఎన్నికను ధ్రువీకరించేందుకు 2021 జనవరి 6న అమెరికా చట్ట సభ సభ్యులు క్యాపిటల్ హిల్ భవనంలో సమావేశం అయ్యారు. ఫలితాలను అంగీకరించని ట్రంప్ మద్దతు దారులు భవనంలోకి చొరబడి విధ్వంసానికి పాల్పడ్డారు. ఈ ఘటనపై ఏడాది పాటు దర్యాప్తు నిర్వహించింది కాంగ్రెస్ ప్రతినిధుల కమిటీ.
కాగా ఎన్నికల్లో కుట్ర జరిగిందని ట్రంప్ చేసిన ఆరోపణలను అమెరికా అటార్నీ జనరల్ బిల్ బ్రార్ తోసి పుచ్చారు. దీన్ని ట్రంప్ కుమార్తె ఇవాంక అంగీకరించాని నివేదికలో తెలిపారు. ట్రంప్ మాత్రం ఈ విచారణలు మొత్తం రాజకీయ ప్రేరితమని కొట్టిపారేశారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..