AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Himba Tribes: అక్కడ మహిళలు నీటిని ఉపయోగించడం నిషేధం.. జీవితంలో ఒకే ఒక్కసారి స్నానం..

Himba Tribe: ఈ తెగకు చెందిన స్త్రీలు తమ జీవితంలో ఒక్కసారే స్నానం చేస్తారు కనుక.. ఈ తెగ మహిళలు తమను తాము తాజాగా ఉంచుకోవడానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటారు. ప్రత్యేక మూలికలను నీటిలో వేసి మరిగిస్తారు. అప్పుడు వచ్చే నీటి ఆవిరితో శరీరాన్ని తాజాగా ఉంచుకుంటారు.

Himba Tribes: అక్కడ మహిళలు నీటిని ఉపయోగించడం నిషేధం.. జీవితంలో ఒకే ఒక్కసారి స్నానం..
Himba People
Surya Kala
|

Updated on: Jun 10, 2022 | 8:55 PM

Share

Himba Tribes: రోజూ స్నానం చేస్తాం.. ఒక వేసవి కాలం వచ్చిదంటే చాలు.. ఉక్కబోత చెమటతో రెండు మూడు సార్లు కూడా స్నానం చేయడం సర్వసాధారణం.. సనాతన ధర్మంలో కూడా స్నానం చేయడానికి కొన్ని విధివిధానాలను పేర్కొంది. అలాంటిది ప్రపంచంలో ఒక ప్రత్యేక తెగకు చెందిన మహిళలు జీవిత కాలంలో ఒకే ఒక్కసారి మాత్రమే స్నానం చేస్తారట.. అంతేకాదు ఈ తెగకు చెందిన పురుషులు తమకు పెళ్లి అయింది అని పదిమందికి తెలిసేలా వివాహ చిహ్నం ధరిస్తారట. మరి ఈ తెగ ఎక్కడ ఉంది.. వీరి నియమాలు, నిబంధనల గురించి తెలుసుకుందాం..

కొన్ని సంవత్సరాల క్రితం.. ఐక్యరాజ్యసమితి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న గిరిజనులకు చెందిన ఓ సంఖ్యను ప్రకటించింది.  దీని ప్రకారం ప్రపంచంలోని వివిధ ప్రాంతాలలో సుమారు 370 మిలియన్ల గిరిజనులు నివసిస్తున్నారు. మన భారతదేశంలో అయితే 700 కంటే ఎక్కువగా గిరిజన తెగలున్నాయి.  వీరి మొత్తం జనాభా 2011 సంవత్సరంలో 100 మిలియన్లుగా నమోదైంది. ఈ రోజు మనం అలాంటి ఒక తెగ గురించి ఆచార సంప్రదాయాల గురించి తెలుసుకుందాం.. వీరి గురించి తెలిస్తే.. వీరు ప్రపంచంలోనే అత్యంత ప్రత్యేకమైన తెగ అని పిలుస్తారు. ఎందుకంటే ఈ తెగ ప్రజల నియమాలు, నియమాలు మరియు నిబంధనలు చాలా విచిత్రంగా ఉంటాయి.

ఈ తెగను హింబా తెగ అంటారు. ఆఫ్రికాలోని ఈశాన్య నమీబియాలోని కునైన్ ప్రావిన్స్‌లో ఉంటారు. ఈ తెగ మహిళలు పెళ్లి చేసుకున్నప్పుడే స్నానం చేస్తారు. ఇలా పెళ్లి చేసుకునే సమయంలో స్నానం చేయడం తప్ప.. ఇతర సమయాల్లో మహిళలు నీటిని ఉపయోగించడం నిషేధించబడింది. ఇక్కడ బట్టలు ఉతకడం కూడా నిషేధించబడింది.

ఇవి కూడా చదవండి

ఈ తెగకు చెందిన స్త్రీలు తమ జీవితంలో ఒక్కసారే స్నానం చేస్తారు కనుక.. ఈ తెగ మహిళలు తమను తాము తాజాగా ఉంచుకోవడానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటారు.  ప్రత్యేక మూలికలను నీటిలో వేసి మరిగిస్తారు. అప్పుడు వచ్చే నీటి ఆవిరితో శరీరాన్ని తాజాగా ఉంచుకుంటారు. తద్వారా శరీరం నుంచి ఎలాంటి దుర్వాసన రాదని చెబుతారు.

మీడియా కథనాల ప్రకారం, ఈ తెగకు సంబంధించిన మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఇక్కడ స్త్రీలు కాకుండా పురుషులు వివాహ చిహ్నాన్ని ధరిస్తారు. భారతదేశంలో పెళ్లయిన స్త్రీలు నుదిటిపై కుంకుమ, నల్లపూసలు, మేడలో తాళి ,మెట్టెలు ధరించడం సంప్రదాయంగా అనాదిగా వస్తుంది. అయితే మనదేశంలో పెళ్లి అయిన పురుషులకు ఎటువంటి నియమాలు లేవు.. కానీ హింబా తెగలో పెళ్లైన పురుషులు తలపై తలపాగా ధరిస్తారు. ఆ తలపాగాను ఎప్పుడూ తలమీద నుంచి తీయరు.

హింబా తెగ గురించి మరొక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఇక్కడ పిల్లల కోసం ఒక ప్రత్యేక పాటను సిద్ధం చేస్తారు. ఇక్కడ మహిళ తన పిల్లలకు జన్మనివ్వడానికి ఆలోచించడంతో తల్లిగా మారడానికి అంగీకరిస్తున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు పుట్టబోయే పిల్లలను తల్చుకుంటూ.. స్త్రీలు చెట్టుకింద కూర్చుని బిడ్డకు జన్మనివ్వడానికి.. అందుకోసం ఒక  పాట గురించి ఆలోచిస్తారు. అంతేకాదు ఆ పాట తన మనసులోకి వచ్చిన వెంటనే.. ఆ పాట గురించి ఆ మహిళ తన భర్తకు  చెబుతుంది. అప్పుడు ఇద్దరూ శారీరక సంబంధాన్ని ఏర్పరచుకుంటారు. స్త్రీ గర్భవతి అయినప్పుడు, ఆ పాటను ఇతరులకు కూడా చెబుతారు. తద్వారా ప్రతి ఒక్కరూ ఈ పాటను గుర్తుంచుకుంటారు. ఆ తర్వాత బిడ్డ పుట్టిన తర్వాత ఆ పాటే అతడి గుర్తింపు అంటే.. ఒక రకంగా చెప్పాలంటే పేరుకు బదులు ఆ పాట ద్వారా ఆ బిడ్డను గుర్తిస్తారన్నమాట ఈ హీంబా తెగవారు..(Source)  

మరిన్ని హ్యుమన్‌ ఇంట్రెస్ట్‌ వార్తల  కోసం ఇక్కడ క్లిక్ చేయండి..