AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Fire Therapy: దీర్ఘకాలిక వ్యాధులకు సాంప్రదాయ చికిత్సావిధానం ఫైర్ థెరపీ.. ఆ దేశంలో శతాబ్ధి కాలానికి పైగా వాడుకలో..

Fire Therapy: శరీరానికి నిప్పు పెట్టడం వల్ల కూడా మనుషులు రోగాల నుంచి విముక్తులవుతారని.. వ్యాధుల నుంచి ఉపశమనం లభిస్తుందని మీరు ఎప్పుడైనా విన్నారా.. దీనిని ఫైర్ థెరపీ అంటారు.

Fire Therapy: దీర్ఘకాలిక వ్యాధులకు సాంప్రదాయ చికిత్సావిధానం ఫైర్ థెరపీ.. ఆ దేశంలో శతాబ్ధి కాలానికి పైగా వాడుకలో..
Traditional Chinese Fire Th
Surya Kala
|

Updated on: Jun 11, 2022 | 2:44 PM

Share

Fire Therapy: మన శరీరం వ్యాధుల బారిన పడడం సహజం.. దీంతో వ్యాధి నుంచి ఉపశమనం కోసం మందుల సహాయం తీసుకుంటాం.. అంతేకాదు.. చికిత్స విధానాల్లో అనేక రకాలు ఉన్నాయి. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువమంది  అల్లోపతి మందులతో చికిత్స తీసుకుంటున్నారు. కానీ ఇప్పటికీ చాలా మంది… హోమియోపతి, ఆయుర్వేద, నాడీ వైద్యం వంటి వైద్య పద్ధతులను ఉపయోగించేవారు కూడా చాలా మంది ఉన్నారు. అయితే శరీరానికి నిప్పు పెట్టడం వల్ల కూడా మనుషులు రోగాల నుంచి విముక్తులవుతారని.. వ్యాధుల నుంచి ఉపశమనం లభిస్తుందని మీరు  ఎప్పుడైనా విన్నారా.. దీనిని ఫైర్ థెరపీ అంటారు. ఈరోజు ఫైర్ థెరపీ అంటే ఏమిటి.. ఏ దేశంలో ఉపయోగిస్తారు..  ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందాం..

ఈ ఫైర్ థెరపీని చైనా లో ఎక్కువగా ఉపయోగించే వైద్యం. ఈ ప్రత్యేక ఫైర్ థెరపీ ద్వారా శరీరంలోని చిన్న, పెద్ద వ్యాధులన్నింటికీ చికిత్స లభిస్తుందని చైనా ప్రజలు నమ్ముతారు. నేటికీ అనేక వ్యాధుల చికిత్సకు ఫైర్ థెరపీని ఉపయోగిస్తారు. ఈ పద్ధతి చైనాలో 100 సంవత్సరాలకు పైగా ఉపయోగించబడుతున్న సంప్రదాయ వైద్య చికిత్స విధానం.

ఈ చికిత్స చైనాలో మాత్రమే ఉపయోగించబడుతుంది: ఈ చికిత్సలో తడి టవల్ మీద కొద్దిగా మద్యం పోస్తారు. రోగి శరీరంపై కొన్ని మూలికా పేస్ట్ లను అప్లై చేస్తారు. అనంతరం టవల్ ను రోగి చర్మంపై పెట్టి.. అప్పుడు నిప్పంటిస్తారు. ఈ ఫైర్ థెరపీ శరీరానికి ప్రత్యక్ష ఉపశమనాన్ని అందిస్తుందని నమ్ముతారు. అయితే.. ఈ చికిత్సకు సంబంధించి అనేక సందేహాలు కూడా తలెత్తుతున్నాయి. ముఖ్యంగా ఈ ఫైర్ థెరపీ చేస్తున్న వ్యక్తులకు ఎటువంటి ప్రొఫెషనల్ సర్టిఫికేట్ లేదు.

ఇవి కూడా చదవండి

ఇదే విషయంపై జాంగ్ ఫెంగావ్ అనే ఫైర్ థెరపిస్ట్ మాట్లాడుతూ.. తాను ఈ థెరపీ తీసుకుంటున్న సమయంలో ప్రజలు గాయపడ్డారని లేదా శరీరంలోని ఇతర భాగాలు కాలిపోయాయని చాలాసార్లు విన్నాను. అయితే ఈ థెరపీ ఇస్తున్న సమయంలో సరైన పద్ధతులు అనుసరించకపోవడం వల్ల ఇది జరిగిందని చెప్పారు. తాను ఇప్పటికే వేలాది మందికి ఫైర్ థెరపీ నేర్పించానని.. అంతేకాదు.. లక్షలాదిమందికి చికిత్సనందించానని.. కానీ ఇప్పటివరకు ఎక్కడ ఎవరికీ  ప్రమాదం జరిగినట్లు వినలేదని చెప్పారు.

అయితే ఈ థెరపీని నమ్ముతున్న ఏకైక దేశం చైనా. ఫైర్ థెరపీ ద్వారా ఒత్తిడి, డిప్రెషన్, అజీర్ణం, వంధ్యత్వం నుండి క్యాన్సర్ వరకు చికిత్స చేయడం సాధ్యమవుతుందని చైనాలోని కొందరు నమ్ముతారు. ఈ చికిత్సా పద్ధతి పురాతన చైనీస్ నమ్మకాలపై ఆధారపడింది. ఈ చికిత్సా విధానంలో శరీరంలోని వేడి , చల్లదనాన్ని సమతుల్యం చేయడంపై ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. (Source)

మరిన్ని హ్యుమన్‌ ఇంట్రెస్ట్‌  వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..