AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Monsoon-Malaria: సీజనల్ వ్యాధి మలేరియా.. లక్షణాలు.. వ్యాపించకుండా తీసుకోవాల్సిన నివారణ చర్యలు

Monsoon-Malaria: దేశంలో కొన్ని రాష్ట్రాల్లో డెంగ్యూ కేసులతో పాటు మలేరియా కేసులు కూడా నమోదవుతున్నాయి. అయితే డెంగ్యూ.. మలేరియా జ్వరాలు రెండూ ఒకేలా అనిపిస్తాయి.

Monsoon-Malaria: సీజనల్ వ్యాధి మలేరియా.. లక్షణాలు.. వ్యాపించకుండా తీసుకోవాల్సిన నివారణ చర్యలు
Malaria
Surya Kala
|

Updated on: Jun 11, 2022 | 3:13 PM

Share

Monsoon-Malaria: నైరుతి రుతుపవనాలు తొలకరి జల్లులతో వేసవి నుంచి ఉపశమనం లభించింది. అయితే వర్షాకాలంలో  సీజనల్ వ్యాధులు కూడా సర్వసాధారణం. ముఖ్యంగా ప్రతి ఏడాది జూలై నుంచి అక్టోబర్ మధ్యంలో ఎక్కువుగా డెంగ్యూ, మలేరియా వ్యాధుల బారిన పడే అవకాశం అధికంగా  ఉంటుంది. ఇప్పటికే దేశంలో కొన్ని రాష్ట్రాల్లో డెంగ్యూ కేసులతో పాటు మలేరియా కేసులు కూడా నమోదవుతున్నాయి. అయితే డెంగ్యూ.. మలేరియా జ్వరాలు రెండూ ఒకేలా అనిపిస్తాయి. కనుక జ్వరం మూడు రోజుల కంటే ఎక్కువగా ఉంటె.. వెంటనే వైద్యులను సంప్రదించడం తగిన చికిత్స తీసుకోవడంతో  ప్రమాదకరమైన ఈ సీజనల్ వ్యాధులను ఎదుర్కోవచ్చు.. ఈరోజు మలేరియా లక్షణాలు ఏమిటి చికిత్స నివారణ చర్యల గురించి తెలుసుకుందాం..

మలేరియా ఎలా సోకుతుందంటే..

ఆడ అనాఫిలిస్ దోమ ఆరోగ్యవంతమైన వ్యక్తిని కుట్టినప్పుడు మలేరియా వ్యాధిని బారిన పడతారు. ఈ దోమలు మురికి, స్వచ్ఛమైన నీటిలో సంతానోత్పత్తి చేస్తాయి. వ్యాధి సోకిన ఆడ దోమలు గుడ్లు పెడితే వాటి గుడ్లకు కూడా మలేరియా వ్యాధిని వ్యాపించే లక్షణాలు సోకుతాయి. ఈ దోమ కుట్టిన సంబంధిత వ్యక్తికి 14 నుండి 21 రోజులలోపు జ్వరం వస్తుంది.

ఇవి కూడా చదవండి

మలేరియా లక్షణాలు:

సర్వసాధారణంగా వర్షాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధుల్లో డెంగ్యూకి, మలేరియాకి ఒకే విధమైన లక్షణాలు కనిపిస్తాయి. అయితే చలి, తీవ్ర జ్వరం, విరామం లేకుండా వాంతులు , విపరీతమైన అలసట, కండరాల నొప్పి, బాడీ పెయిన్స్, వంటి లక్షణాలతో పాటు మలేరియా సోకినవారి గొంతు మంట, తలనొప్పి, అధిక చెమటలు అదనంగా కనిపించే లక్షణాలు.

మలేరియా దోమల నివారణకు తీసుకోవాల్సిన చర్యలు:

ఇంటి పరిశరాల్లో నీరు నిల్వ లేకుండా చర్యలు తీసుకోవాలి. నీరు నిల్వ ఉన్న ప్రాంతాల్లో దోమలు వృద్ధి చెందకుండా కిరోసిన్ చల్లడం ఇంటిలోపల వాటర్ ట్యాంక్, బకెట్‌ వంటి నీరు నిల్వ చేసే పాత్రలను కప్పి ఉంచండి. మూడు నాలుగు రోజులకు ఒకసారి కూలర్ ని శుభ్రం చేయడం.. నీటిని మార్చడం… కూలర్ ఆరిన తర్వాత మళ్లీ నీటిని నింపడం.. నీటిలో చిన్న కీటకాలు (లార్వా) కనిపిస్తే.. వెంటనే ఆ నీటిని శుభ్ర పరిచేలా తగిన చర్యలు తీసుకోవాలి.

మలేరియా లక్షణాలు కనిపించిన వెంటనే వైద్యుడిని సంప్రదించండి. మలేరియా ఉందో లేదో తెలుసుకోవడానికి రక్త పరీక్ష చేసి నిర్ధారిస్తారు. తగిన విధంగా చికిత్సనందిస్తారు.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..