Facebook: కనుమరుగు కానున్న ఫేస్‌బుక్.. FB టిక్కర్‌ని అన్‌ఫ్రెండ్ చేసిన Meta.. ఫుల్ డిటైల్స్..
ఇకపై ఫేస్‌బుక్ మనకు కనిపించదు.. దాని స్థానంలో మెటా అని కనిపించబోనుంది. నీలి రంగులో ఉండే ఫేస్‌బుక్ సింబల్ F స్థానంలో Meta అనే కనిపించనుంది..
Meta Unfriends FB Ticker: ప్రపంచ వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో ఉపయోగించే సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్ ఫేస్‌బుక్.. FBగా ఎంతో మంది జీవితంలో భాగమైపోయింది. మరి కొద్ది రోజుల్లో ఇంటర్నెట్‌లో ఇది కనిపించదు.. Facebook అని టైప్ చేసి సర్చ్ చేస్తే ఆ సైట్ దొరక్కపోవచ్చు.. దాని స్థానంలో మెటా (Meta) కనిపించబోతోంది. అంతే కాదు నీలిరంగులో ఉండే F అనే ఫేస్‌బుక్ టిక్కర్ కూడా మాయం కానుంది.. Meta టిక్కర్ మాత్రమే కనిపించనుంది. వాస్తవానికి ఫేస్‌బుక్ వ్యవస్థాపకుడు మార్క్ జూకర్‌బర్గ్ (Mark Elliot Zuckerberg) గత ఏడాది 2021లోనే కంపెనీ పేరును మెటాగా మార్చారు. అంతకు ముందే ఇన్‌స్టాగ్రామ్, వాట్సప్‌లను కొనుగోలు చేశారు జుకెన్‌బర్గ్. వీటన్నింటినీ మెటా టిక్కర్‌తో మనుగడలోకి తీసుకువస్తున్నట్లు అమెరికా స్టాక్‌మార్కెట్ నాస్‌డాక్‌కు మార్క్ జూకర్‌బర్గ్ తెలిపారు. కాగా ఈ ప్రకటన తర్వాత మెటా షేర్లలో 6 శాతం విలువ పడిపోయింది. ఫేస్‌బుక్ పేరుతో సెంటిమెంటల్‌గా కనెక్టయిన కోట్లాదిమంది యూజర్ల ఈ మార్పును ఇష్టపడటం లేదని తెలుస్తోంది.
మార్క్ జూకర్‌బర్గ్.. హార్వార్డ్ యూనివర్సిటీలో విద్యార్థిగా ఉన్నప్పుడు 2004లో ఫేస్‌బుక్‌ను ప్రారంభించాడు. ఆరంభంలో కంప్యూటర్ ద్వారా ఉపయోగించే ఇంటర్నెట్‌కే పరిమితమైన ఫేస్‌బుక్, స్మార్ట్ ఫోన్లలో కూడా అందుబాటులోకి రావడంతో కోట్లాది మంది ప్రజల జీవతంలో భాగమైపోయింది. 2012లో పబ్లిక్ ఇష్యూకి వెళ్లినప్పుడు ఫేస్‌బుక్ లోగో టిక్కర్‌ను జూకర్‌బర్గ్ డిజైన్ చేశారు. తాజాగా మెటావర్స్ పేరుతో సరికొత్త డిజిటల్ ప్రపంచాన్ని సృష్టించేందుకు సిద్ధమయ్యారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..