AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

WhatsApp: వాట్సాప్‌లో మిమ్మల్ని ఎవరైనా బ్లాక్‌ చేశారా..? సులభంగా తెలుసుకోండిలా..!

WhatsApp: ఈ రోజుల్లో ప్రతి స్మార్ట్‌ఫోన్‌లో వాట్సాప్‌ ఉండాల్సింది. ఈ యాప్‌ లేనిది ఏ స్మార్ట్‌ఫోన్‌ ఉండదు. నిత్యం వాట్సాప్‌ చాటింగ్‌లతో మునిగి తేలుతుంటారు. పిల్లల నుంచి..

WhatsApp: వాట్సాప్‌లో మిమ్మల్ని ఎవరైనా బ్లాక్‌ చేశారా..? సులభంగా తెలుసుకోండిలా..!
Subhash Goud
| Edited By: |

Updated on: Jun 11, 2022 | 6:52 AM

Share

WhatsApp: ఈ రోజుల్లో ప్రతి స్మార్ట్‌ఫోన్‌లో వాట్సాప్‌ ఉండాల్సింది. ఈ యాప్‌ లేనిది ఏ స్మార్ట్‌ఫోన్‌ ఉండదు. నిత్యం వాట్సాప్‌ చాటింగ్‌లతో మునిగి తేలుతుంటారు. పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరు వాట్సాప్‌ను ఉపయోగిస్తున్నారు. యూజర్ల కోసం కొత్త కొత్త ఫీచర్స్‌ కూడా అందుబాటులోకి వస్తున్నాయి. ఇప్పటికే ఎన్నో రకాల ఫీచర్స్‌ను తీసుకువచ్చింది. ఇక వాట్సాప్‌లో మిమ్మల్ని ఎవరు బ్లాక్‌ చేశారో తెలుసుకోవాలనుకుంటున్నారా..? అందుకు కొన్ని మార్గాలు ఉన్నాయి. ఎందుకంటే వాట్సాప్‌లో పలు ప్రైవసీ కారణాల వల్ల మిమ్మల్ని ఎవరు బ్లాక్ చేశారో నోటిఫికేషన్ రూపంలో తెలుసుకోలేరు. అయితే కొన్ని పద్ధతులను అనుసరిస్తే మిమ్మల్ని ఎవరు బ్లాక్ చేశారో చాలా సులభంగా తెలుసుకోవచ్చు.

ప్రొఫైల్ పిక్చర్ ఉందో లేదో చూడండి

ఎవరైనా మిమ్మల్ని బ్లాక్‌ చేస్తే ముందుగా ప్రొఫైల్ పిక్చర్ నుంచే తెలుసుకునే అవకాశం ఉంది. మీకు వారి ప్రొఫైల్ పిక్చర్ కనిపిస్తే.. అవతలి వాళ్లు మిమ్మల్ని బ్లాక్ చేయనట్లే. కనిపించకపోతే మాత్రం ఇందులో ఉన్న ఇతర పద్ధతులు కూడా ఫాలో అవ్వండి. ఎవరైతే మిమ్మల్ని బ్లాక్ చేశారని అనుకుంటున్నారో.. వారి లాస్ట్ సీన్, ఆన్‌లైన్ స్టేటస్ చెక్ చేయడానికి ప్రయత్నించండి. అయితే వాళ్లు లాస్ట్ సీన్ డిజేబుల్ చేస్తే బ్లాక్ చేయకపోయినా కనిపించదు. ఆన్‌లైన్‌లో ఉన్నా కనిపించకపోతే కచ్చితంగా బ్లాక్ చేసినట్లే.

ఇవి కూడా చదవండి

ఒకవేళ అవతలి వ్యక్తులు మిమ్మల్ని బ్లాక్ చేస్తే.. మీకు కేవలం ఒక్క టిక్ మాత్రమే వస్తుంది. రెండు టిక్ మార్కులు, బ్లూ టిక్స్ కనిపించవు. కాబట్టి మీరు మెసేజ్ పెట్టి ఎంత సేపయినా ఈ టిక్స్ రాకపోతే మిమ్మల్ని దాదాపు బ్లాక్ చేసినట్లేనని గుర్తించాలి. అంతేకాకుండా మిమ్మల్ని బ్లాక్ చేసినవారికి మీరు కాల్ చేస్తే ఆ కాల్ అవతలివారికి వెళ్లదు. అక్కడ మీకు రింగింగ్ బదులు కాలింగ్ అని మాత్రమే వస్తుంది. అయితే అవతలివాళ్లు ఇంటర్నెట్ ఆపినా కాలింగ్ అనే వస్తుంది. వాట్సాప్‌లో ఎవరైనా మిమ్మల్ని బ్లాక్ చేస్తే.. వారితో మీరు గ్రూప్ క్రియేట్ చేయడం కూడా కుదరదు. అందుకే ఎవరైతే బ్లాక్ చేశారని మీరు అనుకుంటున్నారో వారితో గ్రూప్ క్రియేట్ చేయడానికి ప్రయత్నించండి. అయితే అవతలివాళ్లు ప్రొఫైల్ పిక్చర్ డిలీట్ చేసి, లాస్ట్ సీన్ హైడ్ చేసి, నెట్ ఆఫ్ చేసినా పైవన్నీ జరుగుతాయి. అయితే నెట్ ఆఫ్ చేసిన వాళ్లు కాసేపటికి అయినా ఆన్ చేస్తారు కాబట్టి.. ఇవన్నీ జరిగితే దాదాపు మిమ్మల్ని బ్లాక్ చేసినట్లే అనుకోవచ్చు.

మరిన్ని సైన్స్ అండ్ టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
SRH vs RR Result: రాజస్థాన్‌ను చిత్తు చేసిన హైదరాబాద్..
SRH vs RR Result: రాజస్థాన్‌ను చిత్తు చేసిన హైదరాబాద్..
పెళ్లిపై షాకింగ్ కామెంట్స్ చేసిన హీరో రామ్ పోతినేని
పెళ్లిపై షాకింగ్ కామెంట్స్ చేసిన హీరో రామ్ పోతినేని
వీరింట లక్ష్మీదేవి ఉండదు.. గరుడ పురాణం చెబుతున్న పచ్చి నిజాలివే!
వీరింట లక్ష్మీదేవి ఉండదు.. గరుడ పురాణం చెబుతున్న పచ్చి నిజాలివే!
సీలింగ్ ఫ్యాన్ vs టేబుల్ ఫ్యాన్.. మీ ఇంటికి ఏ ఫ్యాన్ కరెక్ట్?
సీలింగ్ ఫ్యాన్ vs టేబుల్ ఫ్యాన్.. మీ ఇంటికి ఏ ఫ్యాన్ కరెక్ట్?
శుక్రుడి మార్పుతో ఈ రాశుల వారికి లక్ష్మీ కటాక్షం..
శుక్రుడి మార్పుతో ఈ రాశుల వారికి లక్ష్మీ కటాక్షం..
పుట్టినరోజు వేడుకల్లోనే అమెరికాలో యువ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ మృతి
పుట్టినరోజు వేడుకల్లోనే అమెరికాలో యువ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ మృతి
1,W,0,W,0,W.. రాజస్థాన్‌ను వణికించిన సన్‌రైజర్స్ నయా ‘స్పీడ్ గన్
1,W,0,W,0,W.. రాజస్థాన్‌ను వణికించిన సన్‌రైజర్స్ నయా ‘స్పీడ్ గన్
ఆరోగ్యానికి మంచిదని తీసుకునే ఈ ఆహారాల్లోనూ ఉప్పు ఎక్కువగా ఉంటుందట
ఆరోగ్యానికి మంచిదని తీసుకునే ఈ ఆహారాల్లోనూ ఉప్పు ఎక్కువగా ఉంటుందట
మూడింట ఒక వంతు సీట్లు చట్టసభల్లో మహిళలకు దక్కుతాయా?
మూడింట ఒక వంతు సీట్లు చట్టసభల్లో మహిళలకు దక్కుతాయా?
OTTలో ట్రెండ్ అవుతోన్నతెలుగు క్రైమ్ థ్రిల్లర్..IMDBలో 8.3 రేటింగ్
OTTలో ట్రెండ్ అవుతోన్నతెలుగు క్రైమ్ థ్రిల్లర్..IMDBలో 8.3 రేటింగ్