Accident: నీటిగుంతలో పడిపోయిన కారు.. ఎనిమిది మంది దుర్మరణం
బిహార్(Bihar) లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా దూసుకొచ్చిన ఓ స్కార్పియో వాహనం నీటి గుంతలో పడిపోయింది. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు. పూర్ణియాలో(Purnia) ఈ ఘటన చోటు చేసుకుంది....
బిహార్(Bihar) లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా దూసుకొచ్చిన ఓ స్కార్పియో వాహనం నీటి గుంతలో పడిపోయింది. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు. పూర్ణియాలో(Purnia) ఈ ఘటన చోటు చేసుకుంది. మరో ఇద్దరు గాయాలతో బయటపడ్డారు. వెంటనే అప్రమత్తమైన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వారు ఘటన స్థలానికి చేరుకుని ప్రమాద తీవ్రతను పరిశీలించారు. గాయపడిన వారిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. మృతులు కిశన్గంజ్లోని నునియా గ్రామానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. తారాబడి ప్రాంతంలో జరిగిన ఓ వేడుకకు వెళ్లి వస్తుండగా ఈ ఘటన జరిగింది. శనివారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. మృతుల బంధువులు సైతం ప్రమాదం జరిగిన ప్రదేశానికి చేరుకున్నారు. అతి వేగంగా వాహనం నడపడం, డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
మరిన్ని జాతీయం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి