లాభాలతో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్లు గురువారం లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్‌ 142 పాయింట్లు లాభపడి 35,898వద్ద, నిఫ్టీ 54 పాయింట్లు లాభపడి 10,789 వద్ద ముగిశాయి. నేడు నిఫ్టీ లోహరంగ షేర్ల సూచీ 1.13శాతం లాభాల్లో ముగిసింది. వెలస్పన్‌ కార్ప్‌ షేర్లు, అపోలో ట్యూబ్స్‌ షేర్లు భారీగా లాభపడ్డాయి. గురువారం అడాగ్‌ గ్రూప్‌ షేర్లు దాదాపు 16శాతం లాభపడ్డాయి. బుధవారం ట్రేడింగ్‌లో వచ్చిన నష్టాలను పూర్తిగా కవర్‌ చేసుకొన్నాయి. సుప్రీం కోర్టు పేర్కొన్న విధంగా సమయానికి నగదు […]

లాభాలతో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు
Follow us

| Edited By: Srinu

Updated on: Mar 07, 2019 | 6:04 PM

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్లు గురువారం లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్‌ 142 పాయింట్లు లాభపడి 35,898వద్ద, నిఫ్టీ 54 పాయింట్లు లాభపడి 10,789 వద్ద ముగిశాయి. నేడు నిఫ్టీ లోహరంగ షేర్ల సూచీ 1.13శాతం లాభాల్లో ముగిసింది. వెలస్పన్‌ కార్ప్‌ షేర్లు, అపోలో ట్యూబ్స్‌ షేర్లు భారీగా లాభపడ్డాయి. గురువారం అడాగ్‌ గ్రూప్‌ షేర్లు దాదాపు 16శాతం లాభపడ్డాయి. బుధవారం ట్రేడింగ్‌లో వచ్చిన నష్టాలను పూర్తిగా కవర్‌ చేసుకొన్నాయి.

సుప్రీం కోర్టు పేర్కొన్న విధంగా సమయానికి నగదు చెల్లిస్తామని ఆర్‌కామ్‌ విశ్వాసం వ్యక్తం చేయడంతో ఈ అడాగ్‌ కంపెనీ షేర్ల కౌంటర్లో జోష్‌ వచ్చింది. రిలయన్స్‌ నిప్పన్‌ లైఫ్‌ అసెట్‌ మేనేజ్‌మెంట్‌ షేర్లు దాదాపు 20శాతం పెరిగాయి. టెక్‌ మహీంద్రా షేర్లు 3.5శాతం లాభపడ్డాయి. ఈ కంపెనీ బైబ్యాక్‌ను గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడంతో మదుపరులు కొనుగోళ్లు చేశారు.