AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అటువంటి ఆలోచనలు రాకుండా ఉండాలంటే..!

ప్రేమ విఫలం, చదువు ఒత్తిడులు, ఆర్థిక ఇబ్బందులు, అప్పులు ఇలా మరెన్నో సమస్యల వల్ల ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఏటా 8 లక్షల మంది ఆత్మహత్యకు పాల్పడుతుంటే అందులో లక్ష 70 వేల మంది భారతీయులే కావడం గమనార్హం. అందులోనూ విద్యార్థులే ఎక్కువ సంఖ్యలో తనువు చాలిస్తున్నారు. దీని బట్టే తెలుస్తోంది మన ఎడ్యుకేషన్ వ్యవస్థ ఎంత దారుణంగా ఉందో అని. కొంతమంది సొసైటీలో ఉండలేక ఆత్మహత్యే మార్గం అనుకుని తనువు చాలిస్తుంటే.. ఏ కష్టం వచ్చినా.. ధైర్యం, […]

అటువంటి ఆలోచనలు రాకుండా ఉండాలంటే..!
Ravi Kiran
| Edited By: |

Updated on: Feb 14, 2020 | 1:25 PM

Share

ప్రేమ విఫలం, చదువు ఒత్తిడులు, ఆర్థిక ఇబ్బందులు, అప్పులు ఇలా మరెన్నో సమస్యల వల్ల ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఏటా 8 లక్షల మంది ఆత్మహత్యకు పాల్పడుతుంటే అందులో లక్ష 70 వేల మంది భారతీయులే కావడం గమనార్హం. అందులోనూ విద్యార్థులే ఎక్కువ సంఖ్యలో తనువు చాలిస్తున్నారు. దీని బట్టే తెలుస్తోంది మన ఎడ్యుకేషన్ వ్యవస్థ ఎంత దారుణంగా ఉందో అని. కొంతమంది సొసైటీలో ఉండలేక ఆత్మహత్యే మార్గం అనుకుని తనువు చాలిస్తుంటే.. ఏ కష్టం వచ్చినా.. ధైర్యం, దృక్పధంతో మనం జీవనం సాగించాలని నిపుణుల సూచన. ఆత్మహత్య అనే దుర్మార్గపు ఆలోచనను మనం కొన్ని మార్గాల ద్వారా రూపుమాపవచ్చు అని నిపుణులు అంటున్నారు. అవేంటో మనం కూడా ఒకసారి చూద్దాం.  

  • పాత జ్ఞాపకాలు

మన జీవితంలో ఎన్నో సంతోషాలు.. ఆపై కొన్ని మధుర క్షణాలు పొంది ఉంటాం. అలాంటి మధుర క్షణాలను కొన్ని ఫోటోల రూపంలో దాచి భద్రపరుస్తాం. ఇలా మన డిగ్రీలో వచ్చిన సర్టిఫికెట్స్, మనకు ఇష్టమైన వారు వాడిన వస్తువులు, చిన్నప్పటి ప్రేమ జ్ఞాపకాలు ఇంకా మరెన్నో ఉంటాయి. కొంతమందికి వీటినే డైరీ రూపంలో రాసుకుని భద్రపరుచుకోవడం అలవాటు. ఎప్పుడైనా మీరు మానసిక ఒత్తిడికిలోనై ఆత్మహత్య చేసుకుందాం అని అనుకుంటే ఒకసారి వీటిని తిరగేస్తే చాలు. మీకు బ్రతకాలి అనే చిన్న ఆశ కలుగుతుంది.   

  • కొత్త స్పర్శని స్మృశించడం

ఎవరూ నావాళ్లు కారు, ఎవరూ నన్ను పట్టించుకోవట్లేదు, ఏది నాది కాదన్నట్లు  కొంతమంది డిప్రెషన్ లోకి వెళ్ళిపోతారు. అలాంటి వాళ్ళు చావే శరణ్యం అని అనుకోవడం కూడా సహజమే. కానీ ఆ ఆలోచనను మీరు ప్రక్కన పెట్టి ఒక కొత్త స్పర్శను మీరు ఫీల్ అయితే.. డిప్రెషన్ దూరమై మాములు మనిషి అవుతారని నిపుణుల సలహా.   

  • ఒంటరితనానికి చెక్ పెట్టండి

కొంతమందికి తమ దగ్గరైన స్నేహితులు దూరం ఉంచితే చాలా బాధ కలుగుతుంది. అలాంటప్పుడు వారు ఒంటరితనం ఫీల్ అయి.. డిప్రెషన్ లోకి వెళ్లే ఛాన్స్ కూడా ఉంటుంది.  కానీ మీరు ఆ ఒంటరితనాన్ని వీడడం మంచిది. మిమ్మల్ని బాగా అర్ధం చేసుకునే స్నేహితులతో గానీ.. పెంచుకునే పెంపుడు జంతువులతో గానీ మీరు ఎక్కువ టైం స్పెండ్ చేస్తే ఒంటరితనం అనే ఆలోచన దూరమవుతుంది. అంతేకాదు మంచి సైకియార్టిస్ట్ తో కౌన్సిలింగ్ తీసుకోవడం కూడా మంచిదే.

  • అందరితోనూ కలవండి

ప్రాణంగా ప్రేమించిన అమ్మాయి మిమ్మల్ని కాదని వేరొకరిని పెళ్లి చేసుకున్నప్పుడు మనసుకు బాధ కలుగుతుంది. అలాంటి సమయంలో చనిపోదాం అని కొంతమంది  తీవ్ర నిర్ణయం తీసుకుంటారు. అలాంటప్పుడు మీరు ఒంటరిగా ఉండకుండా అందరిలోనూ ఉండేలా చూసుకోండి. ఎవ్వరూ లేకపోతే బయట ఏ గార్డెన్ లోకి గానీ, పార్కుకు గానీ వెళ్లి ఆ వాతావరణాన్ని ఆస్వాదించండి.   

  • పాజిటివ్ థింకింగ్

చనిపోదామన్న ఆలోచన పుట్టగానే.. మన మనసు సహజంగా ఆ వైపే లాగుతుంది. పాజిటివ్ థింకింగ్ అనేది చాలా ముఖ్యం. ప్రతీ అంశంలోనూ పాజిటివ్ ఫీలింగ్ తీసుకునేలా..  ఇది ప్రేరేపిస్తుంది. ఇలాంటి సమయంలో మనం సానుకూలంగా స్పందిస్తూ దృక్పధంతో ఉండాలి. మనం పాత డైరీలో రాసుకున్న విషయాలను, గత స్మృతులను ఒక్కసారి గుర్తు తెచ్చుకుంటే ఆత్మహత్య అనే పాడు ఆలోచన మనకు ఇంక రాదు.     

చూశారుగా ఇవే మనం తీసుకోవాల్సిన తగిన సూచనలు.. మీరు కూడా ఎప్పుడైనా డిప్రెషన్ లోకి వెళ్తే ఈ సూచనలు పాటించండి.