AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

శుభ గ్రహాల యుతితో ఆ రాశులకు అదృష్టం.. జీవితంలో ఓ మెట్టు పైకెక్కడం ఖాయం..!

Lucky Zodiac Signs: మిథున రాశిలో బుధుడు, గురుడు, శుక్రుడు అరుదైన యుతి చెందడంతో కొన్ని రాశుల వారికి అదృష్ట ద్వారాలు తెరుచుకోనున్నాయి. మే 29 నుంచి జూన్ 1 వరకు కొనసాగే ఈ శుభ గ్రహ కలయిక ప్రభావంతో తీసుకునే నిర్ణయాలు, ప్రారంభించే ప్రయత్నాలు భవిష్యత్తులో మంచి ఫలితాలను అందించనున్నాయి. ముఖ్యంగా వృషభం, మిథునం, సింహం, కన్య, తుల, కుంభ రాశుల వారికి పురోగతి, అవకాశాలు, కోరికల నెరవేర్పు సూచనలు కనిపిస్తున్నాయి.

శుభ గ్రహాల యుతితో ఆ రాశులకు అదృష్టం.. జీవితంలో ఓ మెట్టు పైకెక్కడం ఖాయం..!
Lucky Zodiac Signs
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jun 01, 2026 | 1:14 PM

Share

శుభ గ్రహాలైన బుధ, గురు, శుక్ర గ్రహాలు మేష 29, 30, 31, జూన్ 1 తేదీల్లో మిథున రాశిలో యుతి చెందడం జరుగుతోంది. ఈ మూడు శుభ గ్రహాలు ఒక రాశిలో యుతి చెందడం చాలా అరుదుగా జరుగుతుంది. ఈ శుభ గ్రహాలు కలిసేది నాలుగు రోజులే అయినప్పటికీ, జీవితంలో పురోగతి చెందడానికి ఇవి మార్గాలను చూపిస్తాయి. ఈ నాలుగు రోజుల్లో తీసుకునే నిర్ణయాలు, చేపట్టే ప్రయత్నాలు సమీప భవిష్యత్తులో తప్పకుండా సత్ఫలితాలనిస్తాయి. మనసులోని కోరికలు చాలా వరకు నెరవేరుతాయి. సరికొత్త జీవితాశయాలు, ఆకాంక్షలు ఏర్పడతాయి. వృషభం, మిథునం, సింహం, కన్య, తుల, కుంభ రాశులవారు ఈ కలయిక వల్ల అదృష్టవంతులు కాబోతున్నారు.

  1. వృషభం: ఈ రాశికి ధన స్థానంలో రాశ్యధిపతి శుక్రుడితో బుధ, గురువులు యుతి చెందడం వల్ల కుటుంబ జీవితంలోనూ, వ్యక్తిగత జీవితంలోనూ శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. శుభ వార్తలు ఎక్కువగా వింటారు. కుటుంబంలో సుఖ సంతోషాలు బాగా వృద్ధి చెందుతాయి. సంపన్నులు కావాలన్న కోరిక నెరవేరుతుంది. ఆదాయ వృద్ధికి సంబంధించిన కోరికలు, ఆకాంక్షలు నెరవేరుతాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల మీద శ్రద్ధ పెరుగుతుంది. సొంత ఇంటి కల నెరవేరుతుంది.
  2. మిథునం: ఈ రాశిలో రాశ్యధిపతి బుధుడితో గురు, శుక్రులు కలవడం వల్ల పట్టిందల్లా బంగారం అవుతుంది. షేర్లు, స్పెక్యులేషన్ల వంటివి బాగా లాభిస్తాయి. సంపదను పెంచుకోవడానికి అనేక మార్గాల్ని అనుసరించడం జరుగుతుంది. ఆదాయ వృద్ధికి ఎటువంటి ప్రయత్నం చేపట్టినా తప్పకుండా సక్సెస్ అవుతుంది. గృహ, వాహన ప్రయత్నాలు చేపట్టడం మంచిది. కుటుంబ జీవితం హ్యాపీగా, సాఫీగా సాగిపోతుంది. ఆస్తి వివాదాలు పరిఫ్కారమవుతాయి. ఆస్తిపాస్తుల విలువ బాగా పెరుగుతుంది.
  3. సింహం: ఈ రాశికి లాభ స్థానంలో మూడు శుభ గ్రహాల కలయిక వల్ల ఆదాయ వృద్ధికి మరిన్ని మార్గాలు కలిసి వస్తాయి. ఆర్థిక పరిస్థితి ఇదివరకటి కంటే బాగా మెరుగుపడుతుంది. షేర్లు, స్పెక్యులేషన్ల వంటివి అంచనాలకు మించి లాభిస్తాయి. రాజకీయ, ప్రభుత్వ ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. ఆదాయపరంగానే కాక, వృత్తి, ఉద్యోగాలపరంగా కూడా జీవితం కొత్త పుంతలు తొక్కుతుంది. ఆస్తి వివాదం అనుకూలంగా పరి‍ష్కారమవుతుంది. సంపన్న వ్యక్తితో పెళ్లి కుదురుతుంది.
  4. కన్య: ఈ రాశికి దశమ స్థానంలో రాశ్యధిపతి బుధుడు గురు, శుక్రులతో యుతి చెందడం వల్ల ఉద్యోగ జీవితంలో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. ఉద్యోగులకు డిమాండ్ పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో యాక్టివిటీ విస్తరిస్తుంది. ఆదాయ వృద్ధికి అనేక అవకాశాలు కలిసి వస్తాయి. వ్యక్తిగత, ఆర్థిక సమస్యలు పరిష్కారం అవుతాయి. కుటుంబంలో శుభ కార్యాలు జరగడానికి అవకాశముంది. మాటకు, చేతకు విలువ పెరుగుతుంది. నిరుద్యోగులు ఆశించిన శుభవార్తలు వింటారు.
  5. తుల: ఈ రాశికి భాగ్య స్థానంలో రాశ్యధిపతి శుక్రుడు గురు, బుధులతో యుతి చెందడం వల్ల అనేక రకాలుగా అదృష్టం తలుపు తడుతుంది. ఆదాయం ఇబ్బడిముబ్బడిగా పెరుగుతుంది. ఉద్యోగంలో జీతభత్యాలు, వృత్తి, వ్యాపారాల్లో రాబడి వృద్ధి చెందుతాయి. మంచి పరిచయాలు ఏర్పడతాయి. షేర్లు బాగా లాభిస్తాయి. రావలసిన సొమ్ము చేతికి అందుతుంది. ఆస్తిపాస్తుల విలువ బాగా పెరుగుతుంది. పిత్రార్జితం లభిస్తుంది. ఆర్థిక, వ్యక్తిగత, కుటుంబ సమస్యలు బాగా తగ్గుముఖం పడతాయి.
  6. కుంభం: ఈ రాశికి పంచమ స్థానంలో బుధ, గురు, శుక్రులు కలవడం వల్ల ఈ రాశివారికి రాజయోగాలు కలుగుతాయి. రాజపూజ్యాలు పెరుగుతాయి. మనసులోని ఆశలు, కోరికలు చాలావరకు నెరవేరుతాయి. ఉద్యోగంలో పదోన్నతులు లభిస్తాయి. ఒకటికి రెండుసార్లు ధన యోగాలు కలుగుతాయి. వృత్తి, వ్యాపారాలు బిజీ అయి, లాభాల బాటలో పడతాయి. నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు కూడా అందుతాయి. సంపన్న కుటుంబంతో పెళ్లి సంబంధం కుదురుతుంది. ఆర్థిక పురోగతి ఉంటుంది.

Follow Us
శుభ గ్రహాల యుతితో అదృష్టం.. ఇక వారు జీవితంలో ఓ మెట్టు పైకి..
శుభ గ్రహాల యుతితో అదృష్టం.. ఇక వారు జీవితంలో ఓ మెట్టు పైకి..
ఐటీ జాబ్ వదిలేసి ఆటో డ్రైవర్‌గా మారిన మహిళా టెకీ.. ఎందుకో తెలుసా?
ఐటీ జాబ్ వదిలేసి ఆటో డ్రైవర్‌గా మారిన మహిళా టెకీ.. ఎందుకో తెలుసా?
మీ మొబైల్‌లో ఈ 12 యాప్స్‌ ఉండాల్సిందే..
మీ మొబైల్‌లో ఈ 12 యాప్స్‌ ఉండాల్సిందే..
ఒక్కసారి ఇలా చేసి చూడండి.. గ్రేవీ టేస్ట్ అయితే వేరే లెవల్..
ఒక్కసారి ఇలా చేసి చూడండి.. గ్రేవీ టేస్ట్ అయితే వేరే లెవల్..
40+ వయసులోనూ గ్లోయింగ్ స్కిన్ కోసం బెస్ట్ కొల్లాజెన్ డ్రింక్స్..
40+ వయసులోనూ గ్లోయింగ్ స్కిన్ కోసం బెస్ట్ కొల్లాజెన్ డ్రింక్స్..
చేపలకంటే ఎక్కువ ఒమేగా-3 దీంట్లో ఉంటుంది..
చేపలకంటే ఎక్కువ ఒమేగా-3 దీంట్లో ఉంటుంది..
చికెన్‌తో పాటు చేపలు తింటే ఏమవుతుంది..? అసలు నిజాలు తెలిస్తే
చికెన్‌తో పాటు చేపలు తింటే ఏమవుతుంది..? అసలు నిజాలు తెలిస్తే
21 లక్షల కార్ గెలిచిన వైభవ్.. డ్రైవ్ చేయాలంటే 3 ఏళ్లు ఆగాల్సిందే
21 లక్షల కార్ గెలిచిన వైభవ్.. డ్రైవ్ చేయాలంటే 3 ఏళ్లు ఆగాల్సిందే
వేసవిలో చల్లగా తియ్యగా అస్సలు నూనె వాడకుండా చేసుకోగలిగే రెసిపీ
వేసవిలో చల్లగా తియ్యగా అస్సలు నూనె వాడకుండా చేసుకోగలిగే రెసిపీ
ఇంట్లోనే తయారుచేసుకునే అద్భుత సీరమ్.. ముడతలు మాయం, ముఖంలో మెరుపు
ఇంట్లోనే తయారుచేసుకునే అద్భుత సీరమ్.. ముడతలు మాయం, ముఖంలో మెరుపు