June 01, 2026
Subhash
ఈ ప్లాన్ ప్రతిరోజూ అధిక మొత్తంలో డేటా అవసరమయ్యే వినియోగదారుల కోసం బీఎస్‌ఎన్‌ఎల్ ప్రత్యేక ప్లాన్‌లను అందిస్తోంది.
బీఎస్‌ఎన్‌ఎల్ కొత్త రూ.599 రీఛార్జ్ ప్లాన్‌ను అందిస్తోంది. ఈ ప్లాన్‌లో ఏకంగా 70 రోజుల పాటు వ్యాలిడిటీని అందిస్తోంది. ఈ ప్లాన్‌లో ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి.
ఈ ప్లాన్‌లో వినియోగదారులకు రోజుకు 3GB డేటా లభిస్తుంది. అంటే ప్లాన్ మొత్తం వ్యాలిడిటీ వ్యవధిలో మీకు 210GB డేటా లభిస్తుంది. ఈ డేటా ఆన్‌లైన్ గేమింగ్ నుండి వీడియో స్ట్రీమింగ్ వరకు సరిపోతుంది.
ఈ ప్లాన్‌లో దేశవ్యాప్తంగా ఏ నంబర్‌కైనా అపరిమిత వాయిస్ కాలింగ్, రోజుకు 100 SMSలు, అలాగే ఉచిత రోమింగ్ సేవలు వంటి ప్రయోజనాలు ఉన్నాయి.
ఈ ప్లాన్ కొత్త వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉంది. ఇప్పటికే ఉన్న వినియోగదారులు దీని ప్రయోజనాలను పొందలేరు. దీనిలో BSNL సిమ్ కార్డును పూర్తిగా ఉచితంగా అందిస్తోంది.
రోజుకు 3GB డేటాను అందించే ఈ ప్లాన్‌ను, ఎయిర్‌టెల్ 3GB ప్లాన్‌తో పోల్చి చూస్తే, BSNL ప్లాన్ బెస్ట్ అనే చెప్పాలి. ఎయిర్‌టెల్ ఇదే ప్లాన్ ధర రూ.838తో 56 రోజులు మాత్రమే.
అయితే ఎయిర్‌టెల్ ప్లాన్ ఎక్కువ ప్రయోజనాలను అందిస్తున్నప్పటికీ, దీని ధర BSNL ప్లాన్ కంటే గణనీయంగా ఎక్కువగా ఉంది. దీని వ్యాలిడిటీ వ్యవధి కూడా తక్కువగా ఉంది.
కొన్ని రోజుల క్రితం BSNL మరో ప్లాన్‌ను కూడా ప్రకటించింది. కేవలం రూ.51 ధరకే లభించే ఈ ప్లాన్, 28 రోజుల కాలానికి రోజుకు 2GB డేటా, అపరిమిత కాలింగ్, ఉచిత SMSలను అందిస్తుంది.