AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇంట్లోనే తయారుచేసుకునే.. నేచురల్ యాంటీ-ఏజింగ్ సెరమ్.. ముడతలు మాయమై ముఖం మెరిసిపోవడం ఖాయం!

వయసు పెరిగేకొద్దీ ముఖంపై ముడతలు, మచ్చలు రావడం సహజం. వీటిని తగ్గించి చర్మాన్ని యవ్వనంగా మార్చడానికి ఇంట్లోనే సులభంగా యాంటీ ఏజింగ్ సెరమ్ తయారు చేసుకోవచ్చు. రాత్రి పడుకునే ముందు ముఖాన్ని శుభ్రం చేసుకుని, ఈ సెరమ్‌తో మసాజ్ చేయడం వల్ల ముఖంపై ముడతలు తగ్గి చర్మం గ్లోయింగ్‌గా మారుతుంది. ఇది అన్ని రకాల చర్మ తత్వాల వారికి సురక్షితమైనది. తక్కువ ఖర్చుతో కూడుకున్నది. దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఏంటో ఇప్పుడు చూద్దాం..

ఇంట్లోనే తయారుచేసుకునే.. నేచురల్ యాంటీ-ఏజింగ్ సెరమ్.. ముడతలు మాయమై ముఖం మెరిసిపోవడం ఖాయం!
Natural Face Serum RecipeImage Credit source: Tv9 bangla
Jyothi Gadda
|

Updated on: Jun 01, 2026 | 12:28 PM

Share

ప్రస్తుత కాలంలో కాలుష్యం, ఒత్తిడి, తప్పుడు జీవనశైలి కారణంగా చాలా మందిలో వయసు పెరగకముందే చర్మంపై ముడతలు (Wrinkles), ఫైన్ లైన్స్, నల్లటి మచ్చలు వంటి వృద్ధాప్య ఛాయలు కనిపిస్తున్నాయి. చర్మాన్ని యవ్వనంగా, కాంతివంతంగా ఉంచుకోవడానికి మార్కెట్లో దొరికే రకరకాల యాంటీ-ఏజింగ్ క్రీములు, సీరమ్‌లను వాడుతుంటారు. అయితే ఇవి ఖరీదైనవి మాత్రమే కాకుండా, వీటిలో ఉండే కెమికల్స్ వల్ల కొన్నిసార్లు సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ప్రమాదం కూడా ఉంది. కానీ, మన ఇంట్లో దొరికే సహజమైన పదార్థాలతోనే రూపాయి ఖర్చు లేకుండా అద్భుతమైన ఫేస్ సెరమ్‌ను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.

సెరమ్ తయారీకి కావలసిన పదార్థాలు:

కలబంద గుజ్జు (Aloe Vera Gel): 2 చెంచాలు

రోజ్ వాటర్ (Rose Water): 2 చెంచాలు

ఇవి కూడా చదవండి

విటమిన్-ఇ క్యాప్సూల్స్ (Vitamin E Capsules): 2

గ్లిజరిన్ (Glycerin): అర చెంచా

తయారుచేసే విధానం: ఒక చిన్న శుభ్రమైన గిన్నెలో రెండు చెంచాల కలబంద గుజ్జును తీసుకోండి. అందులో రెండు చెంచాల రోజ్ వాటర్, అర చెంచా గ్లిజరిన్ వేసి బాగా కలపాలి. ఆ తర్వాత రెండు విటమిన్-ఇ క్యాప్సూల్స్‌ను కట్ చేసి, అందులోని ఆయిల్‌ను ఈ మిశ్రమంలో వేయాలి. ఈ నాలుగు పదార్థాలు బాగా కలిసి, ఒక జెల్ లాంటి సెరమ్ రూపంలోకి వచ్చేంత వరకు బాగా మిక్స్ చేయాలి. ఈ విధంగా తయారైన సెరమ్‌ను ఒక చిన్న గాజు సీసాలో భద్రపరుచుకోవాలి. దీనిని రూమ్ టెంపరేచర్‌లోనే సుమారు రెండు వారాల పాటు ఉపయోగించవచ్చు.

ఎలా ఉపయోగించాలి?: ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు ముఖాన్ని మైల్డ్ ఫేస్‌వాష్‌తో శుభ్రంగా కడుక్కోవాలి. ఆ తర్వాత తయారుచేసుకున్న సెరమ్‌ను కొన్ని చుక్కలు ముఖంపై వేసుకుని, చేతి వేళ్లతో వృత్తాకారంలో (Circular motion) మృదువుగా మసాజ్ చేయాలి. చర్మం ఈ సెరమ్‌ను పూర్తిగా పీల్చుకునే వరకు మసాజ్ చేసి, రాత్రంతా అలాగే వదిలేయాలి. ఉదయాన్నే చల్లటి నీటితో ముఖం కడుక్కోవాలి.

ఈ సెరమ్ వల్ల కలిగే ప్రయోజనాలు: కలబంద చర్మానికి సహజమైన తేమను అందించి డ్రై స్కిన్ సమస్యను తగ్గిస్తుంది. విటమిన్-ఇ లోని యాంటీఆక్సిడెంట్లు దెబ్బతిన్న చర్మ కణాలను రిపేర్ చేసి ముడతలను నివారిస్తాయి. గ్లిజరిన్, రోజ్ వాటర్ ముఖానికి ఇన్స్టెంట్ గ్లోను ఇస్తాయి. రసాయనాలు లేని ఈ హోమ్‌మేడ్ సెరమ్‌ను క్రమం తప్పకుండా వాడటం వల్ల చర్మం బిగుతుగా మారి, ముఖం ఎల్లప్పుడూ యవ్వనంగా కనిపిస్తుంది.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us