జె.ఎన్.యు విద్యార్థుల ‘ఛలో పార్లమెంట్’.. బ్యారికేడ్లు ఆపుతాయా ?

పెంచిన ఫీజులను తగ్గించాలని, తమ ఇతర డిమాండ్ల సాధనకు ఢిల్లీలో జె ఎన్ యు విద్యార్థులు సోమవారం ‘ ఛలో పార్లమెంట్ ‘ ముట్టడికి పిలుపునిచ్చిన నేపథ్యంలో.. భారీ ఎత్తున పోలీసు, సి ఆర్ పీ ఎఫ్ బలగాలను మోహరించారు. 144 వ సెక్షన్ విధించారు. విద్యార్థులను అడ్డుకునేందుకు బ్యారికేడ్లను ఏర్పాటు చేయగా.. వాటిని ఛేదించుకుని ముందుకు దూసుకు రావడానికి వారు యత్నించడంతో ఉద్రిక్తత నెలకొంది. అంతకు ముందే విద్యార్ధి సంఘం అధ్యక్షుడు ఐషే ఘోష్, మరికొంతమందిని […]

జె.ఎన్.యు విద్యార్థుల 'ఛలో పార్లమెంట్'.. బ్యారికేడ్లు ఆపుతాయా ?
Follow us
Anil kumar poka

| Edited By:

Updated on: Nov 18, 2019 | 6:07 PM

పెంచిన ఫీజులను తగ్గించాలని, తమ ఇతర డిమాండ్ల సాధనకు ఢిల్లీలో జె ఎన్ యు విద్యార్థులు సోమవారం ‘ ఛలో పార్లమెంట్ ‘ ముట్టడికి పిలుపునిచ్చిన నేపథ్యంలో.. భారీ ఎత్తున పోలీసు, సి ఆర్ పీ ఎఫ్ బలగాలను మోహరించారు. 144 వ సెక్షన్ విధించారు. విద్యార్థులను అడ్డుకునేందుకు బ్యారికేడ్లను ఏర్పాటు చేయగా.. వాటిని ఛేదించుకుని ముందుకు దూసుకు రావడానికి వారు యత్నించడంతో ఉద్రిక్తత నెలకొంది. అంతకు ముందే విద్యార్ధి సంఘం అధ్యక్షుడు ఐషే ఘోష్, మరికొంతమందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇటీవల తమ హాస్టల్ ఫీజును భారీగా పెంచుతూ.. యూనివర్సిటీ యాజమాన్యం ఓ ముసాయిదాలో మార్పులు చేయడాన్ని విద్యార్థులు తీవ్రంగా నిరసిస్తున్నారు. తమ సమస్యలను పార్లమెంటులో ఎంపీలు ప్రభుత్వ దృష్టికి తేవాలని వీరు కోరుతున్నారు. ‘ మా తరఫున ప్రభుత్వంతో పోరాడవలసిందిగా కోరుతున్నామని ‘ ఓ విద్యార్ధి నాయకుడు పేర్కొన్నాడు. మరోవైపు.. వర్సిటీ ఆవరణలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడడానికి కారణం వైస్ ఛాన్సలర్, యాజమాన్యమే కారణమని టీచర్స్ అసోసియేషన్ ఆరోపిస్తోంది. విద్యార్థుల తలిదండ్రులు కూడా ఇదే ఆరోపణ చేయడం విశేషం. హాస్టల్ లో గదుల అద్దెలను యాజమాన్యం విపరీతంగా పెంచడాన్ని విద్యార్థులు తప్పు పడుతున్నారు.