కోవిడ్ డ్యూటీలో 4 నెలల గర్భంతో నర్సు , ఉపవాస దీక్ష పాటిస్తూనే రోగులకు సేవలు
గుజరాత్ లోని సూరత్ లో నాలుగు నెలల గర్భిణీ ఒకరు ఈసెకండ్ వేవ్ కోవిడ్ సమయంలో రోగుల సేవకు అంకితమై ఆదర్శంగా నిలుస్తోంది. నాన్సీ ఆయేషా మిస్త్రీ అనే ఈ నర్సు..
గుజరాత్ లోని సూరత్ లో నాలుగు నెలల గర్భిణీ ఒకరు ఈసెకండ్ వేవ్ కోవిడ్ సమయంలో రోగుల సేవకు అంకితమై ఆదర్శంగా నిలుస్తోంది. నాన్సీ ఆయేషా మిస్త్రీ అనే ఈ నర్సు.. తనకు వైరస్ నుంచి ముప్పు ఉన్నప్పటికీ లెక్క చేయకుండా పూర్తిగా విధి నిర్వాణలో నిమగ్నమైంది. రోజూ 8 నుంచి 10 గంటలు పని చేస్తోంది. తన సేవలకు గుర్తింపుగా పేషంట్ల నుంచి ఆశీస్సులు అందుకుంటోంది. తన కడుపులో బిడ్డ పెరుగుతున్నాడని, కానీ తన డ్యూటీ తనకు ముఖ్యమని ఆమె అంటోంది. పవిత్ర రంజాన్ మాసంలో రోగులకు సేవలు చేయడం తనకు దక్కిన మంచి అదృష్టమని ఆమె చెప్పింది. సూరత్ లోని అటల్ కోవిడ్ హాస్పిటల్ లో పని చేస్తున్న నాన్సీ ని అభినందించనివాళ్ళు లేరు. గత ఏడాది కూడా కరోనా వైరస్ కాలంలో ఈమె ఇదే ఆసుపత్రిలో పని చేసిందట.
నాలుగు నెలల గర్భంతో ఈ నర్సు చేస్తున్న సేవలను అధికారులు కూడా ప్రశంసిస్తున్నారు. ఈమెను ఈమె కుటుంబ సభ్యులు కూడా ప్రోత్సహించడం విశేషం. ఇక ఆగ్రాలో భగత్ హల్వాయ్ అనే రెస్టారెంట్ యజమాని అయిన శివమ్ భగత్ అనే ఆయన కూడా తన మానవతా దృక్పథాన్ని చాటుకుంటున్నాడు. ఆగ్రాలో తన రెస్టారెంట్ దరిదాపుల్లో ఉన్న ప్రాంతాల్లోని కోవిడ్ రోగులకు, ఐసోలేషన్ లో ఉన్న వారి కుటుంబ సభ్యులకు ఈయన రోజూ రెండు పూటలా ఆరోగ్యకరమైన భోజనాన్ని అందిస్తున్నాడు. అది కూడా పూర్తిగా ఉచితంగా… ఈ సెకండ్ వేవ్ కరోనా సమయంలో మనుషులు ఒకరికొకరు సాయం చేసుకోవాల్సిందే అంటున్నాడీయన. తాము ప్రతి రోజూ 120 మందికి మీల్స్ పంపుతున్నామని, తమ వాలంటీర్లు హోమ్ డెలివరీ చేస్తున్నారని ఆయన చెప్పాడు.
మరిన్ని ఇక్కడ చూడండి: Post Office Monthly Scheme: పోస్టాఫీసులో అదిరిపోయే స్కీమ్.. ఇందులో చేరితే నెలకు రూ.5 వేల రాబడి పొందవచ్చు