Post Office Monthly Scheme: పోస్టాఫీసులో అదిరిపోయే స్కీమ్‌.. ఇందులో చేరితే నెలకు రూ.5 వేల రాబడి పొందవచ్చు

Post Office Monthly Scheme: పోస్టాఫీసు ద్వారా ఆదారం పెంచుకునేందుకు చాలా పథకాలు అందుబాటులో ఉన్నాయి. ప్రజలు మరింతగా ఆదాయం పెంచుకునే విధంగా కేంద్ర ప్రభుత్వం..

Post Office Monthly Scheme: పోస్టాఫీసులో అదిరిపోయే స్కీమ్‌.. ఇందులో చేరితే నెలకు రూ.5 వేల రాబడి పొందవచ్చు
India Post
Follow us
Subhash Goud

|

Updated on: Apr 24, 2021 | 4:29 PM

Post Office Monthly Scheme: పోస్టాఫీసు ద్వారా ఆదారం పెంచుకునేందుకు చాలా పథకాలు అందుబాటులో ఉన్నాయి. ప్రజలు మరింతగా ఆదాయం పెంచుకునే విధంగా కేంద్ర ప్రభుత్వం పోస్టాఫీసుల్లో ఎన్నో స్కీమ్‌లను అందుబాటులోకి తీసుకువస్తోంది. అయితే చేతిలో డబ్బులు ఉండి, వీటిని ఎక్కడైన ఇన్వెస్ట్‌ చేయాలని అనుకునే వారికి మంచి అవకాశం. ఇందుకు వారి కోసం పోస్టల్‌ శాఖలో ఒక ఆప్షన్‌ అందుబాటులో ఉంది. ఇందులో డబ్బులు పెట్టడం వల్ల ఎలాంటి ఇబ్బందులు లేకుండా రాబడి పొందవచ్చు.

పోస్టల్‌ శాఖ అందిస్తున్న పలు పథకాల్లో ఒకటైన మంత్రీ ఇన్‌కమ్‌ స్కీమ్‌. ఈ స్కీమ్‌లో చేరితే ప్రతినెల డబ్బులు వస్తాయి. సింగిల్‌ లేదా జాయింట్‌ అకౌంట్‌ కూడా తెరవచ్చు. మీరు కనీసం రూ.1000 నుంచి ఇన్వెస్ట్‌ చేసుకునే అవకాశం ఉంది. అయితే వెయ్యి రూపాయలు పెడితే మీకు వచ్చే లాభం ఏమి ఉండదు. పోస్టాఫీసు నుంచి నెల ఆదాయం స్కీమ్‌లో మీరు గరిష్ఠంగా రూ.4.5 లక్షల వరకు ఇన్వెస్ట్‌ చేయవచ్చు. జాయింట్‌ అకౌంట్‌ అయితే రూ.9 లక్షలు కూడా డిపాజిట్‌ చేసే అవకాశం ఉంటుంది. ఒకేసారి డబ్బులు పెట్టాలి. తర్వాత ప్రతి నెల రాబడి పొందే అవకాశం ఉంటుంది. రిటైర్డ్‌ అయిన ఉద్యోగులకు, సీనియర్‌ సిటిజన్స్‌కు ఈ స్కీమ్‌ అనుగుణంగా ఉంటుంది.

ఈ స్కీమ్‌లో చేరాలంటే..

మీరు రాబడి పెంచుకునేందుకు ఈ స్కీమ్‌లో చేరవచ్చు. మీ దగ్గరలోని పోస్టాఫీసుకు వెళ్లి మంత్లి ఇన్‌కమ్‌ స్కీమ్‌లో చేరవచ్చు. ఐడీ ఫ్రూప్‌, అడ్రస్‌ ఫ్రూప్‌, రెండు పాస్‌ పోర్ట్‌ సైజు ఫోటోలు వంటికి అందజేయాల్సి ఉంటుంది. పోస్టాఫీసులో ఫారం నింపి మంత్లీ ఇన్‌కమ్ ఖాతాను తెరుచుకోవచ్చు. మీరు పెట్టిన ఇన్వెస్ట్‌ మెంట్‌ డబ్బులను ఐదేళ్ల తర్వాత వెనక్కి తీసుకోవచ్చు. అంత వరకు ప్రతినెలా వడ్డీ డబ్బులు వస్తుంటాయి.

ఉదాహరణకు.. మీరు పోస్టాఫీసులో జాయింట్‌ మంత్లీ ఇన్‌కమ్‌ స్కీమ్‌ ఖాతాను తెరిచి అకౌంట్‌లో రూ. 9 లక్షల డిపాజిట్‌ చేశారని అనుకుంటే.. మీకు ఏడాదికి రూ.59,400 వేల వడ్డీ వస్తుంది. అంటే నెలకు రూ.5 వేల చొప్పున అందుకోవచ్చు. ప్రస్తుతం ఈ స్కీమ్‌ రూ.6.6 వడ్డీ లభిస్తోంది. దీనిపై పూర్తి వివరాలు మీ దగ్గరలోని పోస్టాఫీసుకు వెళ్లి తెలుసుకోవచ్చు. అదే మీరు రూ.4.5 లక్షలు పెడితే నెలకు రూ.2,500 వరకు వస్తుంది. ఇలా మీరు డిపాజిట్ చేసే మొత్తం ప్రాతిపదికన మీకు వచ్చే డబ్బులు కూడా మారుతుంటుంది.

ఇవీ కూడా చదవండి:

SBI Account: ఎస్‌బీఐ అకౌంట్‌ తీసుకోవడం మరింత సులభం.. ఇంట్లో ఉండే ఖాతా తెరవవచ్చు.. ఎలాగంటే..!

Gas Cylinder: మీరు గ్యాస్‌ సిలిండర్‌ బుక్‌ చేస్తున్నారా..? మీకో బంపర్‌ ఆఫర్‌.. రూ.800 వరకు క్యాష్‌బ్యాక్‌

Online Shopping: మీరు ఆన్‌లైన్‌లో షాపింగ్‌ చేస్తున్నారా..? ఈ జాగ్రత్తలు పాటించడం తప్పనిసరి

Public Provident Fund Scheme: పీపీఎఫ్‌ స్కీమ్‌లో చేరితే రూ.10 లక్షలు సంపాదించవచ్చు… ఎలాగంటే..!

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!