Malaria Vaccine: ఇకపై మలేరియా వ్యాధికి చెక్.. ప్రపంచంలోనే మొదటిసారి అందుబాటులోకొచ్చిన వ్యాక్సిన్
ప్రపంచంలోనే మొట్టమొదటి మలేరియా వ్యాధి నిరోధక టీకా అందుబాటులోకి వచ్చింది. త్వరలోనే ఇది పిల్లలకు ఇచ్చే సాధారణ టీకాల ప్రణాళికలో భాగం కానుంది.
Malaria vaccine: ప్రపంచంలోనే మొట్టమొదటి మలేరియా వ్యాధి నిరోధక టీకా అందుబాటులోకి వచ్చింది. త్వరలోనే ఇది పిల్లలకు ఇచ్చే సాధారణ టీకాల ప్రణాళికలో భాగం కానుంది. వచ్చే మూడేళ్లలో కనీసం 3 లక్షల మంది చిన్నారులకు ఈ వ్యాక్సిన్ ఇవ్వాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ భావిస్తోంది. ఈ వ్యాక్సిన్ తయారీ, పరిశోధన, పరీక్షలు… అన్నింటికీ కలిపి మొత్తం 30 ఏళ్ల సమయం పట్టింది. కొత్తగా అభివృద్ధి చేసిన మలేరియా వ్యాక్సిన్.. మానవుల్లోని రోగ నిరోధక వ్యవస్థకు తగిన శిక్షణనిచ్చి మలేరియా వ్యాధికారక సూక్ష్మజీవులపై పోరాడేందుకు ఈ టీకా దోహదం చేస్తుందని ఓ నివేదిక వెల్లడించింది.
మలేరియా వ్యాధికి ప్రధాన కారణం దోమకాటు. ఏడాది క్రితం మొదలైన కరోనా మహమ్మారి ప్రపంచాన్నే కుదిపేస్తోంది. కంటికి కనిపించకుండా లక్షలాది మంది ప్రాణాలను చిదిమేస్తోంది. కాగా, కంటికి కనిపించే దోమలు వచ్చి శతాబ్దాలైంది. అయినా మనం వాటిని ఏమీ చెయ్యలేకపోతున్నాం. ముఖ్యంగా దోమల ద్వారా సంక్రమించే మలేరియా.. ప్రాణాలు తీసేస్తోంది. అయినా సరే మనం ఇన్నేళ్లుగా వ్యాక్సిన్ తయారుచేసుకోలేకపోయాం. నిజానికి ఎన్నో వ్యాక్సిన్లు తయారుచేసినా వాటిలో మలేరియాతో పోరాడే శక్తి సరిపడా లేకపోవడంతో… అవేవీ ఫలితం ఇవ్వలేకపోయాయి. తాజాగా… ఆక్స్‌ఫర్ట్ యూనివర్శిటీలోని పరిశోధకుల టీమ్, కొంత మంది పార్ట్‌నర్లూ కలిసి… R21/Matrix M అనే మలేరియా వ్యాక్సిన్ అభివృద్ధి చేశారని ఓ రిపోర్టు చెబుతోంది.
ప్రస్తుతం అది llb దశ ట్రయల్ జరుపుకుంటోంది. ఈ దశలో అది 12 నెలలుగా 77 శాతం ఎఫికసీ చూపించింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ అధ్యయనం ప్రకారం ఎఫికసీ 75 శాతం ఉండాలి. ఇది మరో 2 శాతం ఎక్కువే ఉంది. ఈ వ్యాక్సిన్ వల్ల ఎలాంటి దుష్ఫలితాలు లేవని, మలేరియాను అరికట్టేందుకు ఇది ప్రభావవంతంగా పనిచేస్తుందని క్లినికల్ ట్రయల్స్‌లో ఇప్పటికే వెల్లడైంది. అయితే ఇది ప్రపంచ మొదటి మలేరియా వ్యాక్సిన్ కాబోతోందనడానికి శుభ సూచిక అని నిపుణులు చెబుతున్నారు. ప్రపంచంలో ఎంతోమంది మరణాలకు కారణమవుతున్న మలేరియా వ్యాధి నిర్మూలనలో కచ్చితంగా ఇది పెను మార్పులను తీసుకురానుందని వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచవ్యాప్తంగా మరణాల రేటు పెరుగుతోంది. ఈ నేపథ్యంలోనే ప్రపంచ దేశాలు కరోనా వ్యాక్సిన్లకు అనుమతులు ఇచ్చేశాయి. మలేరియా వ్యాక్సిన్‌కి అలా వెంటనే అనుమతులు ఇవ్వరు. ఇంకో రెండేళ్లపాటూ పరిశోధనలు కొనసాగిస్తారు. మరిన్ని ట్రయల్స్ జరుపుతారు. ఆ తర్వాతే అనుమతి ఇవ్వనున్నట్లు సమాచారం. ప్రస్తుతం కరోనాకి కోవిషీల్డ్ వ్యాక్సిన్ తయారుచేస్తున్న పుణెలోని సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా.. మలేరియా వ్యాక్సిన్ ఉత్పత్తికి కూడా డీల్ కుదుర్చుకుంది. ఏడాదికి 20 కోట్ల డోసులు ఉత్పత్తి చేస్తామని తెలిపింది.
ఈ వ్యాక్సిన్‌కి అనుమతి లభిస్తే… వర్షాకాలానికి ముందు దీన్ని ప్రజలు తీసుకోవచ్చు. దీంతో.. మలేరియా రాకముందే.. ప్రజల బాడీలో దాన్ని ఎదుర్కొనే యాంటీబాడీలు తయారవుతాయి. ఆ తర్వాత దోమలు మలేరియాను వ్యాపింపజేసినా.. ఏలాంటి ప్రభావం ఉందంటున్నారు సైంటిస్టులు.
మలేరియా వ్యాధి లక్షణాలు:
- ఆడ దోమలు మనుషుల్ని కుట్టినప్పుడు మలేరియా వచ్చే ప్రమాదం ఉంటుంది.
- దోమల వల్ల మనిషి శరీరంలోకి వెళ్లే పారాసైట్లు… రక్తంలో చేరి ఎర్రరక్త కణాల్ని నాశనం చేస్తాయి.
- పారాసైట్లు బాడీలో చేరిన 3 రోజుల్లో మలేరియా లక్షణాలు తీవ్రంగా కనిపిస్తాయి.
- తీవ్ర జ్వరం, తలనొప్పి, వికారం, వాంతులు, కడుపునొప్పి, విరేచనాలు, రక్తహీనత, కండరాల నొప్పి, చెమట, కోమా ఇలా చాలా లక్షణాలు కనిపిస్తాయి.
- 2019లో ప్రపంచవ్యాప్తంగా 22.9 కోట్ల మలేరియా కేసులు నమోదయ్యాయి.
- 2019లో 4,09,000 మంది మలేరియాతో మరణాలు.
- మలేరియాతో చనిపోతున్న వారిలో చిన్నారులే ఎక్కువ
- 2019లో 2,74,000 (67 శాతం) మంది పిల్లలు చనిపోయారు.
- ఎక్కువగా ఆఫ్రికాలో మలేరియా కేసులు నమోదవుతున్నాయి.
Read Also… Libya boat accident: మరోసారి మధ్యధరా సముద్రంలో పడవ మునక.. లిబియా తీరంలో 130 మంది శరణార్ధుల మృతి